Jeevitha : నా కూతురు డెలివ‌రీ బాయ్స్‌తో గొడ‌వులు ప‌డుతుందంటూ ప‌రువు తీసిన జీవిత‌ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Jeevitha : నా కూతురు డెలివ‌రీ బాయ్స్‌తో గొడ‌వులు ప‌డుతుందంటూ ప‌రువు తీసిన జీవిత‌

 Authored By sandeep | The Telugu News | Updated on :18 May 2022,5:30 pm

Jeevitha : రాజ‌శేఖ‌ర్ హీరోగా జీవిత తెర‌కెక్కించిన చిత్రం శేఖ‌ర్. ఈ సినిమా మే 20న విడుద‌ల‌కి సిద్ధ‌మైంది. ఈ క్ర‌మంలో ప్ర‌మోష‌న్ స్పీడ్ పెంచారు. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్‌లో శివానీ రాజశేఖర్ మాట్లాడుతూ అందరినీ ఏడిపించేశారు. సినిమా ఇంకో పది రోజుల్లో స్టార్ట్ అవుతుందన్న సమయంలో.. నాన్నకు కోవిడ్ వచ్చింది. నాకు మూడు రోజుల్లోనే తగ్గింది. కానీ డాడీకి చాలా సీరియస్ అయింది. నెలన్నర హాస్పిటల్‌లో ఉన్నాం. మా నాన్నకు బాత్రూంకి వెళ్లొచ్చే సమయంలోనే సాట్యురేషన్ పడిపోయేది.

ఆయనే మా ఇంటి పెద్ద.. డాక్టర్.. ఆయనే అలాంటి స్థాయిలో ఉన్నప్పుడు.. మాకు ఏం జరుగుతోందో అర్థం కాలేదు.. జీవితం స్థంభించిపోయినట్టు అనిపించింది..ఓ రోజు డాక్టర్లు డాడీకి 50 50 చాన్స్ అని అన్నారు.. డాడీ నువ్ ఇలా చేయొద్దు.. బయటకు రా.. పోరాడు.. నా వల్ల నీకు ఇలా వచ్చింది.. నేను తట్టుకోలేను.. అని హాస్పిటల్‌లో ఏడ్చేశాను. అప్పుడు డాడీ మాస్క్ తీసేసి.. నీ వల్ల రావడం ఏంట్రా.. నీ వల్ల కాకపోతే ఇంకెవరి మూలానో వచ్చేది.. నాకేం కాదురా.. అని అన్నారు. అప్పుడు 75 నుంచి 63 కేజీలు తగ్గాడు. ఆ తరువాత మెల్లిమెల్లిగా కూర్చోవడం, నిల్చోడం, మెట్లు ఎక్కడం, దిగడం, జిమ్ ఇలా అన్నీ నేర్చుకున్నారు.. మళ్లీ 75 వరకు చేరారు..

Jeevitha Stunning Comments On Shivani

Jeevitha Stunning Comments On Shivani

శేఖర్ మూవీ కోసం రెడీ అయ్యారు.ఈ సినిమా పాత్రకు స్మోకింగ్ చేయాలి.. లంగ్స్ అప్పటికే పాడైపోయాయి. వద్దని మేం అన్నాం.. కానీ ఆయన మాత్రం చేద్దామని అన్నారు. సినిమాకేం కావాలో అన్నీ చేశారు.. ఈ సినిమా ఎవరి కోసం ఆడినా ఆడకపోయినా మా డాడీ కోసం ఆడుతుందని తెలుసు.. మా డాడీకి ఇది పునర్జన్మ. పునర్జన్మలో ఇది మొదటి చిత్రం అని చెప్పుకొచ్చింది శివాని. అయితే శివాని గురించి జీవిత మాట్లాడుతూ.. ఇద్ద‌రు పిల్లలు ఫుడ్ కోసం డ‌బ్బులు బాగా ఖ‌ర్చు చేస్తారు. శివానీ అయితే స్విగ్గీ వాళ్లతో గొడవలు పెట్టుకుంటుంది.. కొంచెం ఆలస్యమైనా డబ్బులు ఇవ్వదు అంటూ జీవిత చెప్పుకుంటూ పోయింది.

Advertisement
WhatsApp Group Join Now

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది