Janaki Kalaganaledu 9 Feb Today Episode : వెన్నెల, దిలీప్ ఆత్మహత్యాయత్నం.. ఈ విషయం తెలిసి జ్ఞానాంబ‌ ఏం చేస్తుంది.. ఇంతలో జానకికి మరో ట్విస్ట్

Advertisement
Advertisement

Janaki Kalaganaledu 9 Feb Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 9 ఫిబ్రవరి 2022, బుధవారం ఎపిసోడ్ 233 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రామా, జానకి ఇద్దరూ తమ కులదేవతకు పూజ చేస్తుంటారు. ఇంతలో దేవతకు ప్రసాదం సమర్పించేందుకు ప్రసాదం కోసం వెతుకుతూ ఉంటుంది జానకి. కానీ.. తనకు ప్రసాదం కనిపించదు. దీంతో జానకి షాక్ అవుతుంది. రామా గారు.. అత్తయ్య గారు పంపించిన ప్రసాదం కనిపించడం లేదు. ఇందులోనే పెట్టాను. కానీ.. ఏమైందో అర్థం కావడం లేదు అంటుంది జానకి. ఖచ్చితంగా పూజలో ప్రసాదం సమర్పించాలని అత్తయ్య గారు చెప్పారు. లేకపోతే పూజకు అర్థమే లేదని అత్తయ్య గారు చెప్పారు. ఏం చేయాలో అర్థం కావడం లేదండి అంటుంది జానకి.

Advertisement

janaki kalaganaledu 9 february 2022 full episode

మరోవైపు జ్ఞానాంబ‌.. వెన్నెల గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఏం చేయాలో తనకు అర్థం కాదు. ఇంతలో చికిత వచ్చి.. పెద్దమ్మ గారు ప్రసాదం అంటుంది. దీంతో ప్రసాదం ఏంటి అంటుంది. మీరు ఇచ్చిన ప్రసాదం జానకమ్మ గారు ఇంట్లో మరిచిపోయినట్టున్నారు అని అంటుంది చికిత. దీంతో జ్ఞానాంబ‌ ప్రసాదాన్ని చూసి షాక్ అవుతుంది. ఎవరికి వాళ్లే ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. ఈ ఇంట్లోని ఆచారాలను కూడా పాటించడం లేదు. అందరికీ బుద్ధి వచ్చేలా సమాధానం చెబుతాను అని చెప్పి ఆ ప్రసాదాన్ని తీసుకొని వెళ్తుంది జ్ఞానాంబ‌. మరోవైపు విష్ణు, మల్లిక ఇద్దరూ అడవుల్లో తిరుగుతూ ఉంటారు. వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చాయి.. పదండి వెళ్దాం ఇక అంటుంది. వామ్మో నేను రాను. నావల్ల కాదు అంటాడు విష్ణు. రండి.. లెగండి అంటుంది. ఇంతలో అక్కడికి ఇద్దరు కుర్రాళ్లు వస్తారు.

Advertisement

మల్లికను ఫ్లర్ట్ చేస్తుంటారు. దేవకన్యలా ఉంది మామ అంటారు. మామూలు అందం కాదురా అది అంటారు. ఇంతలో విష్ణు కలగజేసుకొని ఏరా.. తను దేవకన్యలా ఉందా అంటూ వాళ్లను కొట్టబోతాడు. దీంతో వాళ్లు అక్కడి నుంచి పారిపోతారు.

మరోవైపు ప్రసాదం కోసం అక్కడే వెతుకుతూ ఉంటుంది జానకి. కానీ.. మీరు ఈ ప్రసాదాన్ని ఇంట్లోనే మరిచిపోయారు అంటాడు రామా. లేదు రామా గారు. నాకు తెలిసి ఇలాంటి ముఖ్యమైన విషయాల్లో అజాగ్రత్తగా ఉండను అంటుంది. తప్పు మీది కాదండి.. కంగారులో మరిచిపోయారు అంటాడు రామా.

ఇంతలో జ్ఞానాంబ‌ రామాకు ఫోన్ చేస్తుంది. రామా.. కులదేవత ఆరాధన పూజ మొదలు పెట్టారా అని అడుగుతుంది జ్ఞానాంబ‌. అమ్మవారికి నైవేద్యం సమర్పించారా అని అడుగుతుంది. అమ్మ.. జానకి గారు ఇప్పుడే నైవేద్యాన్ని పెడుతున్నారమ్మ అంటాడు రామా.

Janaki Kalaganaledu 9 Feb Today Episode : నైవేద్యం సమర్పిస్తున్నామని జ్ఞానాంబ‌కు అబద్ధం చెప్పిన రామా

దీంతో జ్ఞానాంబ‌కు కోపం వస్తుంది. సరే.. అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది జ్ఞానాంబ‌. వీడు ఇంట్లో ప్రసాదాన్ని మరిచిపోయి ఎందుకు ఇలా అబద్ధం చెబుతున్నాడు అని అనుకుంటుంది జ్ఞానాంబ‌. రామా గారు ఎందుకు అత్తయ్య గారికి అబద్ధం చెప్పారు అంటుంది జానకి.

మీ భర్తకు జీవితాంతం ఇలాంటి అబద్ధాల బాధ ఉండకుండా ఉండాలంటే మీరు ఇప్పుడే నిజం చెప్పాలి అని అంటాడు రామా. తన చేతిని తీసుకొని తన తల మీద పెట్టి నిజం చెప్పండి అంటాడు. నిజం మాత్రమే చెప్పండి అంటాడు రామా. చెప్పండి.. అంటాడు.

ఇంతలో జ్ఞానాంబ‌.. గుడికి కారులో ప్రసాదాన్ని తీసుకొని వస్తుంది. నిజం దాచినందుకు బాధపడాలి కానీ.. చెబుతున్నందుకు కాదండి.. చెప్పండి. ఉన్నపళంగా మీరు చదువును మానేయాలని అనుకోవడానికి కారణం ఏంటి అని ప్రశ్నిస్తాడు రామా.

దీంతో.. రామా గారు అసలు జరిగింది ఏంటంటే .. అంటూ ఏదో చెప్పబోతుంది జానకి. ఇంతలో జ్ఞానాంబ‌ వచ్చి జానకి అంటుంది జ్ఞానాంబ‌. దీంతో రామా, జానకి షాక్ అవుతారు. మరోవైపు వెన్నెల దిలీప్ ను కలుస్తుంది. జ్ఞానాంబ‌ చెప్పిన విషయాలను దిలీప్ కు చెబుతుంది.

ఏంటి వెన్నెలా నువ్వు చెప్పేది.. మన ప్రేమ విషయం మీ అమ్మకు తెలిసిపోయిందా అంటాడు దిలీప్. మా అమ్మ రామచంద్రాపురం వాళ్లతో మాట్లాడింది. రెండు రోజుల్లో నిశ్చితార్థం. ఇంతకుముందు అంటే ఏదో ఒకటి చెప్పి నిశ్చితార్థం ఆపే అవకాశం ఉండేది. ఇప్పుడు ఆ అవకాశం కూడా లేకుండా పోయింది అంటుంది వెన్నెల.

అది కాదు వెన్నెల.. మీ అన్నయ్యకు ఈ విషయం చెప్పొచ్చు కదా. ఆయన ఏమైనా ఈ విషయంలో మనకు సాయం చేస్తాడేమో అంటాడు దిలీప్. కానీ.. వెన్నెల అది కుదరదు అంటుంది. మా అమ్మ మాటే మా అన్న మాట కూడా అంటుంది వెన్నెల.

దీంతో చచ్చిపోదాం వెన్నెల అంటాడు దిలీప్. కలసి బతకాలని కలలు కన్నాం. ఆ దేవుడు మనకు ఆ అదృష్టం ఇవ్వలేదు. కనీసం కలిసి అయినా చనిపోదాం అంటాడు దిలీప్. మరోవైపు నీ చదువు గురించి రామాతో ఇంకోసారి నువ్వు చర్చించకూడదు అని జానకితో చెబుతుంది జ్ఞానాంబ‌.

చదువుకోవాలనే ఆలోచన నీ మనసులో ఏ మూలన ఉన్నా ఆ దీపంతో పాటు.. నీ చదువుకునే ఆలోచనను కూడా వదిలేయ్ అని జానకికి చెబుతుంది జ్ఞానాంబ‌. దీంతో ఏడుస్తూనే దీపాన్ని వదిలేస్తుంది జానకి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

 

Advertisement

Recent Posts

Chicken And Mutton : వామ్మో.. మటన్ రేటు రూ.1500.. చికెన్ రూ.350.. జేబులకు చిల్లులు గ్యారంటీ..!

Chicken and Mutton  : తెలంగాణ కుంభమేళాగా Telangana Medaram Jatara  2026  పిలవబడే మేడారం మహా జాతరలో భక్తిభావం…

49 minutes ago

Om Shanti Shanti Shantihi Movie Review : ఓం శాంతి శాంతి శాంతి మూవీ ఫ‌స్ట్ రివ్యూ అండ్ రేటింగ్‌..!

Om Shanti Shanti Shantihi Movie Review : టాలీవుడ్ Tollywood లో వైవిధ్యమైన చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ తరుణ్…

2 hours ago

Today Gold Price on January 30th 2026 : పసిడి ప్రియులకు భారీ షాక్..ఏకంగా రూ.11 వేలకు పైగా పెరిగిన బంగారం..ఈరోజు ఎంతంటే !

Today Gold Price on January 30th 2026 : బంగారం ధరల పెరుగుదల పసిడి ప్రియులకు కోలుకోలేని షాక్…

2 hours ago

Karthika Deepam 2 Today Episode : కార్తీకదీపం 2 జనవరి 30 ఎపిసోడ్: జ్యోత్స్నకు షాకిచ్చిన పారిజాతం.. జ్యోత్స్న పాపం పండిందా? పారిజాతం తీసుకున్న నిర్ణయం ఏంటి? శ్రీధర్ ఎమోషనల్..!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న 'కార్తీక దీపం 2' సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ ఉత్కంఠ రేపుతోంది. కార్తీక్, దీపల…

3 hours ago

Samsung Galaxy S26 : గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న శాంసంగ్ Galaxy S26 Ultra ధర? లీకైన వివరాలు ఇవే!

Samsung Galaxy S26  : శాంసంగ్ ( Samsung ) అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'గెలాక్సీ ఎస్26 సిరీస్'…

4 hours ago

Guava : వీరు ఎట్టి పరిస్థితుల్లో జామపండు తినకూడదు..! ఏమికాదులే అని తిన్నారో అంతే సంగతి !!

Guava : జామపండు ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన పోషకాల గని అనడంలో సందేహం లేదు. నారింజ పండు కంటే ఎక్కువ…

5 hours ago

Zodiac Signs : 30 జనవరి 2026 శుక్రవారం నేటి రాశిఫలాలు.. ఈ రాశి వాళ్ల‌ జీవితంలో అనుకోని మలుపు..!

Zodiac Signs : శుక్రవారం, జనవరి 30, 2026 నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. వైదిక జ్యోతిష్య…

6 hours ago