Sobhan Babu : శోభన్ బాబును పెళ్లి చేసుకోవాలనుకున్న జయలలిత… ఇది నిజమా…? కాదా…?

 Authored By prabhas | The Telugu News | Updated on :28 July 2022,4:40 pm

Sobhan Babu : అప్పట్లో శోభన్ బాబు ఫ్యామిలీ మెన్ గా సినిమాల్లో మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. అలాగే ఆంధ్ర సోగ్గాడిగా ప్రేక్షకుల మనసులో ఇప్పటికి నిలిచిపోయారు. ఆయన తన నటనతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. తన నటనతో తెలుగు పరిశ్రమలోనే కాకుండా తమిళ పరిశ్రమలో కూడా అభిమానులను మెప్పించగలిగాడు. ఇకపోతే అప్పట్లో శోభన్ బాబు, జయలలిత ఇద్దరు ప్రేమలో ఉన్నారని, పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు కూడా వైరల్ అయ్యాయి. ఇక ఇందులో ఉన్న అసలు విషయం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. శోభన్ బాబు, జయలలిత కాంబినేషన్లో వచ్చిన ఒకే ఒక సినిమా ‘ డాక్టర్ బాబు ‘. ఇక ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కావడానికి కొద్ది రోజుల ముందు జయలలిత తల్లి మరణించింది.

ఇక అప్పటివరకు ఆమెకు సంబంధించిన అన్ని విషయాలను ఆమె తల్లి చూసుకునేదట. తన తల్లి మరణించినాక జయలలిత శోభన్ బాబులో తన తల్లిని చూసుకుందంట. అయితే ఈ విషయాన్ని స్వయంగా శోభన్ బాబు స్క్రీన్ ప్లే సినిమా మాసపత్రికలో ‘ నేను నా కథానాయకులు ‘ అనే శీర్షికలో స్వయంగా వ్యక్తం చేశారట. ‘ డాక్టర్ బాబు ‘ సినిమా షూటింగ్ ఊటీ లో జరిగింది. ఆ సమయంలో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడిందంట. జయలలిత రెండు రోజులు షూటింగ్ తర్వాత శోభన్ బాబుతో అన్నమాట ఆయన తన డైరీలో ఇలా రాసుకున్నారు. ఈ డైరీలో శోభన్ బాబుతో జయలలిత ఏం చెప్పింది అంటే ‘ చెప్పలేనంత దిగులుతో నా మనసు నిండి ఉంది. బరువైన నా మనసును నీ జోకులతో తేలిక చేశారు. ప్రపంచమంతా ఇప్పుడు చాలా నిశ్చలంగా కనిపిస్తుంది.  అందరితో మాట్లాడాలని, కలిసిపోవాలని, సంతోషంగా ఉండాలని నా మనసుకు అనిపిస్తుంది ‘ అంటూ జయలలిత తెలిపిందంట.

 Jayalalithaa wanted to marry Sobhan Babu

Jayalalithaa wanted to marry Sobhan Babu

ఈ విషయాలన్నింటిని శోభన్ బాబు తన డైరీలో రాసుకొచ్చారు. అంతేకాదు ‘ నా తల్లి మరణించి ఒక సంవత్సరం కూడా కాలేదు. కానీ ఎన్నో సంవత్సరాల నుంచి ఆ బాధ అనుభవిస్తున్నట్లు అనిపిస్తుంది. నా అన్న వాళ్లు ఎవరూ లేరు ఉన్నవాళ్లు కూడా డబ్బు కోసమే ఆశపడి నా డబ్బు మొత్తాన్ని తీసుకెళ్లిపోయారు. ముఖ్యంగా బంధువులని నమ్మిన వాళ్లకి బాధ్యతలు అప్పగిస్తే లక్షలు మోసం చేసి దోచుకొని వెళ్లిపోయారు. ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలియడం లేదు. ఇక ఇలాంటి ఎన్నో బాధలు పడుతున్న నాకు మీరు వచ్చాక విముక్తి కలిగింది ‘ అంటూ జయలలిత తెలియజేసిందంట. జయలలిత చెప్పిన మాటలన్నీ శోభన్ బాబు తన డైరీలో రాసుకొచ్చారు. దీన్ని బట్టి చూస్తే జయలలిత శోభన్ బాబులో తన తల్లిని చూసుకుందని అర్థమవుతుంది. కానీ అప్పట్లో వీరిద్దరూ సన్నిహితంగా ఉండడం వలన ఇద్దరు ప్రేమించుకుంటున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి.

Advertisement

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి