Home » Entertainment » Jeevitha Calrity On Chiranjeevi Support Maa Elections 2021
Entertainment

Jeevitha : చిరంజీవి స‌పోర్టు ఎవ‌రికో చెప్పేసిన జీవిత‌.. మంచు విష్ణుకా.. ప్ర‌కాశ్‌రాజ్‌కా..?

Authored By
mallesh
The Telugu News | Published on: September 28, 2021, 6:00 am
Advertisement

jeevitha..ఇప్పుడు టాలీవుడ్ లో మా ఎల‌క్ష‌న్లు ఎంత హీటు పుట్టిస్తున్నాయో అంద‌రికీ తెలిసిందే. ఇప్ప‌టికే ప్ర‌కాశ్ రాజ్‌, అలాగే మంచు విష్ణు త‌మ ప్యానెల్స్‌ను ప్ర‌క‌టించేశారు. ఇద్ద‌రూ జోరుగా ప్ర‌చారాలు కూడా మొద‌లెట్టేశారు. ఇక ప్ర‌కాశ్‌రాజ్ ప్యానెల్‌లోకి అనూమ్యంగా జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీగా జీవిత పోటీ చేస్తున్న విష‌యం తెలిసిందే. మొద‌టి నుంచి ఈ స్థానంలో బండ్ల గ‌ణేశ్ ప్ర‌కాశ్‌రాజ్ ప్యానెల్ నుంచి పోటీ చేస్తార‌నే వార్త‌లు వ‌చ్చాయి. కానీ ఆ ప్లేస్‌లో జీవిత రావ‌డంతో బండ్ల కూడా దీనిపైబాగానే ఫైర్ అయిపోయారు. త‌న‌కు మెగా ఫ్యామిలీ స‌పోర్టు ఉంద‌ని, తాను ఇండిపెండెంట్ గానే జీవిత మీద పోటీ చేస్తానంటూ చెప్పేశారు.

Advertisement

jeevitha calrity on chiranjeevi support maa elections 2021

అయితే మెగా ఫ్యామిలీ స‌పోర్టు మంచు విష్ణు ఫ్యామిలీకి ఉంటుందా లేదంటే ప్ర‌కాశ్ రాజ్ ప్యానెల్‌కు ఉంటుందా అనేది పెద్ద ప్ర‌శ్న‌గా మారిన విష‌యం తెలిసిందే. ఈ త‌రుణంలోనే దీనిపై జీవిత రాజశేఖ‌ర్ రీసెంట్ గా మీడియాతో మాట్లాడుతూ కొంత క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. అదేంటంటే తాము గ‌తంలో న‌రేశ్ ప్యానెల్ అలాగే శివాజీ రాజా ప్యానెల్ నుంచి పోటీ చేసిన‌ప్పుడు కూడా చిరంజీవిని క‌లిసిన‌ప్పుడు ఆయ‌న ఇద్ద‌రికీ స‌పోర్టు ఉంటుంద‌ని, క‌ష్ట‌ప‌డి గెలవాలంటూ ఇద్ద‌రికీ సూచించిన‌ట్టు తెలిపింది. అలాగే తాను మా అసోసియేష‌న్‌లో మెంబ‌ర్ న‌ని, ఎవ‌రు గెలిచినా సంతోష‌మేనంటూ చెప్పారంట‌.

Advertisement

jeevitha calrity on chiranjeevi support maa elections 2021

jeevitha..లాస్ట్ టైమ్ కూడా క‌లిశాం..

ఇక త‌న ఆశాస్సులు అంద‌రికీ ఉంటాయని, అందుకే ప్ర‌త్యేకంగా ఎవ‌రికీ స‌పోర్టు చేయ‌కున్నా ఇద్ద‌రికీ మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్టు తెలిపార‌ని జీవిత వివ‌రించారు. ఇక ఇప్పుడు కూడా ప్ర‌కాశ్ రాజ్ వెళ్లి చిరంజీవిని క‌లిసార‌ని ఆయ‌న ఇప్పుడు కూడా గ‌తంలో మాదిరిగానే ఇద్ద‌రికీ స‌పోర్టు ఇస్తున్న‌ట్టు తెలిపారంటూ వివ‌రించింది జీవిత‌.

Advertisement

jeevitha calrity on chiranjeevi support maa elections 2021

ఇక ఆ విష‌యాన్ని తాము చెప్పుకుంటున్నామ‌ని, ఇత‌ర ప్యానెల్ వాళ్లు చెప్పుకోవ‌ట్లేదంటూ జీవిత కామెంట్ చేసింది. ఇక మంచు విష్ణు మోహ‌న్ బాబు కొడుకు కాక‌పోయి ఉంటే ఆయ‌న ఇంత హైలెట్ అయ్యేవారు కాద‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది జీవిత‌. మొత్తానికి మా ఎన్నిక‌లు ఇలా ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్నాయ‌న్న‌మాట‌. చూడాలి మ‌రి ముందు ముందు ఇంకెలాంటి వివాదాలు చెల‌రేగుతాయో.

 

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి