Janhvi Kapoor : టాలీవుడ్‌పై ఫోకస్ పెట్టిన జాన్వీ కపూర్.. మరో తెలుగు సినిమాకి సైన్ చేసిందా !
Janhvi Kapoor : జాన్వీ కపూర్.. మొన్నటి వరకు ఈ పేరు బాలీవుడ్‌లో మారుమ్రోగేది. ఇప్పుడు టాలీవుడ్‌లో ఈమె పేరు తెగ వినిపిస్తుంది. శ్రీదేవి వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ భామ బాలీవుడ్‌లో కమర్షియల్ సినిమాలు చేయకుండా.. డిఫరెంట్ కాన్సెప్ట్ లను ఎంపిక చేసుకుంటూ ముందుకుపోతుంది. కెరీర్ బిగినింగ్‌లో బయోపిక్ సినిమాలు కూడా చేసి అందరిని ఆశ్చర్యపరచింది. అయితే జాన్వీ సినిమాల కన్నా తన గ్లామర్ షోతోనే ఎక్కువగా వార్తలలోకి ఎక్కింది. ఇక సౌత్ ఎంట్రీ గురించి ఎదరు చూసిన జనాలకు డబుల్ బొనాంజ ఆఫర్ కూడా ఇచ్చింది బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్. ఆర్ఆర్ఆర్ హీరోలతో చెరో పాన్ ఇండియా మూవీ చేస్తుండగా, ఈ సినిమాపై అభిమానులలో అంచనాలు భారీగానే ఉన్నాయి.
జాన్వీ కపూర్ తెలుగులో ఎన్టీఆర్ జతగా దేవర సినిమాలో నటిస్తుంది చిన్నదిఈ సినిమా రిలీజ్ కు రెడీ అయ్యింది. అక్టోబర్ 10న చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్టు సమాచారం. ఇక రామ్ చరణ్ RC16 సినిమాతో రెండో అవకాశం అదృష్టంగా జాన్వీకి వరించింది. ఇటీవల ఈ మూవీ పూజా కార్యక్రమాలు పూర్తి కాగా, త్వరలోనే సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ రెండు సినిమాలలో ఒక్క సినిమా హిట్ అయిన కూడా జాన్వీ రాత మారిపోవడం ఖాయం. అయితే ఇప్పుడు జాన్వీ తెలుగులో మరో సినిమాకి కూడా కమిట్ అయిందని అంటున్నారు. ఇటీవల సౌత్ నుంచి వచ్చే కథలను వదలకుండా వింటున్న జాన్వీ కపూర్‌కి బంపర్ ఆఫర్ తగిలిందట.
Janhvi Kapoor : టాలీవుడ్‌పై ఫోకస్ పెట్టిన జాన్వీ కపూర్.. మరో తెలుగు సినిమాకి సైన్ చేసిందా !
రాజమౌళి మహేష్ బాబు కాంబోలో రాబోతున్న సినిమాలో జాన్వీ కపూర్ సెలక్ట్ అయ్యిందన్న వార్తలు ఇప్పుడు తెగ హల్‌చల్‌చేస్తున్నాయి. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్‌కి అవకాశం ఉండగా, ఓ హీరోయిన్‌గా జాన్వీ కపూర్‌ని ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో వన్ ఆఫ్ ద హీరోయిన్ గా జాన్వి కనిపించబోతుందట .తన కూతురిని ఈ సినిమాలో ఎంపిక చేయమని బోనికపూర్ గట్టిగా ప్రయత్నం చేశాడట. ఆ కారణంగా రాజమౌళి జాన్వి పేరును ఒకే చేశారట . అఫీషియల్ గా దీనిపై ఎటువంటి సమాచారం లేదు కాని.. సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త తెగ హల్‌చల్ చేస్తుంది. ఎప్పుడు అధికారిక ప్రకటన వస్తుందో అప్పుడు మనకు పూర్తి క్లారిటీ వస్తుంది.
Vastu Tips : చాలామందికి తెలియకుండానే కొన్ని తప్పుల్ని ఇంట్లో చేస్తూ ఉంటారు. అలాగే వాస్తు విషయంలో కూడా అలాగే…
kingdom Movie Review : విజయ్ దేవరకొండ Vijay Devarakonda , Bhagya Sri Borse , హీరోగా నటించిన…
Pumpkin : గుమ్మడికాయలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులో మూడు రకాల గుమ్మడికాయలు ఉంటాయి. మూడింటిలో ఆకుపచ్చ పసుపు తెలుపు…
Kingdom Movie Review : విజయ్ దేవరకొండ vijay devarakonda , bhagya sri borse నటించిన కింగ్డమ్ చిత్రం…
Tea : వర్షాకాలం, చలికాలం వచ్చిందంటే చల్లటి వాతావరణం లో మన శరీరం వెచ్చదనాన్ని వెతుక్కుంటుంది. మన శరీరం వేడిగా…
Rakhi Festival : శ్రావణ మాసంలో rakhi festival ప్రతి సంవత్సరం వచ్చే పౌర్ణమి తిధి రోజున రాఖీ పండుగ…
Indiramma Houses : ఈ రోజు ఘట్కేసర్ మున్సిపల్ లో ఇందిరమ్మ పథకం కింద వచ్చిన 5 లక్షల రూపాయలు…
Janhvi Kapoor : జాన్వీ కపూర్.. 1997 మార్చి 6న శ్రీదేవి, బోనీ కపూర్ దంపతులకు ముంబైలో జన్మించింది. తల్లి…
This website uses cookies.