Jathi ratnalu : జాతి రత్నాలు.. ఇప్పుడు టాలీవుడ్ లో ఎక్కడ చూసినా అందరు ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. మహా శివరాత్రి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన జాతి రత్నాలు బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులుపుతోంది. ఇప్పటికే బ్రేకీవెన్ చేరుకుందని భారీగా లాభాలలోకి వచ్చేసిందని చెప్పుకుంటున్నారు. బొమ్మపడిన రెండవ రోజు నుంచే ఈ సినిమాకి భారీ స్థాయిలో థియేటర్స్ పెరిగాయి. కేవలం రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా దేశ వ్యాప్తంగా జాతి రత్నాలను ప్రేక్షకులు విపరీతంగా ఆదరిస్తున్నారు.
jathi-ratnalu-fame-naveen-poli-shetty-dominating-young-stars
కరోనా అమెరికాలో రిలీజైన ఈ సినిమా నిర్మాతల మీద డాలర్ల వర్షం కురిపిస్తోంది. విదేశాలలోను ఈ సినిమా వసూళ్ళు ఊహించని విధంగా రాబడుతోంది. ఎలాంటి స్టార్స్ లేని ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరించడం చాలా గొప్ప విషయం. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో పాపులారిటీ తెచ్చుకున్న నవీన్ పొలిశెట్టి ఇప్పుడు టాలీవుడ్ లో యంగ్ హీరోలకి పోటీగా తయారయ్యాడు. జాతి రత్నాలు సినిమా తర్వాత రెండు పెద్ద నిర్మాణ సంస్థలలో సినిమా అవకాశం అందుకున్నాడు.
ప్రముఖ నిర్మాణ సంస్థలైన యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో ఒక సినిమా చేయబోతున్నాడట. అలాగే సితారా ఎంటర్‌టైన్మెంట్ లో కూడా ఒక సినిమా చేయబోతున్నాడటని తాజా సమాచారం. అంతేకాదు ఈ సినిమాలకి నాలుగు నుంచి అయిదు కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకోబోతున్నాడట. నిజంగా ఇది నవీన్ పొలిశెట్టి కెరీర్ లో ఊహించనిది. రెండు సినిమాలతో ఏకంగా టాలీవుడ్ స్టార్ హీరోలకి బాగానే పోటీ ఇస్తున్నాడు. ఇక యూవీ క్రియేషన్స్ లో నవీన్ పొలిశెట్టి నటించే సినిమాలో స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి నటించబోతుందని అంటున్నారు.
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్‌జి గ్యాస్…
Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్‌గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…
Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…
Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్‌చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…
Hari Hara Veera Mallu : పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరిహర…
Jagadish Reddy : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Tomatoes : టమాటా మొక్క సోలనేసి కుటుంబానికి చెందినది.ఏ వంట చేసినా కూడా ప్రతి ఒక్క వంటలో టమాట లేనిదే…
This website uses cookies.