Karthika Deepam 5 Nov Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 5 నవంబర్ 2022 సోమవారం ఎపిసోడ్ 1502 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. శౌర్య రాదు అని చెప్పినా ఆనంద రావు వినడు. చిన్నపిల్ల రానని చెబుతోంది కదండి.. ఎందుకు బలవంతపెడతారు అని అంటారు ఇంద్రుడు, చంద్రమ్మ. దీంతో మీరు మాట్లాడకండి. అసలు మీ మీదే నాకు అనుమానం ఉంది. మీరే కావాలని నా మనవరాలని మా నుంచి దూరం చేయాలని చూస్తున్నారని ఆనంద రావు.. ఇంద్రుడు, చంద్రమ్మకు వార్నింగ్ ఇస్తాడు. మా మనవరాలు మాతో వచ్చేంత వరకు మేమూ ఇక్కడే ఉంటున్నాం. అంతవరకు కదిలేదే లేదు అని చెబుతాడు ఆనంద రావు. ఖర్చులకు ఉంచు. ఆలోచిస్తున్నావేంటి తీసుకో అంటాడు ఆనంద రావు.
దీంతో శౌర్యకు ఏం చేయాలో అర్థం కాదు. మరోవైపు దీప శౌర్య గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఆటో వెనుక రాసే అలవాటు శౌర్యకే ఉంది కాబట్టి డాక్టర్ బాబుతో కలిసి వెళ్లి శౌర్య విషయం మళ్లీ తేల్చుకోవాలి అని అనుకుంటుంది దీప. ఇంతలో మళ్లీ మోనిత వస్తుంది. ఏంటి మళ్లీ వచ్చావు అని అడుగుతుంది. ఇప్పుడు నేను నీతో గొడవ పడటానికి రాలేదు. నిన్ను ఒక విషయం అడుగుదామని వచ్చాను. నేను ఎంత కూల్ గా అడుగుతానో.. నువ్వు అంతే కూల్ గా సమాధానం చెప్పు. అస్సలు ఆవేశపడకు అంటుంది. ఇక్కడ నీకు ఆటో వాళ్లు ఎవరైనా తెలుసా అని అడుగుతుంది మోనిత. దీంతో ఎందుకు డాక్టర్ బాబును తీసుకొని ఊరు వదిలి వెళ్లిపోతున్నావా అంటుంది. అప్పుడు నీతో వారణాసి ఉండేవాడు కదా. ఇప్పుడు మళ్లీ అలాంటి ఆటోవాడు ఎవరైనా ఉన్నారేమో చెప్పు అంటుంది మోనిత. దీంతో ఎందుకు అని అడుగుతుంది మోనిత. ఎందుకు ఎందుకు ఎందుకు.. ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు దీప అంటుంది మోనిత.
చెప్పు దీప అంటుంది. దీంతో నాకు తెలిసిన ఆటో డ్రైవర్ గురించి ఎందుకు అడుగుతోంది. శౌర్య కోసం నేను ఇంద్రుడు దగ్గరికి వెళ్లిన విషయం మోనితకు తెలిసిందా. లేక ఇంద్రుడు మోనితను కలిశాడా అని తనలో తానే ఆలోచిస్తూ ఉంటుంది వంటలక్క.
చెప్పు.. తెలుసా తెలియదా అని అడుగుతుంది. దీంతో ఈ ఊళ్లో వందల ఆటోలు ఉన్నాయి. వందల మంది ఆటో డ్రైవర్లు ఉన్నారు అంటుంది దీప. అసలు నీకు ఆటోడ్రైవర్ తో ఏం పని అంటుంది దీప.
దీంతో ఎందుకా.. ఏదో ఒక ఆటోడ్రైవర్ ను నీకు సెట్ చేసి నేను కార్తీక్ తో కలిసి వెళ్లపోదామని అంటుంది మోనిత. దీంతో మోనిత చెంప చెళ్లుమనిపిస్తుంది దీప. పిచ్చిపిచ్చిగా వాగితే చంపేస్తా అంటుంది దీప. దీంతో నువ్వు, కార్తీక్ కలిసి చేస్తున్న ఆటో డ్రైవర్ కథ ఏంటో నేను తేలుస్తా అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
అసలు.. మోనిత ఎందుకు ఇంద్రుడు ఆటో ఎక్కింది. శౌర్య విషయంలో ఇద్దరూ కలిసి ఏదైనా ప్లాన్ చేస్తున్నారా అని అనుకుంటాడు కార్తీక్. దీంతో ఇంతలో అక్కడికి మోనిత వస్తుంది. ఏమైంది కార్తీక్ మళ్లీ ఏం ఆలోచిస్తున్నాడు అని అనుకుంటుంది మోనిత.
ఇంతలో దుర్గ వస్తాడు. బిర్యానీ పట్టుకొని వస్తాడు. మోనిత బిర్యానీ తిందాం పదా అంటాడు. దీంతో నిన్ను ఎవడు బిర్యానీ తెమ్మన్నాడురా అంటుంది మోనిత. పదా ముగ్గురం తిందాం అంటాడు దుర్గ.
దీంతో నాకు అవసరం లేదు అంటూ కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు కార్తీక్. దీంతో దుర్గపై విరుచుకుపడుతుంది. ఎందుకురా నా మీద ఇలా విరుచుకుపడుతున్నావు అంటుంది మోనిత. దీంతో దీపమ్మకు నువ్వు చేసిన దానితో పోల్చుకుంటే నేను చాలా తక్కువ చేశా అంటాడు దుర్గ.
మరోవైపు దీపను కలిసిన కార్తీక్.. ఇంద్రుడు నన్ను తప్పించుకొని పారిపోతున్నాడు. నాకు ఎందుకో డౌట్ గా ఉంది అని అంటాడు కార్తీక్. మోనిత కూడా నన్ను ఆ ఆటో డ్రైవర్ గురించి అడిగింది అంటుంది దీప.
అంటే.. ఇద్దరూ కలిసి నాటకం ఆడుతున్నారా అని అనుకుంటాడు కార్తీక్. మరోవైపు చంద్రమ్మను కొడతాడు ఇంద్రుడు. జ్వాలమ్మను వాళ్ల తాతయ్యతో పంపిస్తావా? వాళ్లు జ్వాలమ్మను అట్నుంచి అటే తీసుకెళ్తే ఏం చేస్తావు అంటాడు ఇంద్రుడు.
మరోవైపు నేను హైదరాబాద్ కు రాను తాతయ్య అంటూ కారులో ఏడుస్తూ ఉంటుంది శౌర్య. ఇంతలో దీప శౌర్య వాయిస్ వింటుంది. డాక్టర్ బాబు అది ఖచ్చితంగా శౌర్య వాయిసే అంటుంది. ఇంతలో ఇంద్రుడు తన ఆటోతో కారును ఫాలో చేస్తాడు. డాక్టర్ బాబు, దీప కూడా ఇద్దరినీ వెంబడిస్తారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.