Janaki Kalaganaledu 9 Nov Today Episode : జానకితో అఖిల్ విషయంలో గొడవ పెట్టుకొని ఇంట్లో నుంచి గెంటేసిన రామా.. జ్ఞానాంబ ఫ్యామిలీ ముక్కలు కావడానికి జానకే కారణం అయిందా?

Janaki Kalaganaledu 9 Nov Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 9 నవంబర్ 2022, బుధవారం ఎపిసోడ్ 428 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అఖిల్ ఎంత బతిమిలాడినా కూడా జానకి మాత్రం అస్సలు కనికరించదు. నువ్వు తప్పు చేశావు. ఆ తప్పును ఒప్పుకో అంటుంది. రామా కూడా బతిమిలాడుతాడు. కానీ.. రామా మాటలు కూడా జానకి వినదు. ఇన్ స్పెక్టర్ గారు.. నేను కంప్లయింట్ ఫైల్ చేసినట్టు అఖిల్ ను అరెస్ట్ చేసి తీసుకెళ్లండి అంటుంది జానకి. దీంతో అందరూ షాక్ అవుతారు. కానిస్టేబుల్స్ టేక్ హిమ్ అని వాళ్లు అఖిల్ ను పట్టుకుంటారు. రాకపోవడంతో లాక్కెళ్తారు. అతడిని అరెస్ట్ చేయొద్దంటూ ఇంటి సభ్యులుమొత్తం రిక్వెస్ట్ చేస్తారు. అయినా కూడా పోలీసులు అతడిని అరెస్ట్ చేసి బయటికి తీసుకొచ్చి జీపులో ఎక్కిస్తారు. ఆ తర్వాత జెస్సీ ఏడుస్తూ ఉంటుంది. అయినా కూడా జీపులో అక్కడి నుంచి అఖిల్ ను తీసుకెళ్తారు.

janaki kalaganaledu 9 november 2022 full episode

చివరకు అరెస్ట్ చేసి అఖిల్ ను తీసుకెళ్లడంతో జ్ఞానాంబకు ఏం చేయాలో అర్థం కాదు. అందరూ జానకి వైపే చూస్తారు. పెద్ద సినిమా రిలీజ్ అయినా సరే.. క్రికెట్ పిచ్చితో దాన్ని ఎవరూ పట్టించుకోనట్టు అఖిల్ గొడవ వల్ల నా విషయాన్ని జానకి పెద్దగా పట్టించుకోలేదు. దీన్ని అడ్డు పెట్టుకొని జానకిని ఒక ఆట ఆడుకోవాలి. దానికి జెస్సీని వాడుకోవాలి అని జెస్సీ దగ్గరికి వెళ్లి దొంగ ఏడుపు ఏడుస్తుంది మల్లిక. నువ్వు ధైర్యంగా ఉండు. నీకు తోడుగా మేమున్నాం. నీ భర్త నిర్దోషి అని బయటికి తీసుకొచ్చేంత తెగింపు నీలో ఉండాలి. నువ్వు నీ భర్తను విడిపించుకుంటావనే నమ్మకం నాకు ఉంది జెస్సీ అంటుంది మల్లిక. దీంతో అక్క.. అఖిల్ మంచివాడో కాదో కానీ.. చెడ్డవాడు మాత్రం కాదు అంటుంది జెస్సీ. అయిన వాళ్లను అర్థం చేసుకోకుండా వాళ్ల మనసును కాస్త బాధపెడతాడేమో కానీ.. ఆడపిల్ల మీద హత్యాప్రయత్నం చేసేంత దుర్మార్గుడు మాత్రం కాదు అంటుంది జెస్సీ. ఈ మధ్యే మారాడు. జీవితం విలువ తెలుసుకున్నాడు. తన కెరీర్ మీద ధ్యాస పెట్టాడు. అఖిల్ ఎలాంటి వాడో ఏంటో నీకు తెలియక కాదు.. ఎక్కడో పొరపాటు పడి ఉంటావు. దయచేసి కంప్లయింట్ ను విత్ డ్రా చేసుకొని అఖిల్ ను విడిపించు. ప్లీజ్ అక్క అంటుంది జెస్సీ.

మీరు ఎందుకు ఇంత ఆవేశ పడి నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా కేసు పెట్టి అఖిల్ ను అరెస్ట్ చేయించారు. అసలు నాకు ఎంత ఆలోచించినా అర్థం కావడం లేదు. కొడుకును పోలీసులు తీసుకెళ్లారని అమ్మ, భర్త పరిస్థితి చూసి జెస్సీ మేము ఎంత బాధపడుతున్నా కూడా మీ తొందరపాటు తనాన్ని ఎందుకు సమర్థించుకుంటున్నారు. ఇప్పటికైనా కేసును వెనక్కి తీసుకోండి అంటాడు రామా.

రామా గారు.. అఖిల్ చెడ్డవాడు అని నేను అనడం లేదు. మారలేదు అని కూడా అనలేదు. తను నాకు బిడ్డ లాంటి వాడు. నిజానికి బాధెక్కువ. అబద్ధానికి సంతోషం ఎక్కువ. ఎంత కాదనుకున్నా నేను చెప్పేది జీర్ణించుకోలేని నిజం. మాధురి అనే అమ్మాయిని అఖిల్ మర్డర్ అటెంప్ట్ చేయడం నా కళ్లారా చూశాను అంటుంది జానకి.

Janaki Kalaganaledu 9 Nov Today Episode : బంధం కంటే న్యాయం గొప్పది అని రామాకు చెప్పిన జానకి

బంధం కంటే న్యాయం గొప్పది రామా గారు. అందుకే కంప్లయింట్ ఇచ్చాను తప్ప మిమ్మల్ని బాధపెట్టాలని కాదు అంటుంది జానకి. ఇంతలో జ్ఞానాంబ అక్కడే కుప్పకూలిపోతుంది. తట్టుకోలేకపోతుంది. ఈ దెబ్బతో జానకికి చెడ్డ పేరు రావాలి. నాకు మంచి పేరు రావాలి అనుకుంటుంది మల్లిక.

అఖిల్ కు ఏం కాదు. నిర్దోషిగా తిరిగి వస్తాడు.. అని అందరూ ఓదార్చుతారు. చూశారు కదా. బాధ తట్టుకోలేక అమ్మ మాట కూడా మాట్లాడలేక పోతోంది. దీన్ని మనసులో తీసుకుంటే అమ్మ ఆరోగ్యం దెబ్బతింటుంది. జెస్సీ జీవితం, తన కడుపులో పెరుగుతున్న బిడ్డ జీవితం. ఒక్కసారి ఆలోచించండి అంటాడు రామా.

ఇలాంటి ఒక హంతకుడి కుటుంబం అని మన మీద ముద్ర పడితే రేపు వెన్నెల పెళ్లి కూడా కష్టమే అంటాడు. అఖిల్ తప్పటడుగులు వేస్తాడేమో కానీ.. ఇంత పెద్ద తప్పు చేసే మనస్తత్వం మాత్రం కాదు అంటాడు. ఒక్కోసారి మన కళ్లెదురుగా ఉన్నది మనకు మరో కోణంలో కనిపిస్తుంది. మీరు అలా భ్రమ పడ్డారేమో.. అంటాడు రామా.

అమ్మా జానకి. పురాణాల్లో నిజాయితీగా ఉన్నవారే భ్రమ పడ్డ సంఘటనలను చూశాం. ఎంతో నీతిగా ఉండే నువ్వు.. ఏదో కంగారులో చూసిన ఘటనను చూసి దానికి అఖిలే కారణం అని అనుకున్నావేమో అంటాడు గోవిందరాజు. అమ్మ పెంపకంలో పెరిగిన మేము ఏదో చిన్న చిన్న తప్పులు చేస్తాం కానీ.. ఒకరిని చంపేంత తప్పు మాత్రం చేయం వదిన అంటాడు విష్ణు.

ఆలస్యం చేయకు అక్క. స్టేషన్ కు వెళ్లి అఖిల్ ను విడిపించుకొని తీసుకురా అక్క అంటుంది జెస్సీ. కావాలని కేసు పెట్టింది కదా జానకి. మీరు ఎంత చెప్పినా తన మనసు ఎందుకు ఒప్పుకుంటుంది. ఒప్పుకోదు అంటుంది మల్లిక. మీకే కాదు.. నాకూ బాధగానే ఉంది అంటుంది జానకి.

కానీ.. ఒక్కసారి మీరు ఆసుపత్రికి వచ్చి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఆ అమ్మాయిని చూడండి అంటుంది జానకి. ఆ అమ్మాయి తల్లిదండ్రుల మనోవేధనను చూడండి. అది చూస్తే మీరు ఇలా మాట్లాడరు. కేసును వెనక్కి తీసుకోవడం ఈ సమస్యకు పరిష్కారం కాదు. దయచేసి ఈ విషయంలో నన్నెవరూ నా మీద ఒత్తిడి తీసుకురావద్దు అని చెప్పి అక్కడి నుంచి తన రూమ్ లోకి వెళ్లిపోతుంది.

తన రూమ్ లోకి వెళ్లి వెక్కి వెక్కి ఏడుస్తుంది జానకి. మిగితా అందరూ అంటే సరే కానీ.. నేనేంటో నా వ్యక్తిత్వం ఏంటో తెలిసిన రామా గారు కూడా కంప్లయింట్ వెనక్కి తీసుకో అనడం బాధగా ఉంది అని అనుకుంటుంది జానకి. ఇంతలో రామా రూమ్ లోకి వస్తాడు.

జానకి గారు మీ పరిస్థితి నాకు అర్థం అవుతోంది కానీ.. ఇంట్లో అందరి గురించి కూడా మీరు ఆలోచించాలి కదా. ఇంట్లో ఇది ఎన్నో సమస్యలకు దారి తీస్తుంది అంటాడు. మనలో మనకే అగాధం సృష్టించే పరిస్థితికి తీసుకొస్తుంది అంటాడు. నాకెంతో సపోర్ట్ చేస్తున్నారు మీరు. కళ్ల ముందు జరిగే అన్యాయానికి నేను నా స్వార్థం చూసుకొని రెస్పాండ్ కాకపోతే నేను చదివే ఐపీఎస్ కు ఏం అర్థం ఉంటుంది అంటుంది జానకి.

అఖిల్ కు క్రమంగా తప్పులు చేయడం స్టార్ట్ అయింది. ఇలాగే వదిలేస్తే అఖిల్ ఏమైపోతాడో అని భయంగా ఉంది అంటుంది జానకి. అసలు ఏం జరిగింది. మీరు ఏం చూశారు. నాకు చెప్పండి అంటాడు రామా. దీంతో అక్కడ జరిగిన విషయం మొత్తం రామాకు చెబుతుంది జానకి.

మీరు చూసిన ఆధారాన్ని బట్టి వంద శాతం ఆ అమ్మాయిని అఖిలే చంపాలని చూశాడన్న గ్యారెంటీ ఏం లేదండి అంటాడు రామా. దీంతో జానకి షాక్ అవుతుంది. మీరు ఒక ఐపీఎస్ ఆఫీసర్ గానే ఆలోచిస్తున్నారు కానీ.. కుటుంబంలో మంచేదో చెడు ఏదో ఆలోచించే శక్తిని కోల్పోతున్నారు అని జానకితో గొడవ పెట్టుకుంటాడు రామా. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Blue Berries | బ్లూబెర్రీస్ .. ఆరోగ్యానికి సంజీవని ..చిన్న పండులో అపారమైన మేలు

Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్‌ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…

2 weeks ago

Remedies | మీన రాశి వారికి ఏలినాటి శని రెండో దశ ప్రారంభం..జాగ్రత్తగా ఉండాలని పండితుల హెచ్చరిక

Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…

2 weeks ago

Rukmini Vasanth | రుక్మిణి వసంత్ పేరిట మోసాలు .. సోషల్ మీడియాలో బహిరంగ హెచ్చరిక!

Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్  తన పేరుతో జరుగుతున్న మోసాలపై…

2 weeks ago

Moringa Powder | మహిళల ఆరోగ్యానికి అద్భుత ఔషధం మునగ ఆకు పొడి.. లాభాలు ఎన్నో

Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…

2 weeks ago

Sesame Seeds | మహిళలకు ఆరోగ్య వరం …చిట్టి గింజలతో లాభాలు ఎన్నో

Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…

2 weeks ago

Heart Attacks | భారతదేశంలో పెరుగుతున్న గుండెపోటులు.. నిపుణుల హెచ్చరిక!

Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్‌, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…

2 weeks ago

Triphala Powder | త్రిఫల చూర్ణం పాలతో తాగితే కలిగే అద్భుత ప్రయోజనాలు.. శీతాకాలంలో ఎందుకు ప్రత్యేకం తెలుసా?

Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…

2 weeks ago

Mole | జ్యోతిషశాస్త్రం ప్రకారం కుడి బుగ్గపై పుట్టుమచ్చ ఉన్నవారి వ్యక్తిత్వ రహస్యాలు!

Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…

2 weeks ago