Home » Entertainment » Jayaprada Comments About Casting Cuch
Entertainment

Jaya Prada : అవకాశాల కోసం పక్కలోకి వెళుతున్న ఆ హీరోయిన్లు .. నటి జయప్రద సెన్సేషనల్ కామెంట్స్ ..

Authored By
aruna
The Telugu News | Published on: August 9, 2023, 8:00 pm
Advertisement

Jaya Prada : ఒకప్పుడు తెలుగు పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ అంటే ఏంటో తెలియదు కానీ ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ పై చాలామంది సెలబ్రిటీలు ఓపెన్ గా చెప్పుకొచ్చారు. అలాగే ఒకప్పుడు టాలీవుడ్లో ఎక్కువగా తెలుగు హీరోయిన్స్ ఉండేవారు. కానీ ఇప్పుడు శ్రీ లీల తప్ప మరెవరు కనిపించడం లేదు. ఇప్పుడిప్పుడే తెలుగు అమ్మాయి అయినా శ్రీ లీల స్టార్ హీరోయిన్ గా పరిస్థితి చూస్తున్నాం. ఒకప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ గా తెలుగు అమ్మాయిలు ఎక్కువగా ఉండేవారు. అందులో ఒకరే నటి జయప్రద. అలనాటి హీరోయిన్లలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్గా ఎదిగింది జయప్రద.

Advertisement

జయప్రద స్వస్థలం తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి. టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఎదిగిన ఆమె బాలీవుడ్ లో కూడా ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి మెప్పించింది. తర్వాత రాజకీయాలలోకి వచ్చి ఎంపీగా కూడా గెలిచారు. అప్పట్లో స్టార్ హీరోలతో సమానంగా జయప్రద పారితోషికం తీసుకునేవారు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న జయప్రద తాజాగా ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ అప్పట్లో ఇలాంటివి పెద్దగా లేవు. టాలెంట్ ఉంటే కచ్చితంగా అవకాశాలు వచ్చేవి. ముంబై నుంచి వస్తున్న ఎంతో మంది హీరోయిన్లు అవకాశాల కోసం డైరెక్టర్లు, నిర్మాతలు దగ్గరికి వెళ్తున్నారు.

Jaya Prada comments about casting cuch

Advertisement

వాళ్లకు వాళ్లే కమిట్ అవుతున్నారు. ఈ కారణంగానే కాస్టింగ్ కౌచ్ అనే పదం పుట్టుకొచ్చిందని అన్నారు. ఇలాంటివి తగ్గాలంటే ముందు అమ్మాయిలలో మార్పు రావాలి అని జయప్రద సూచించారు. అయితే ఇప్పట్లో అది సాధ్యం కాకపోవచ్చు, అవకాశాల కోసం ఎవరు లొంగిపోకూడదు, అది పెద్ద తప్పు, మనకున్న టాలెంట్ తో పనిచేస్తే ఏదో ఒక రోజు కచ్చితంగా అవకాశాలు వస్తాయి. నా కెరియర్ లో నేను ఇలాంటి చేదు అనుభవాలు ఎప్పుడూ ఎదుర్కోలేదని జయప్రద వెల్లడించారు. దీంతో సోషల్ మీడియాలో జయప్రద కాస్టింగ్ కౌచ్ పై చేసిన వాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి