Home » Entertainment » Janhvi Kapoor Comments On Vijay Devarakonda Marriage
Entertainment

Janhvi Kapoor : విజయ్ దేవరకొండకి పెళ్లయిందట.. జాన్వీకపూర్‌ ఇచ్చిన క్లారిటీతో ఆ స్టార్ హీరోయిన్ కొంపమునిగింది..!

Authored By
Rame Samhith
The Telugu News | Published on: October 27, 2022, 3:00 pm
Advertisement

Janhvi Kapoor : టాలీవుడ్ డ్యాషింగ్ హీరో విజయ్ దేవరకొండ అంటే బాలీవుడ్ ఆడియన్స్ మాత్రమే కాదు సెలబ్రిటీస్ కూడా పడిచస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ భామలు జాన్వి కపూర్, సారా అలి ఖాన్, కియరా అద్వానిలు ఓపెన్ గానే విజయ్ మీద తమకున్న ఇష్టాన్ని బయట పెట్టారు. ఈ క్రమంలో తమ క్రష్ అంటూ విజయ్ పేరు చెప్పడం విశేషం. ఇక లేటెస్ట్ గా జాన్వి కపూర్ ఒక ఇంటర్వ్యూలో తను డేటింగ్ చేయాలని అనుకుంటున్న ముగ్గురు స్టార్ల పేరు చెప్పమని అడిగితే.. ఆమె హృతిక్, రణ్ వీర్, టైగర్ అని మూడు పేర్లు చెప్పింది. హృతిక్ ఆల్రెడీ పెళ్లి విడాకులు తీసుకుని ఉన్నాడు. అతని మీద జాన్వి ఆసక్తి చూపించడం షాకింగ్ గా ఉంది.

Advertisement

ఇక రణ్ వీర్ సింగ్, టైగర్ ల పేరు చెప్పడం కామనే అనుకున్నారు. అయితే అక్కడ హోస్ట్ విజయ్ దేవరకొండ అని హింట్ ఇవ్వగా అతను ఆల్రెడీ కమిటెడ్ అని అనేసింది. అంతేకాదు ఆచరణాత్మకంగా అతని మ్యారేజ్ అయ్యిందని చెప్పింది జాన్వి. జాన్వి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. విజయ్ కి ఎవరితో పెళ్లైంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. విజయ్, రష్మిక మందన్నల జోడీ గురించి అందరికి తెలిసిందే. ఆన్ స్క్రీన్ మీదే కాదు ఆఫ్ స్క్రీన్ లో కూడా వీరి మధ్య సంథింగ్ సంథింగ్ అని అందరు అనుకుంటున్నారు. వాళ్లని అడిగితే వుయార్ జస్ట్ ఫ్రెండ్స్ అంటూ చెబుతున్నారు.

janhvi kapoor comments on Vijay Devarakonda marriage

Advertisement

జాన్వి అందుకే విజయ్ దేవరకొండ పేరు చెప్పలేదని తెలుతుంది. అయితే విజయ్, రష్మికల గురించి జాన్వి చెప్పకనే చెప్పేసింది. వాళ్లిద్దరు ప్రేమించుకుంటున్నారు అని వీళ్లు క్లారిటీ ఇచ్చారు. మరి జాన్వి చెప్పిన ఈ కామెంట్స్ పై విజయ్, రష్మికలు ఎలా స్పందిస్తారో చూడాలి. రష్మిక ఇప్పటికే బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలతో దూసుకెళ్తుంది. మరి విజయ్, రష్మిక ల మధ్య ఉన్న బాండింగ్ అదేనా లేక నిజంగానే ఫ్రెండ్ షిప్ మాత్రమేనా అన్నది తెలియాల్సి ఉంది. లైగర్ తో సత్తా చాటుతాడు అనుకున్న విజయ్ ఆ సినిమా డిజాస్టర్ అవడంతో డీలా పడ్డాడు. ప్రస్తుతం అతౌ ఖుషి సినిమా చేస్తున్నాడు. శివ నిర్వాణ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తుంది.

Rame Samhith

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి