Home » Entertainment » Janhvi Kapoor Entry With Vijay Movie
Entertainment

Janhvi Kapoor : విజ‌య్ దేవ‌ర‌కొండ‌తోనే జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ప‌క్కాన‌ట‌..!

Authored By
Sam C
The Telugu News | Published on: March 20, 2022, 6:09 pm
Advertisement

Janhvi Kapoor : అతిలోకసుంద‌రి శ్రీదేవి ముద్దుల కుమార్తె జాన్వీ క‌పూర్ గురించి ప్రత్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ధడక్అనే సినిమాతో హిందీ చిత్ర సీమకు పరిచయమైంది. ఆ సినిమా హిట్ తర్వాత జాన్వీ పలు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ బిజీ అయ్యింది. జాన్వీ తన తల్లి శ్రీదేవిని పోలిన లుక్స్‌తో అభిమానులకు కనులవిందు చేస్తోంది. ఆమె ప్రస్తుతం రూహీ, తక్త్, గుడ్ లక్ జెర్రీ, హెలెన్ మొదలగు సినిమాల్లో నటిస్తోంది. హీరోయిన్‌గా ప్రయాణాన్ని మొదలు పెట్టిన చాలా తక్కువ సమయంలోనే యాక్టింగ్‌తో పాటు గ్లామర్ ట్రీట్‌తో మంచి ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. అదే సమయంలో వరుసగా సినిమా ఆఫర్లను కూడా దక్కించుకుంటోంది. అన్నింటికీ మించి సోషల్ మీడియాలో జాన్వీ కపూర్ చేసే రచ్చ అంతా ఇంతా కాదు.

Advertisement

అరంగేట్రం చేసిన సినిమాతోనే యమ పాపులర్ అయిన జాన్వీ కపూర్.. ఆ తర్వాత ఏది పడితే ఆ సినిమాలే నటించడం లేదు. తన పాత్రకు ప్రాధాన్యం ఉన్న వాటికే సైన్ చేస్తోంది. ఇలా ఇప్పటికే ‘గుంజాన్‌ సక్సేనా: ద కార్గిల్‌ గర్ల్‌’ అనే బయోపిక్ మూవీలో నటించి అలరించింది. అనంతరం ‘రూహీ’ అనే సినిమా చేసింది. అయితే, ఇది మాత్రం జాన్వీకి నిరాశనే మిగిల్చింది. అయితే ఈ అమ్మ‌డు సౌత్ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందా అని అంద‌రు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. కాని ప్ర‌తిసారీ నిరాశే ఎదురవుతుంది. అయితే ఈ సారి విజ‌య్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ప‌క్కా ఇస్తుంద‌ని అంటున్నారు.

Janhvi Kapoor : జాన్వీ ఎంట్రీ ప‌క్కానా…

janhvi kapoor entry with vijay devarakonda movie

Advertisement

విజ‌య్ దేవ‌ర‌కొండ రీసెంట్‌గా పూరీతో క‌లిసి లైగ‌ర్ సినిమా చేశారు. త్వ‌ర‌లో `జనగణమన` చిత్రం చేయబోతున్నారు. అయితే ఇందులో హీరోయిన్‌గా జాన్వీకపూర్‌ ఫైనల్‌ అయినట్టు తెలుస్తుంది. ఇటీవల హిందీ నిర్మాత అపూర్వ మెహతా బర్త్ డే పార్టీలో తారలు పాల్గొన్నారు. ఈ పార్టీలోనే `లైగర్‌` టీమ్‌ ఓ ఫోటో దిగగా, త‌ర్వాత‌ జాన్వీ కపూర్‌తో మరో ఫోటో దిగారు విజయ్‌, చార్మీ. ప్రస్తుతం ఈ పిక్‌ ఇంటర్నెట్‌లో హల్‌చల్‌ చేస్తుంది. దీంతో నెక్ట్స్ పూరీ, విజయ్‌ సినిమాలో హీరోయిన్‌ కన్ఫమ్‌ అని తేల్చేస్తున్నారు నెటిజన్లు. జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తే అది ప‌క్కా విజ‌య్ దేవ‌రకొండ‌తోనే అని కొంద‌రు నెటిజ‌న్స్ జోస్యాలు చెబుతున్నారు.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి