
jnanamba warns mallika to be soft with vishnu in janaki kalaganaledu
Janaki Kalaganaledu : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. 18 జులై 2022, సోమవారం ఎపిసోడ్ 346 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రాత్రి పూట జరిగిన విషయం గురించి జానకి ఆలోచిస్తూ ఉంటుంది. జానకి, రామా ఇద్దరూ మూడ్ లో ఉండగా ఒక్కసారిగా కప్ బోర్డ్ లో ఉన్న ఐఏఎస్ పుస్తకం కింద పడుతుంది. దీంతో రామా డిస్టర్బ్ అవుతాడు. అంతే కాదు.. చూడండి.. ఐపీఎస్ పుస్తకం కూడా నాకు నా బాధ్యతను గుర్తు చేస్తోంది అని అంటాడు. వద్దండి.. మీరు ముందు ఐపీఎస్ పూర్తి చేయండి. ఆ తర్వాత పిల్లల గురించి ఆలోచిద్దాం అని చెప్పి రామా శోభనాన్ని మళ్లీ వాయిదా వేస్తాడు. దీంతో జానకి వద్దు.. నేను సంసార జీవితాన్ని, మిగితా జీవితాన్ని ఒకేసారి మోస్తాను అంటుంది.. కానీ.. రామా మాత్రం వినడు.
jnanamba warns mallika to be soft with vishnu in janaki kalaganaledu
వద్దు అస్సలు వద్దు. ఆ పెన్ను, పుస్తకం మరోసారి నా బాధ్యతను గుర్తు చేయడం కోసమే కింద పడ్డాయి అంటాడు. అవన్నీ గుర్తు చేసుకుంటుంది జానకి. అత్తయ్య గారి నమ్మకాన్ని నిలబెట్టడం కోడలుగా నా ధర్మం అని అనుకుంటుంది జానకి. మరోవైపు కొట్టుకు వెళ్లిన రామా.. అలా ఎలా జరిగింది. రాత్రి ఏం జరిగింది అని అనుకుంటాడు రామా. ఇంతలో జానకి ఫోన్ చేసి.. రామాతో సరసాలు ఆడుతుంది. ఏం చేస్తున్నారు శ్రీవారు. మీరు పదే పదే గుర్తొస్తున్నారు అంటుంది జానకి. దీంతో రామా షాక్ అవుతాడు. వచ్చేటప్పుడు 5 మూరల మల్లెపూలు, విడి పూలు తీసుకురండి అంటుంది జానకి.
మరోవైపు రామా కోసం రెడీ అవుతుంది జానకి. బ్లాక్ చీర కట్టుకొని రామా రాగానే అతడికి ఎదురు వెళ్తుంది. జానకిని చూసి రామా టెంప్ట్ అవుతాడు. అంటే అన్నానంటారు కానీ.. ఇక్కడి దాకా వచ్చిన వాడిని లోపలికి రానా. మీరు ఇలా ఎదురు చూడాలా చెప్పండి అని అడుగుతాడు రామా.
దీంతో పలానా టైమ్ కు భర్త వస్తాడని తెలిసినా భార్య ఎందుకు ఎదురు చూస్తుందంటే దాంట్లో సరదా ఉంటుంది. ఆనందం ఉంటుంది అని చెప్పి అతడిని లోపలికి తీసుకెళ్తుంది జానకి. ఇవన్నీ మల్లిక చూసి.. మళ్లీ వీళ్ల ఏకాంతాన్ని చెడగొట్టాలి అని అనుకుంటుంది కానీ.. ఎలా చెడగొట్టాలి అని ప్లాన్స్ వేస్తుంది మల్లిక.
మరోవైపు విష్ణు వచ్చి వేడినీళ్లు పెట్టు అని అడిగితే మల్లిక తింగరి సమాధానం చెబుతుంది. ఇదంతా జ్ఞానాంబ చూసి మల్లికకు వార్నింగ్ ఇస్తుంది. ఇంకోసారి విష్ణుతో అలా ప్రవర్తిస్తే బాగుండదు అంటుంది. దీంతో సరే అంటుంది మల్లిక. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
This website uses cookies.