#image_title
Jeevitha Rajasekhar : తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకప్పటి స్టార్ హీరో రాజశేఖర్ భార్య జీవిత గురించి మనందరికీ తెలిసిందే. హీరో రాజశేఖర్ ని పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె పేరు జీవిత రాజశేఖర్ గా మారిపోయింది. ఇక ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా జీవిత రాజశేఖర్ అంటేనే ఆమెను గుర్తిస్తారు. అయితే జీవిత భర్త పేరులో మాత్రమే కాకుండా భర్త కష్ట సుఖాల్లో కూడా బాధ్యతగా వ్యవహరిస్తూ ఉంటారు. ఎందుకంటే ఒకప్పుడు ఆమె కూడా స్టార్ హీరోయిన్. అంతటి సెలబ్రిటీ స్టేటస్ అనుభవిస్తూ కూడా ఆదర్శ గృహిణి అనే మాటకు తెలుగు సినీ ఇండస్ట్రీలో జీవిత నిదర్శనం అని చెప్పాలి. ఇక రాజశేఖర్ ఎమోషన్స్ ను కంట్రోల్ చేస్తూ, కెరీర్ కొనసాగిస్తూ పిల్లల జీవితాలను సరిదిద్దుతూ ఇప్పటివరకు జీవిత రాజశేఖర్ సాగించిన ప్రయాణం ఎంతోమందికి ఆదర్శనీయమని చెప్పాలి. అయితే ఇంటి గృహిణిగా జీవిత ఎంత సైలెంట్ గా ఉన్నప్పటికీ ఏదైనా అన్యాయం తన కళ్ళ ముందు కనిపిస్తే ప్రశ్నించి అడగడంలో ఆమె ముందుంటారని చెప్పాలి. స్త్రీ యొక్క బాధ్యతలు అన్నీ తెలిసిన మహిళ కాబట్టి మహిళా హక్కుల కోసం ఆమె గట్టిగా గొంతు వినిపిస్తోంది.
అందుకే అప్పటి సీనియర్ హీరోయిన్స్ లో జీవిత రాజశేఖర్ చాలా ప్రత్యేకమని అంటుంటారు. అయితే సోషల్ మీడియాలో పలు రకాల ఇంటర్వ్యూలలో అప్పుడప్పుడు కనిపించే జీవిత రాజశేఖర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.అయితే ఇటీవల జీవిత రాజశేఖర్ ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూకిి వెళ్లడం జరిగింది. దీనిలో భాగంగానే జీవిత రాజశేఖర్ తన ఇష్ట ఇష్టాల గురించి అలాగే తన జీవితంలో జరిగిన కొన్ని విషయాల గురించి చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాకు మా వారిని మా ఇంటిని నా ఇద్దరు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడమే చాలా ముఖ్యమని తెలియజేశారు. నా జీవితంలో నా మొదటి ప్రియారిటీ అదే అని నా కుటుంబ సభ్యుల అవసరాలను తీర్చడం వారి పనులను ఇంకెవరో చేయడం నాకు అస్సలు నచ్చదని చెప్పుకొచ్చారు. వారికి కావాల్సినవన్నీ తెచ్చిపెట్టడమే నాకు చాలా ఇష్టమని ఈ సందర్భంగా ఆమె తెలియజేశారు. అదే విధంగా నేను బయటికి వెళ్ళేది కూడా చాలా తక్కువ కాబట్టి నాకంటూ ఫ్రెండ్స్ గ్రూప్ కూడా ఎవరూ లేరు. ఇక నా స్కూల్ ఫ్రెండ్స్ అయితే ఇప్పటికి టచ్ లోనే ఉంటారు. ఇక వారిలో డైరెక్టర్ తేజ కొరియోగ్రాఫర్ బృంద , సుచిత్ర చంద్రబోస్ కూడా ఉన్నారని చెప్పుకొచ్చారు. అలాగే ఎలాంటి సమయాల్లో అయినా సరే తాగడం అనేది నాకు అసలు అలవాటు లేదంటూ తెలియజేశారు.
అయితే ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేను మహిళను కాబట్టి తాగను అని చెప్పడం లేదు నాకు ఇష్టం లేదు కాబట్టి తాగను. ఒకవేళ ఎవరైనా ఆడపిల్ల తాగడం ఏంటి అని ప్రశ్నిస్తే మాత్రం అసలు ఒప్పుకోను అని వెళ్లి ఎందుకు తాగకూడదు అని నిలదీస్తా అంటూ ప్రశ్నించారు. సరదాలు అనేవి అందరికీ ఉంటాయి. దానికి జెండర్ తో పనిలేదని , మందు తాగడానికి ఆడ మగ తేడా ఏం లేదని ఈ సందర్భంగా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ప్రస్తుతం జీవిత రాజశేఖర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుమారం లేపుతున్నారు. దీంతో పలువురు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇక్కడ జీవిత రాజశేఖర్ ఉద్దేశం ఆడపిల్లల్ని తాగమని కాదు వారిని ప్రోత్సహించడం అంతకంటే కాదు. ఆడపిల్ల ఎందుకు తాగకూడదు అని ప్రశ్నించడం మాత్రమే. మరి జీవిత వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Tammreddy Bharadwaja : మంచు విష్ణు నటించిన కన్నప్ప సినిమా గురించి ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడారు. సినిమా…
Anam Ramanarayana Reddy : నెల్లూరులో నారా లోకేశ్ Nara Lokesh నిర్వహించిన సభలో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి…
Fish Venkat : తెలుగు సినీ పరిశ్రమలో విలక్షణ నటుడిగా పేరు సంపాదించుకున్న ఫిష్ వెంకట్ ఆరోగ్యం ప్రస్తుతం ఆందోళనకరంగా…
Rajendra Prasad : టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ మరోసారి తన ప్రసంగం వల్ల విమర్శలలో చిక్కుకున్నారు. ఇటీవల అమెరికాలో…
Relationship : ఈ రోజుల్లో పెళ్లి అనే బంధానికి అసలు అర్థం లేకుండా పోతుంది. ఒకరినొకరు చంపుకోవడం కూడా ఏం…
Meat : చాలామంది మాంసం రుచిగా ఉండాలని రొటీన్ గా తినే అలవాటు బోర్ కొట్టి కొత్తగా ప్రయత్నాలు చేస్తుంటారు.…
Health : ప్రతి ఒక్కరు కూడా వివాహం చేసుకొని జీవితం ఎంతో ఆనందంగా గడపాలి అనుకుంటారు. సంతోషంగా సాగిపోవాలనుకుంటారు. కుటుంబంలో…
Nithin : టాలీవుడ్‌లో ప్రస్తుతం ఓ ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. నితిన్ నటించిన తాజా చిత్రం ‘తమ్ముడు’ బాక్సాఫీస్ వద్ద…
This website uses cookies.