Egg Manchurian Recipe in Telugu
Egg Manchurian Recipe : ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ ఎగ్ మంచూరియా.. ఈ మంచూరియా అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరైనా ఉంటారా.. ప్లేట్లో వేడి వేడి వేసిన సరే టెన్ మినిట్స్ లో ప్లేట్ అంతా ఖాళీ చేస్తూ ఉంటారు. ఎగ్ మంచూరియా రెస్టారెంట్లలో బాగా చేస్తూ ఉంటారు. అలాంటి మంచూరియా ఇప్పుడు మనం ఇంట్లోనే తయారు చేసుకోబోతున్నాం… దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం రండి… దీనికోసం కావలసిన పదార్థాలు : ఎగ్స్, కార్న్ ఫ్లోర్, మిర్యాల పొడి, ఉప్పు, పచ్చిమిర్చి, అల్లం, ఎల్లిపాయలు, ఆనియన్స్, చైనీస్ చీల్లి పేస్ట్, పంచదార, అజ్ను మోటో, టమాటో కెచప్, మిర్యాల పొడి, సాల్ట్, వైట్ పెప్పర్ పౌడర్, వెనిగర్, సోయాసాస్, వాటర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లికాడలు,మొదలైనవి…
దీనికోసం ముందుగా నాలుగైదు కోడిగుడ్లను ఉడకబెట్టి వాటిని నాలుగు భాగాలుగా కట్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక ఎగ్, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాల పౌడర్, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత దీనిలో మూడు టేబుల్ స్పూన్ల మైదా, మూడు టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ముక్కలని తీసుకొని దీంట్లో బాగా డిప్ చేసుకొని వెంటనే ఆయిల్లో డీప్ ఫ్రై చేయడానికి మొత్తం ఎగ్స్ ని వేసి గరిటతో కదపకుండా అలాగే ఐదు నిమిషాల పాటు వదిలేయాలి. తర్వాత వీటిని క్రిస్పీగా అయిన తర్వాత తీసి పక్కన ఉంచుకోవాలి. తర్వాత స్టౌ పై ఒక పాన్ పెట్టుకుని దానిలో రెండు స్పూన్ల ఆయిల్ వేసి కొంచెం పచ్చిమిర్చి, కొన్ని ఉల్లిపాయ ముక్కలు, అల్లం తరుగు, వెల్లుల్లి తరుగు వేసి ఐ ఫ్లేమ్ మీద బాగా వేయించుకోవాలి.
Egg Manchurian Recipe in Telugu
తర్వాత దీనిలో చైనీస్ చిల్లి పేస్ట్ తర్వాత కొంచెం పంచదార అలాగే టమాటా కెచప్, మిర్యాల పొడి, సాల్టు, అజ్నో మోటో, వైట్ పెప్పర్ పౌడర్, కొంచెం వెనిగర్ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత దీంట్లోకి సోయా సాస్ ని కూడా వేసి బాగా కలుపుకొని తర్వాత ఒక గ్లాసు నీళ్లను వేసి మీద బాగా అయ్యేవరకు ఉడకనివ్వాలి. సాస్ లాగా తయారైన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్నా ఎగ్స్ ని వేసి బాగా కలుపుకోవాలి.తర్వాత దానిపై స్ప్రింగ్ ఆనియన్స్ ని వేసి కొద్దిసేపు తిప్పి సాసీగా ఉన్నప్పుడే దీనిని తీసి ఒక ప్లేట్ లోకి సర్వ్ చేసుకోవాలి. ఇలా సాస్ లా చేసుకున్న దానిపై స్ప్రింగ్ ఆనియన్ని వేసుకోవాలి. అంతే ఎంతో సింపుల్గా ఎగ్ మంచూరియా రెడీ అయిపోయింది. ఇది రెస్టారెంట్ స్టైల్ లో ఎలా ఉంటుందో ఇప్పుడు ఇదే టిప్స్ తో చేసుకుంటే ఇంట్లో కూడా సేమ్ అదే విధంగా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.