Jeevitha : రాజశేఖర్ హీరోగా జీవిత తెరకెక్కించిన చిత్రం శేఖర్. ఈ సినిమా మే 20న విడుదలకి సిద్ధమైంది. ఈ క్రమంలో ప్రమోషన్ స్పీడ్ పెంచారు. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్‌లో శివానీ రాజశేఖర్ మాట్లాడుతూ అందరినీ ఏడిపించేశారు. సినిమా ఇంకో పది రోజుల్లో స్టార్ట్ అవుతుందన్న సమయంలో.. నాన్నకు కోవిడ్ వచ్చింది. నాకు మూడు రోజుల్లోనే తగ్గింది. కానీ డాడీకి చాలా సీరియస్ అయింది. నెలన్నర హాస్పిటల్‌లో ఉన్నాం. మా నాన్నకు బాత్రూంకి వెళ్లొచ్చే సమయంలోనే సాట్యురేషన్ పడిపోయేది.
ఆయనే మా ఇంటి పెద్ద.. డాక్టర్.. ఆయనే అలాంటి స్థాయిలో ఉన్నప్పుడు.. మాకు ఏం జరుగుతోందో అర్థం కాలేదు.. జీవితం స్థంభించిపోయినట్టు అనిపించింది..ఓ రోజు డాక్టర్లు డాడీకి 50 50 చాన్స్ అని అన్నారు.. డాడీ నువ్ ఇలా చేయొద్దు.. బయటకు రా.. పోరాడు.. నా వల్ల నీకు ఇలా వచ్చింది.. నేను తట్టుకోలేను.. అని హాస్పిటల్‌లో ఏడ్చేశాను. అప్పుడు డాడీ మాస్క్ తీసేసి.. నీ వల్ల రావడం ఏంట్రా.. నీ వల్ల కాకపోతే ఇంకెవరి మూలానో వచ్చేది.. నాకేం కాదురా.. అని అన్నారు. అప్పుడు 75 నుంచి 63 కేజీలు తగ్గాడు. ఆ తరువాత మెల్లిమెల్లిగా కూర్చోవడం, నిల్చోడం, మెట్లు ఎక్కడం, దిగడం, జిమ్ ఇలా అన్నీ నేర్చుకున్నారు.. మళ్లీ 75 వరకు చేరారు..
శేఖర్ మూవీ కోసం రెడీ అయ్యారు.ఈ సినిమా పాత్రకు స్మోకింగ్ చేయాలి.. లంగ్స్ అప్పటికే పాడైపోయాయి. వద్దని మేం అన్నాం.. కానీ ఆయన మాత్రం చేద్దామని అన్నారు. సినిమాకేం కావాలో అన్నీ చేశారు.. ఈ సినిమా ఎవరి కోసం ఆడినా ఆడకపోయినా మా డాడీ కోసం ఆడుతుందని తెలుసు.. మా డాడీకి ఇది పునర్జన్మ. పునర్జన్మలో ఇది మొదటి చిత్రం అని చెప్పుకొచ్చింది శివాని. అయితే శివాని గురించి జీవిత మాట్లాడుతూ.. ఇద్దరు పిల్లలు ఫుడ్ కోసం డబ్బులు బాగా ఖర్చు చేస్తారు. శివానీ అయితే స్విగ్గీ వాళ్లతో గొడవలు పెట్టుకుంటుంది.. కొంచెం ఆలస్యమైనా డబ్బులు ఇవ్వదు అంటూ జీవిత చెప్పుకుంటూ పోయింది.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.