Jani Master : టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వ్యవహారం కొద్ది రోజులుగా టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. నేరాన్ని జానీ అంగీకరించినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు పోలీసులు. దురుద్దేశంతోనే జానీ ఆమెను అసిస్టెంట్‌గా చేర్చుకున్నారని పోలీసులు రిపోర్ట్‌లో రాసుకొచ్చారు. 2020లో ముంబయిలోని హోటల్‌లో జానీ యువతిపై లైంగిక దాడికి పాల్పడినట్లు పొందుపరిచారు. లైంగిక దాడి జరిగినప్పుడు బాధితురాలి వయసు 16 ఏళ్లు అని పోలీసులు తెలిపారు. నాలుగేళ్లుగా బాధితురాలిపై పలుమార్లు జానీ లైంగిక దాడి చేశాడని రిపోర్ట్‌లో పేర్కొన్నారు. విషయం బయటకు చెబితే సినిమా ఆఫర్స్ రాకుండా చేస్తానని బెదిరించినట్లు పోలీసుల రిమాండ్ రిపోర్ట్‌లో ఉంది.
నాలుగేళ్లుగా బాధితురాలిపై పలుమార్లు జానీ లైంగిక దాడికి.. జానీ మాస్టర్ పడుతునే ఉన్నాడని కూడా.. రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు పేర్కొన్నారు. అంతేకాదు.. జానీ భార్య కూడా బాధితురాలిని బెదిరించారని పోలీసులు వెల్లడించారు. జానీ మాస్టర్ కేసులో మాత్రం ప్రస్తుతం సస్పెన్స్ తొలగిపోయిందని తెలుస్తోంది. ఇప్పటికే జానీ మాస్టర్ పై పోక్సోతోపాటు, నాన్ బెయిల్ కేసుల్ని సైతం నార్సింగ్ పోలీసులు నమోదు చేశారు . ప్రస్తుతం కోర్టు జానీ మాస్టర్ ను.. 14 రోజుల పాటు పోలీసుల కస్టడీకి అనుమతిని ఇచ్చింది. జానీ మాస్టర్ ఘటనపై టాలీవుడ్ ఇండస్ట్రీలో పెనుసంచలనంగా మారింది. అయితే ఆ మహిళ మౌనాన్ని అవకాశంగా మార్చుకొని వేర్వేరు ప్రాంతాల్లో సినిమా షూటింగ్ లకు తీసుకెళ్లి హోటల్ గదుల్లో.. వ్యానిటీ వాహనాల్లో రేప్ చేసేవాడట జానీ మాస్టర్
అతడి వేధింపులకు భరించలేక బాధితురాలు కొంతకాలం ఇంటికే పరిమితమైంది. ఆర్థిక ఇబ్బందులతో మళ్లీ షూటింగ్ లలో పాల్గొంది. మతం మార్చుకొని పెళ్లి చేసుకోమంటూ జానీ.. అతడి భార్య సుమలత అలియాస్ అయేషా ఆమెను ఒత్తిడి చేయటం మొదలు పెట్టారు. దీంతో బాధితురాలి కుటుంబం మరోచోటుకు షిప్టు అయ్యారు. కొత్త ఇల్లు అడ్రెస్ తెలుసుకొని అక్కడికి వెళ్లీ కూడా ఆమెని చిత్ర హింసలకి గురి చేశాడట . ఆమెకు అవకాశాలు రాకుండా చేశాడు. దీంతో బాధితురాలు టీఎఫ్ టీడీడీఏకు కంప్లైంట్ చేసింది.నాలుగేళ్లుగా వేధింపులు భరించిన ఆమె.. తన సహాయకుడి సూచనతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక తన భర్తతప్పుచేసి ఉంటే.. నేనే వదిలేసి వెళ్లిపోతానంటూ సుమలత భర్త సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన ఇప్పటికే జానీ మాస్టర్ ను సస్పెండ్ చేసింది. టాలీవుడ్ సైతం జానీ మాస్టర్ ఘటనపై సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అన్నిపార్టీల నుంచి మహిళ సంఘాలు జానీ మాస్టర్ ఘటనను ఖండించాయి.
Kadaknath Chicken : నాటు కోళ్ళ పెంపకం ఇప్పుడు ఎంత లాభదాయకమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు గ్రామాల్లో చిన్న, సన్నకారు…
Postal Scheme : కేంద్ర ప్రభుత్వానికి చెందిన తపాల వ్యవస్థ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. పూర్వం ఇది కేవలం…
Health Benefits : లోటస్ (తామర) ప్రధానంగా ఆసియాలో పండించే మొక్క. ఈ మొక్క యొక్క భాగాలు మరియు దాని…
Vastu Tips : పురాణాల ప్రకారం దేవునితో పాటుగా పశుపక్షాధులను దైవంగా భావిస్తారు. అలాగే హిందూమతంలో వాటిని పూజించే సాంప్రదాయం…
ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) హైదరాబాద్‌లో ఒక సంవత్సరం అప్రెంటీస్‌షిప్ శిక్షణ కోసం గ్రాడ్యుయేట్ ఇంజనీర్ అప్రెంటీస్…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే నవగ్రహాలలో అతి ముఖ్యమైన గ్రహం బృహస్పతి. సంపదకు విజ్ఞానానికి విద్య…
Success Story : ఇటీవలి కాలంలో ప్రతి ఒక్కరు కాస్త సృజనాత్మకతతో ఆలోచిస్తున్నారు. నాలుగు రూపాయలు సంపాదించాలనే ఆలోచన ప్రతి…
China Discovers : హునాన్ ప్రావిన్స్‌లో చైనా భారీ బంగారు నిల్వలను కనుగొంది. ఈ నిల్వల యొక్క అంచనా విలువ…
This website uses cookies.