jnanamba family participates in dussehra celebrations at temple
Janaki Kalaganaledu : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. 24 అక్టోబర్ 2022, సోమవారం ఎపిసోడ్ 416 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. విజయ దశమి సందర్భంగా జ్ఞానాంబ ఫ్యామిలీ మొత్తం గుడికి వెళ్లుందుకు రెడీ అవుతుంది. అక్కడ పొంగళి వండేందుకు అన్ని సామాన్లు సర్దుతుంది జానకి. కానీ.. మల్లిక మాత్రం తను సపరేట్ గా సామాన్లు తీసుకొని వస్తుంది. రేపు ఎలాగూ వేరు కాపురం పెట్టాల్సిన వాళ్లమే కదా. అందుకే గుడిలో ప్రసాదం వండేందుకు సామాన్లు తీసుకొచ్చాను అని జానకి అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెబుతుంది మల్లిక. ఆ తర్వాత కారులో వెళ్దాం పదా అని జానకి విష్ణు, మల్లికను పిలుస్తుంది. కానీ.. మల్లిక మాత్రం అవసరం లేదు మేము ఆటోలో వెళ్తాం అని ఇద్దరూ అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఆ తర్వాత జెస్సీ, అఖిల్ కూడా నడుచుకుంటూనే గుడికి వెళ్తారు.
jnanamba family participates in dussehra celebrations at temple
వీళ్లను చూసి జ్ఞానాంబకు ఏం చేయాలో అర్థం కాదు. వీళ్ల ప్రవర్తన చూసి జ్ఞానాంబ అక్కడే కుప్పకూలుతుంది. దీంతో తనను జానకి, రామా ఓదార్చుతారు. ఆ తర్వాత గుడికి వెళ్లిన మల్లిక మరో ప్లాన్ వేయడానికి నీలావతి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. నీలావతి కోసం చూస్తుండగా మరో మహిళను పంపిస్తుంది నీలావతి. ఆమె రావడం లేదు అంటుంది. మీ పెద్దమ్మే నన్ను పంపించింది.. అంటుంది. దీంతో తను ఏం చేయాలో చెబుతుంది మల్లిక. దీంతో నేను అల్లుకుపోతాను కదా అంటుంది ఆ మహిళ. మరోవైపు మల్లిక అన్ని సామాన్లు పెట్టి అమ్మవారికి ప్రసాదం వండుతూ ఉంటుంది.
ఇంతలో గుడికి జ్ఞానాంబ ఫ్యామిలీ వస్తారు. వాళ్లు రాగానే ఆ మహిళను రెచ్చగొడుతుంది మల్లిక. దీంతో ఇక తన ప్లాన్ అమలు చేస్తుంది. ఏంటి మల్లిక.. మీది ఉమ్మడి కుటుంబం కదా. నువ్వు ఒక్కదానివే పొంగళి వండుతున్నావు ఏంటి. పైగా ఇవాళ విజయ దశమి అని అడుగుతుంది.
పరిస్థితులు, పద్ధతులు మారుతుంటాయి పిన్ని అంటుంది మల్లిక. ఏదో కొత్తగా మాట్లాడుతున్నావు ఏంటి మల్లిక అంటుంది ఆ మహిళ. అందరినీ వదిలేసి నువ్వు ఒక్కదానివే పొంగళి పెట్టుకుంటున్నావు ఏంటి అని అడగగా.. ఈ విజయ దశమి నుంచి అంటూ ఏదో చెప్పబోతుండగా మల్లిక అంటూ ఆపుతుంది జానకి.
సరదాకు కూడా ఒక హద్దు ఉంటుంది మల్లిక. దాన్ని దాటకు అంటుంది జానకి. మల్లిక ఏదో చెప్పబోతుంటే నువ్వు అడ్డుపడుతున్నావు ఏంటి. తనేమో మీకన్నా ముందు వచ్చి ప్రసాదం వండుతోంది. ఏం జరిగింది అని అడుగుతుంది. దీంతో ఏం జరగలేదు అంటుంది జానకి.
ఆ తర్వాత అఖిల్, జెస్సీ కూడా వస్తారు. మల్లిక కడుపుతో ఉంది కాబట్టి.. అత్తయ్య గారే మల్లికను పొంగళి చేయమన్నారు అంటుంది జానకి. అయినా మా విషయాలు మీకెందుకు అంటుంది జానకి. దీంతో అయినా నాకెందుకు అంటుంది. ఏదేదో ఊహించుకొని అనవసరంగా మాట్లాడకండి అంటుంది జ్ఞానాంబ.
తర్వాత అందరూ పొంగళి వండి దేవతకు నైవేద్యంగా సమర్పిస్తారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.