Home » Entertainment » Janaki Kalaganaledu 8 November 2022 Full Episode
Entertainment

Janaki Kalaganaledu 8 Nov Today Episode : జ్ఞానాంబ వేడుకున్నా కనికరించని జానకి.. అఖిల్ ను అరెస్ట్ చేయించి అతడి జీవితం నాశనం చేయడంతో తనను ఇంట్లో నుంచి గెంటేసిన రామా

Authored By
Varun G
The Telugu News | Updated on: November 8, 2022, 9:06 am
Advertisement

Janaki Kalaganaledu 8 Nov Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 8 నవంబర్ 2022, మంగళవారం ఎపిసోడ్ 427 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మీరు ఏం టెన్షన్ పడకండి. మీ కూతురుకు ఈ పరిస్థితి తీసుకొచ్చిన వాడికి ఖచ్చితంగా శిక్ష పడేలా చేస్తా అని రాజీకి మాట ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతుంది జానకి. మరోవైపు జానకి నా దొంగ కడుపు గురించే నా కొంప ముంచబోతోందా అని అనుకుంటుంది మల్లిక. మళ్లీ అందరూ జానకి గురించి ఎదురుచూస్తూ ఉంటారు. ఇంత ఉదయాన్నే జానకి ఎక్కడికి వెళ్లి ఉంటుంది. ఏదైనా గుడికి వెళ్లి ఉంటుంది. నువ్వేం కంగారు పడకు అని అంటాడు గోవిందరాజు. జ్ఞానాంబ కూడా అదే అంటుంది. ఇంతలో జ్ఞానాంబ ఇంటికి పోలీసులు వస్తారు. వాళ్లను చూసి తనకోసమే వచ్చారేమో అని అనుకొని దాక్కోవడానికి ట్రై చేస్తుంది మల్లిక. చివరకు వెళ్లి బాత్ రూమ్ లో దాక్కుంటుంది. మల్లిక నువ్వు టెన్షన్ లో ఏం చేస్తున్నావో నీకే అర్థం కావడం లేదే.. రూమ్ దాకా వచ్చిన వాళ్లు బాత్ రూమ్ దాకా రారా అని మళ్లీ బయటికి వచ్చి మంచం వెనుక దాక్కుంటుంది.

Advertisement

janaki kalaganaledu 8 november 2022 full episode

ఇంతలో ఇంట్లోకి పోలీసులు రావడం చూసి జ్ఞానాంబ, గోవిందరాజు షాక్ అవుతారు. అప్పుడే ఇంట్లో వాళ్లంతా బయటికి వస్తారు. జెస్సీ కూడా బయటికి వస్తుంది. నమస్కారం ఇన్ స్పెక్టర్ గారు. మీరేంటి ఇలా వచ్చారు అని అడుగుతాడు గోవిందరాజు. దీంతో మీ ఇంట్లో ఒక పర్సన్ మీద కంప్లయింట్ ఫైల్ అయింది. అందుకే అరెస్ట్ చేసి తీసుకెళ్దాం అని వచ్చాం అంటాడు ఎస్ఐ. దీంతో ఇంట్లో వాళ్లంతా షాక్ అవుతారు. ఆ మాటలు విన్న మల్లిక.. వామ్మో అంటూ ఏడుస్తుంది. గణేశా.. ఈ గండం గట్టెక్కించు అంటూ వేడుకుంటుంది మల్లిక. ఎవరో ఇంటికి వెళ్లాల్సిన వాళ్లు పొరపాటున మా ఇంటికి వచ్చినట్టున్నారు అని అంటాడు రామా. దీంతో లేదు ఇదే ఇల్లు. కంప్లయింట్ ఫైల్ అయింది ఇదే ఇంట్లో ఉన్న వ్యక్తి మీద అని అంటాడు ఎస్ఐ. అరెస్ట్ చేసి తీసుకెళ్లాల్సినంత నేరం మా ఇంట్లో వాళ్లు ఏం చేశారు. ఎవరు చేశారు అని అడుగుతుంది జ్ఞానాంబ. దీంతో అఖిల్ అంటాడు ఎస్ఐ.

Advertisement

అఖిల్ పేరు విని అందరూ షాక్ అవుతారు అఖిల్ తో సహా. అఖిల్ అనే వ్యక్తి ఒక అమ్మాయి మీద మర్డర్ అటెంప్ట్ చేశాడు అని అంటాడు పోలీసు. ఇవన్నీ విన్న మల్లిక వెంటనే బయటికి వస్తుంది. అతడిని అరెస్ట్ చేయడానికి వారెంట్ తో సహా వచ్చాం. పిలిపించండి అంటాడు ఎస్ఐ.

అఖిల్ మీద కంప్లయింట్ ఫైల్ అయింది పొరపాటుతోనే, ధ్వేషంతోనో కాదు. కేసు పెట్టింది కూడా మీ ఇంట్లో మనిషే అంటాడు ఎస్ఐ. దీంతో మరోసారి అందరూ షాక్ అవుతారు. అఖిల్ కు అర్థం అవుతుంది. జానకే కేసు పెట్టిందని అనుకుంటాడు అఖిల్. ఇంతలో మల్లిక అక్కడికి వస్తుంది.

Advertisement

మా ఇంట్లో మనిషి..మా అఖిల్ మీద ఫిర్యాదు చేశారా? ఎవరు అని అడుగుతాడు గోవిందరాజు. దీంతో జానకి గారు అంటాడు ఎస్ఐ. దీంతో అందరూ షాక్ అవుతారు. ఇంతలో లోపలికి వస్తుంది జానకి. జానకి గారు ఏంటండి ఇదంతా. పోలీసులు వచ్చి మన అఖిల్ ఎవరో అమ్మాయి మీద హత్యప్రయత్నం చేశాడని చెబుతున్నారు. మీరే కేసు పెట్టారని చెబుతున్నారు. అదంతా అబద్ధం అని చెప్పండి జానకి గారు అంటాడు రామా.

Janaki Kalaganaledu 8 Nov Today Episode : నేనే తప్పు చేయలేదన్న అఖిల్

జానకి నిలదీసే స్థాయి దాటి పోలీసు కేసు పెట్టేదాకా ఎందుకు వెళ్లిందో నాకు తెలియదు. ఇప్పుడు అఖిల్ పై కేసు నమోదు అయితే అతడి భవిష్యత్తు నాశనం అవుతుంది. అందుకే ముందు పోలీసులను వెళ్లిపోమని చెప్పు. మనం ఒకసారి నిజానిజాలు మాట్లాడుకుందాం అంటుంది జ్ఞానాంబ.

దీంతో క్షమించండి అత్తయ్య గారు ఇది నింద కాదు. నిజం అంటంది జానకి. మాధురి అనే అమ్మాయి మీద అఖిల్ హత్యా ప్రయత్నం చేశాడన్నది వాస్తవం అత్తయ్య గారు. అందుకు నేనే ప్రత్యక్ష సాక్షిని అంటుంది జానకి. అందుకే నేనే స్వయంగా కంప్లయింట్ ఇచ్చాను అంటుంది జానకి.

అఖిల్ దోషిగా అనుమానం ఉంటే నేనే నిజానిజాలు విచారించేదాన్ని. కానీ.. నేనే ప్రత్యక్షంగా చూశాను అంటుంది జానకి. ఒకసారి మన కళ్లే మనల్ని మోసం చేస్తాయి అంటాడు గోవిందరాజు. జెస్సీ కూడా ప్లీజ్ అక్క ఇప్పుడిప్పుడే అఖిల్ కెరీర్ మీద దృష్టి పెడుతున్నాడు.

Advertisement

కంప్లయింట్ వెనక్కి తీసుకో అక్క అంటుంది జెస్సీ. రామా కూడా అదే చెబుతాడు కానీ.. జానకి వినదు. నేను కంప్లయింట్ ఇచ్చాను అని కాదు.. నేరం చేశాడో లేదో అఖిల్ నే పిలిచి అడగండి అంటుంది జానకి. దీంతో ఒరేయ్ అఖిల్ అని పిలుస్తాడు రామా.

దీంతో అఖిల్ టెన్షన్ పడతాడు. ఇంతలో అఖిల్ అక్కడికి వస్తాడు. రేయ్ అఖిల్. మీ వదిన చెప్పినట్టు నువ్వు ఎవరైనా అమ్మాయి మీద హత్యాప్రయత్నం చేశావా అని అడుగుతాడు రామా. హత్యాప్రయత్నం ఏంటన్నయ్యా అంటాడు. అదేం లేదు అన్నయ్య అంతా అబద్ధం అన్నయ్య అంటాడు అఖిల్.

నేను కొత్త కోర్సులో జాయిన్ అయి దానికి సంబంధించిన బుక్స్ కొనుక్కొని ఇంట్లోనే కూర్చొని చదువుతున్నా. నా కెరీర్ మీదనే దృష్టి పెట్టాను. అసలు నాకు ఆ మాధురి ఎవరో కూడా తెలియదు అన్నయ్య అంటాడు అఖిల్. మరి వదిన.. నేను చేయని నేరానికి నా మీద ఎందుకు ఫిర్యాదు చేసిందో ఏమో అంటాడు అఖిల్.

అమ్మ.. నీకు చేతులెత్తి దండం పెడతాను అమ్మ. నేను ఏ తప్పు చేయలేదు అమ్మ అంటాడు అఖిల్. వదిన నీకు చేతులెత్తి దండం పెడతాను. నేను ఏ తప్పు చేయలేదు వదిన. నీ కాళ్లు పట్టుకుంటాను. నా లైఫ్ నాశనం చేయకు అంటాడు అఖిల్. అయినా కూడా వినకుండా అఖిల్ ను అరెస్ట్ చేయిస్తుంది జానకి.

Advertisement

దీంతో జ్ఞానాంబ అక్కడే కుప్పకూలిపోతుంది. మీరు చూసినా కూడా అఖిల్ ఖచ్చితంగా చంపాడని గ్యారెంటీ లేదు కదా అని జానకితో గొడవ పెట్టుకుంటాడు రామా. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి