Home » Entertainment » Janaki Talks About Madhuri With Akhil In Janaki Kalaganaledu
Entertainment

Janaki Kalaganaledu : మాధురి బతకదు అని చెప్పిన డాక్టర్లు.. అఖిలే మాధురిని చంపాడని జ్ఞానాంబకు చెప్పి జానకి అరెస్ట్ చేయిస్తుందా?

Authored By
Varun G
The Telugu News | Published on: November 5, 2022, 9:00 am
Advertisement

Janaki Kalaganaledu : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. జానకి కలగనలేదు సీరియల్ 5 నవంబర్ 2022, సోమవారం ఎపిసోడ్ 426 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జానకి మాధురిని ఆసుపత్రికి తీసుకొచ్చి వాళ్ల పేరెంట్స్ కు ఫోన్ చేసి చెబుతుంది. దీంతో వాళ్ల పేరెంట్స్ ఆసుపత్రికి వస్తారు. కానీ.. అసలు అఖిల్ ఇలా ఎందుకు చేశాడని తల బద్దలు కొట్టుకుంటుంది జానకి. ఇప్పుడే అఖిల్ వల్లనే మాధురికి గాయం అయిందని చెప్పకూడదు అని అనుకుంటుంది జానకి. ఒక పర్సన్ మీ అమ్మాయి తల మీద బలంగా కొట్టాడు అని చెబుతుంది జానకి. ఆ తర్వాత డాక్టర్ వచ్చి పరిస్థితి క్రిటికల్ గా ఉంది అంటుంది. దీంతో మాధురి వాళ్ల పేరెంట్స్ వెక్కి వెక్కి ఏడుస్తారు. ఏం చేయాలో జానకికి అర్థం కాదు.

Advertisement

janaki talks about madhuri with akhil in janaki kalaganaledu

మరోవైపు రాత్రి అయినా జానకి ఇంకా ఇంటికి రాలేదని జ్ఞానాంబతో పాటు అందరూ టెన్షన్ పడుతుంటారు. జానకి ఇంకా ఇంటికి రాలేదా.. నా గురించి చెప్పడం కోసం అన్ని ఆధారాలు సేకరించడానికే వెళ్లిందా అని అనుకుంటుంది మల్లిక. మరోవైపు జానకి ఫోన్ తీయడం లేదని చెబుతాడు రామా. కాలేజీలో లేకపోవడం, మరోవైపు పోన్ చేస్తే లిఫ్ట్ చేయకపోవడంతో అసలు ఏమై ఉంటుంది అని అంతా టెన్షన్ పడతారు. కనీసం ఫోన్ చేసినప్పుడు అయినా లిఫ్ట్ చేసి ఆలస్యం అవుతుందని చెప్పొచ్చు కదా అని అంటుంది జ్ఞానాంబ. ఇంతలో జానకి ఇంట్లోకి వస్తుంది. తనను చేసి అందరూ షాక్ అవుతారు. ఏదో మూడీగా తను రావడం చూసి అందరూ షాక్ అవుతారు.

Advertisement

ఎందుకు లేట్ అయింది అని అడుగుతుంది జ్ఞానాంబ. దీంతో స్టడీ మెటీరియల్ కొనేందుకు వెళ్లా. అందుకే లేట్ అయింది అని చెప్పి అక్కడి మీకు ముందే చెప్పనందుకు క్షమించండి అని చెప్పి తన రూమ్ లోకి వెళ్తుంది జానకి.

కానీ.. రామాకు ఎందుకో అనుమానం వస్తుంది. అఖిల్ వైపు కూడా సీరియస్ గా చూసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది జానకి. ఎందుకు అలా ఉన్నారు అని అడుగుతాడు రామా. దీంతో ఏం లేదు రామా గారు బాగానే ఉన్నాను. కాస్త అలసటగా ఉంది అంటుంది జానకి.

Advertisement

Janaki Kalaganaledu : జెస్సీని చాయ్ తీసుకొని రా అని అఖిల్ కు చెప్పిన జానకి

రామాకు ఈ విషయం చెప్పాలా వద్దా అని టెన్షన్ పడుతుంది. ఇప్పుడే వద్దు.. అసలు అఖిల్ తో మాట్లాడాక అందరికీ ఈ విషయం చెప్పాలని అనుకుంటుంది జానకి. మరోవైపు అఖిల్ మెల్లగా పుస్తకాలు పట్టుకొని అందరినీ చదువుకుంటున్నట్టు నమ్మించాలని అనుకుంటాడు.

నేను చదువుకోవడానికి బయటికి వెళ్తున్నా అని జెస్సీకి చెబుతాడు అఖిల్. దీంతో జెస్సీ చాలా సంతోషిస్తుంది. ఇంతలో జానకి వస్తుంది అక్కడికి. ఇంతలో అఖిల్ మారిపోయినట్టుగా నటించడం తెలుసుకుంటుంది.

దీంతో జెస్సీని చాయ్ తీసుకొని రా అఖిల్ కోసం అని పంపిస్తుంది. దీంతో జెస్సీ వెళ్తుంది. ఆ తర్వాత నీకోసం ఎవరో పర్సన్ వచ్చారు. నీతోనే పర్సనల్ గా మాట్లాడాలట. బయట వెయిట్ చేస్తున్నారు అని అబద్ధం చెబుతుంది జానకి.

దీంతో పరిగెత్తుకుంటూ వెళ్తాడు అఖిల్. కానీ.. అక్కడ ఎవరూ ఉండరు. దీంతో మాధురిని చంపారని ఎవరైనా వచ్చారేమో అని టెన్షన్ పడతాడు అఖిల్. ఇంతలో అక్కడికి జానకి వచ్చి నీకోసం ఎవరూ రాలేదు అఖిల్ అంటుంది జానకి.

Advertisement

దీంతో అఖిల్ షాక్ అవుతాడు. మాధురి గురించి అడుగుతుంది జానకి. దీంతో మాధురి ఎవరు వదిన అని అంటాడు. దీంతో ఈరోజు కాలేజీలో కలిసిన అమ్మాయి అని చెబుతుంది జానకి. కాలేజీలో నేను మాధురిని అస్సలు కలవలేదు అంటాడు అఖిల్.

దీంతో ఇప్పుడే మాధురి ఎవరో తెలియదు అన్నావు కదా అంటుంది జానకి. నువ్వు ఆ అమ్మాయిని వెంబడించడం, నువ్వు ఆ అమ్మాయిని కర్రతో కొట్టడం నేను చూశా అఖిల్ అని చెబుతుంది జానకి. దీంతో అఖిల్ షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి