Jani Master : నాకు డ్యాన్స్ రాదు, యాక్టింగ్ రాదు.. స్టేజ్ మీద నుంచి వెళ్లిపోయిన జానీ మాస్టర్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Jani Master : నాకు డ్యాన్స్ రాదు, యాక్టింగ్ రాదు.. స్టేజ్ మీద నుంచి వెళ్లిపోయిన జానీ మాస్టర్

 Authored By prabhas | The Telugu News | Updated on :2 June 2022,10:00 pm

Jani Master : జానీ మాస్టర్ గురించి పరిచయం అక్కర్లేదు. ఇండియన్ టాప్ కొరియోగ్రాఫర్‌గా దూసుకుపోతోన్నాడు జానీ మాస్టర్. కోలీవుడ్, శాండల్ వుడ్, బాలీవుడ్ ఇలా అన్ని ఇండస్ట్రీలోనూ జానీ మాస్టర్ తన సత్తా చాటుతున్నాడు. ఇక తెలుగులో అయితే జానీ మాస్టర్ స్టెప్పులు కంపోజ్ చేస్తే అవి ట్రెండ్ అవుతాయి. ఈ మద్యే బీస్ట్ సినిమాలో విజయ్, పూజా హెగ్డేలతో అదిరిపోయే స్టెప్పులు వేయించాడు. అరబిక్ కుత్తు, హళమితి హబిబీ అంటూ అందరినీ ఊపు ఊపేశాడు జానీ మాస్టర్. అలాంటి జానీ మాస్టర్ కెరీర్ ఢీ షోతో మొదలైంది. ఢీ షోలో కంటెస్టెంట్‌గా మొదలై.. అదే షోకు న్యాయ నిర్ణేతగా వచ్చే స్థాయికి జానీ మాస్టర్ ఎదిగిపోయాడు.

అయితే జానీ మాస్టర్ కంటెస్టెంట్‌గా ఢీ షోలో ఉన్నప్పుడు తెగ అగ్రెసివ్‌గా ఉండేవాడు. జడ్జ్‌లను సైతం ఎదురించి మాట్లాడేవాడు. ముక్కుసూటిగా ఉండేవాడు. ఏదనిపిస్తే అది అనేవాడు. అలా ఎన్నో కాంట్రవర్సీలు జరిగాయి.అప్పుడు గనుక సోషల్ మీడియా ఉండుంటే.. జానీ మాస్టర్ పేరు మార్మోగిపోయేది.అయితే ఇప్పుడు జానీ మాస్టర్ నాటి సంగతులను గుర్తు చేసుకున్నాడు. తాజాగా వదిలిన ఢీ షో ప్రోమో నెట్టింట్లో వైరల్ అవుతోంది. అందులో హైపర్ ఆది, జానీ మాస్టర్ కలిసి స్టెప్పులు వేశారు. ఇక డ్యాన్సుల్లో జానీ మాస్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జానీ మాస్టర్ స్టెప్పులు వేస్తుంటే.. ఆది పిచ్చి గెంతులు వేసేశాడు.

Jani Master Fun WIth Hyper aadi In Dhee Show

Jani Master Fun WIth Hyper aadi In Dhee Show

దీంతో అందరూ నవ్వేశారు. అయితే ఆది మాత్రం జానీ మాస్టర్‌తో సరిసమానంగా చేసినట్టు బిల్డప్ ఇచ్చాడు. మొత్తానికి జానీ మాస్టర్ అలా అనడంతో హర్ట్ అయినట్టున్నాడు. టై అయిందని ఆది అనడంతోనే.. జానీ మాస్టర్ గతాన్ని గుర్తు చేసుకున్నాడు. గతంలో ఢీ షోలో తాను అన్న మాటలను చెప్పుకొచ్చాడు. నాకు డ్యాన్స్ రాదు. యాక్టింగ్ రాదు.. నేను వెళ్లిపోతా అంటూ స్టేజ్ దిగి వెళ్లిపోయాడు జానీ మాస్టర్. నాటి సీన్‌ను నేడు రిపీట్ చేసి వెళ్లిపోతోంటే.. జానీ మాస్టర్ జానీ మాస్టర్ అని ఆది అరుస్తూ స్టేజ్ మీదే ఉండిపోయాడు.

YouTube video

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది