Janaki Kalaganaledu 9 Dec Today Episode : జానకి కలగనలేదు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 9 డిసెంబర్ 2021, గురువారం ఎపిసోడ్ 198 ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జానకి గారు రేపు ఉదయాన్నే కోచింగ్ కు వెళ్లాలి కదా.. ఏమాత్రం ఆలోచించకుండా.. పెందలాడే పడుకోండి అంటాడు రామా. కానీ.. జానకి మాత్రం నా మనసులో ఏదో ఒక మూలన భయం అలాగే ఉంది అంటుంది. నేను చదువు గురించి కలలో కూడా ఆలోచన చేయనని మాటిచ్చాను. ఒకవేళ ఆత్తయ్య గారికి ఇచ్చిన మాటను తప్పిన దాన్ని అవుతాను.. అంటే మీ చదువు వల్ల ఎవరికో ఎలాంటి నష్టమో కలిగితే అది మోసం చేసినట్టు కానీ.. మీరు చదువుకొని ఎవ్వరినీ మోసం చేయడం లేదు కదా.. అంటాడు రామా.
ప్రజలకు సేవ చేసే మీ గొప్ప గుణం చూసి గర్వంగా మారుతుంది. వీటన్నింటినీ అర్థం చేసుకోవడానికి మా అమ్మకు కాస్త సమయం పడుతుంది. అందుకని ఈ విషయం గురించి మీరు ఇంకేం ఆలోచించకండి అంటాడు రామా. కానీ.. జానకి మాత్రం ఇంకా భయంతోనే ఉంటుంది. నిజాయితీతో కూడిన మీ సంకల్పానికి ఆ దేవుడి అండ ఉంది. అంతా మంచే జరుగుతుంది. ఎప్పటిలాగే కేకులు నేర్చుకోవడానికి అని చెప్పి ఐపీఎస్ కోచింగ్ కు వెళ్లండి. భవిష్యత్తులో ఏదైనా జరిగితే.. దాన్ని ఎలా ఎదుర్కోవాలో.. ఆలోచిద్దాం అంటాడు. రామా.. మీరు వెళ్లి పైన ప్రశాంతంగా పడుకోండి అంటాడు రామా. దీంతో జానకి వెళ్లి పైన పడుకుంటుంది. తననే చూస్తుంటుంది. ఏంటి అంటాడు రామా. పడుకోండి అంటాడు. తనను చూసి నవ్వుతుంది. అలా చూడకండి సిగ్గేస్తుంది అంటాడు రామా.
దీంతో కిందికి దిగి జానకి నీ పక్కన పడుకుంటా అనగానే టెన్షన్ పడతాడు రామా. వద్దండి.. ఇక్కడెందుకు అండి.. పైన పడుకోండి అంటే.. అదేంటండి.. పెళ్లాం వచ్చి పక్కన పడుకుంటానంటే.. మీరేంటి పైన పడుకోమంటున్నారు అంటుంది జానకి. వద్దండి. మీరు కింద పడుకోవడం మీకు కష్టంగా ఉంటుంది కదా.. ఎందుకు మీకు పైన పడుకోండి అంటాడు.
కానీ.. జానకి మాత్రం వినదు. ఏం కాదు పడుకోండి అంటుంది జానకి. తననే చూస్తుంటుంది. దీంతో రామాకు ఏం చేయాలో అర్థం కాదు. కప్పుకోండి అని దుప్పటి ఇస్తాడు రామా. తన గుండెల మీద చేయి వేస్తుంది జానకి. ప్రేమించే భర్త దొరికితే ఆడపిల్ల జీవితం నందనవనంలా ఉంటుందని.. ఒకవేళ అర్థం చేసుకునే భర్త దొరికితే ఆ ఆడపిల్ల కాపురం స్వర్గంలా ఉంటుందని మా అమ్మ చెప్పింది.
నాకు ప్రేమించే భర్త మాత్రమే కాదు.. నా మనసు అర్థం చేసుకునే భర్త దొరికాడు. నేను ఏ జన్మలోనో పుణ్యం చేసుకొని ఉంటాను. రామా గారు. ఒకవేళ మా అమ్మానాన్నలు బతికి ఉంటే.. మీరు నా కోసం.. నా కలను నెరవేర్చడం కోసం చేసే తీరు చూస్తే అల్లుడికి గుడి కట్టించేవాళ్లు తెలుసా అంటుంది జానకి.
ఆ తర్వాత ఇద్దరూ నిద్రపోతారు. తెల్లారుతుంది. ఉదయం లేవగానే.. పుస్తకాలను సంచిలో పెడతాడు రామా. జానకి కూడా రెడీ అవుతుంది. టైమ్ అవుతోంది పదండి.. అంటాడు. ఏమండి.. మరో విషయం దాచినట్టు తెలిస్తే అత్తయ్య గారు నన్ను క్షమించను అన్నారు కదా. నేను రహస్యంగా చదువుకోవడానికి వెళ్తున్నానన్న విషయం అత్తయ్య గారికి తెలిస్తే ఎలా అంటుంది జానకి.
కానీ.. రామా వినడు. నేనున్నాను కదండి మీకు భయం ఎందుకు పదండి అంటాడు రామా. మరోవైపు జ్ఞానాంబకు గోవిందరాజు గోళ్లు తీస్తుంటాడు. ఇంతలో రామా, జానకి అక్కడికి వస్తారు. అమ్మ.. జానకి ఈరోజు నుంచి రాజమండ్రికి కేకుల తయారీకి వెళ్తుంది అని చెబుతాడు రామా.
దీంతో అవసరం లేదు అంటుంది జ్ఞానాంబ. జానకి ఇక మీదట కేకులు నేర్చుకోవడానికి వెళ్లాల్సిన అవసరం లేదు అంటుంది. నాకెందుకో నా కోడలును అంతదూరం పంపించడం ఇష్టం లేదు అంటుంది జ్ఞానాంబ. ఇంతకుముందు తను కేకులు నేర్చుకోవడం ఇష్టం అంటే కాదంటే బాధపడుతుంది అనుకున్నా. కానీ.. ఇప్పుడు తను బాగా చదువుకుంది అని తెలిశాక.. అలాంటి పనులు చేసే చోటుకి నా కోడలును పంపించడం నాకు ఇష్టం లేదు అంటుంది జ్ఞానాంబ.
పూర్తిగా నేర్చుకోలేదు కదా. సగంలోనే వదిలేశారు కదా. పూర్తిగా నేర్చుకోనీయు అమ్మ.. అంటాడు రామా. ఎందుకురా.. మనకు కేకుల తయారీ ఎందుకురా. స్వీటు షాపు ఉంది కదా.. అది చాలురా మనకు అంటుంది జ్ఞానాంబ. అలా కాదమ్మా.. తరాలు మారుతున్నాయి. డిమాండ్ కు తగ్గట్టుగా మనం కూడా మారాలి కదా అమ్మ అంటాడు రామా.
జానకి తరుపున నేను అడుగుతున్నా. కాదనకమ్మా.. అని బతిమిలాడుతాడు రామా. దీంతో ఓకే చెబుతుంది జ్ఞానాంబ. కేకులు నేర్చుకోవడానికని చెప్పి మనం ఇలా అబద్ధం చెప్పి వస్తున్నాం కదా. ఒకవేళ అత్తయ్య గారు కేకుల షాపు గురించి ఎంక్వయిరీ చేస్తే ఎలా అంటాడు రామా. మరోవైపు రాజమండ్రికి వెళ్లి కేకులు తయారు చేసే షాపునకు వెళ్తుంది మల్లిక. అక్కడ జానకితో మాట్లాడాలని కేకుల షాపు ఓనర్ ను అడుగుతుంది. కానీ.. జానకి అని పిలవగానే ఓ ముసలావిడ వస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.