
Niharika : రెండో పెళ్లిపై నిహారిక కొణిదల క్లారిటీ... మాజీ భర్త చైతన్య పోస్ట్...!
Niharika : మెగా బ్రదర్ నాగబాబు కొణిదల ముద్దుల కూతురు నిహారిక కొణిదల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. అయితే నిహారిక కొణిదల ముందుగా బుల్లితెరపై యాంకర్ గా అడుగుపెట్టింది. అనంతరం పలు సినిమాలలో వెబ్ సీరియస్ లలో ఆమె నటించడం జరిగింది. అయితే ఆమెకు సినిమాలు అంతగా కలిసి రాకపోవడంతో సినిమాలకు గుడ్ బై చెప్పి స పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా జొన్నలగడ్డ చైతన్యను వివాహం చేసుకుంది. ఇక మెగా కుటుంబంలో మరియు సినీ ఇండస్ట్రీలో క్యూట్ కపుల్స్ గా పేరు తెచ్చుకున్న ఈ జంట ఎవరు ఊహించని విధంగా విడాకులు తీసుకొని విడిపోయారు. ఇక వీరిద్దరి మధ్య ఏం జరిగింది అనే విషయాలు తెలియదు కానీ గత ఏడాది వీరిద్దరూ సైలెంట్ గా విడాకులు తీసుకుని షాక్ ఇచ్చారు.. అయితే ఇప్పటికీ వీరు ఎందుకు విడిపోయారు అనేది క్లారిటీ లేదు.
ఇది ఇలా ఉంటే విడాకుల తర్వాత సోషల్ మీడియాకు కాస్త దూరంగా ఉన్న నిహారిక కొణిదల ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా కనిపిస్తున్నారు. ఈ క్రమంలోనే పలు రకాల ఇంటర్వ్యూలలో కూడా ఆమె మాట్లాడుతూ విడాకుల గురించి కూడా చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ విడిపోతామని తెలిసి ఎవరు పెళ్లి చేసుకోరని…ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఎంతో ఎంతో గ్రాండ్ గా సెలబ్రేషన్స్ చేయరని తెలిపింది. దీంతో అప్పుడు నిహారిక చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున వైరల్ గా మారాయి. ఇక ఈ వ్యాఖ్యలపై జొన్నలగడ్డ చైతన్య సైతం స్పందిస్తూ విడాకులు అనేవి రెండు మనుషుల మధ్య జరిగిన విషయాలని వాటిని పబ్లిక్ గా మాట్లాడకూడదు అంటూ ఇన్ డైరెక్టుగా గా చెప్పుకొచ్చారు.
అయితే తాజాగా నిహారిక కొణిదల రెండో వివాహంపై చర్చలు మొదలయ్యాయి అని చెప్పాలి. ఎందుకంటే తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు పిల్లలు అంటే చాలా ఇష్టం అని పిల్లలు కావాలంటే ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాల్సిందే అంటూ చెప్పుకొచ్చారు. ప్రేమ విషయంలో నెగిటివ్ ఇంప్రెషన్ అనేది అసలు లేదని ఒక రిలేషన్ షిప్ వర్కు కాలేదంటే ఎన్నో కారణాలు ఉంటాయని ఈ సందర్భంగా ఆమె తెలియజేశారు.అయితే ఆమె కచ్చితంగా రెండో పెళ్లి చేసుకుంటుంది అనేది క్లారిటీ లేదు కానీ ఆమె చేసిన వ్యాఖ్యలు మాత్రం కాస్త అలాగే అనిపిస్తున్నాయి. దీంతో ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.
ఇది ఇలా ఉండగా నిహారిక కొణిదల రెండో పెళ్లిపై మాట్లాడిన అనంతరం జొన్నలగడ్డ చైతన్య ఓ ఇంట్రెస్టింగ్ నోటు సోషల్ మీడియాలో షేర్ చేశాడు.అయితే ఆ నోటు కచ్చితంగా నిహారిక కోసమే అని నేటిజనులు అభిప్రాయ వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ నోట్ లో సుదీర్ఘ కవిత లాంటి పదాలను ఆయన పోస్ట్ చేశారు. ఇక ఈ నోట్ లో విశాలమైన అంతరిక్షంలో నిశ్శబ్దం… మీరు నీటి అడుగున ఉన్నప్పుడు మీరు అనుభవించే నిశబ్దం…చల్లని శీతాకాలపు రాత్రి మిమ్మల్ని ఆవరించే నిశ్శబ్దం… చప్పట్లు కొట్టే ముందు ప్రదర్శన ముగింపులో నిశ్శబ్దం… మీ ఆలోచనలలో మీరు కోరుకునే నిశ్శబ్దం… మీ భౌతిక రూపం నుండి విముక్తి పొందండి..అదే నిశ్శబ్దం భగవంతుడికి ఒక మాధ్యమం అని మీరు కనుగొంటారంటూ చైతన్య ఓ నోటు షేర్ చేసాడు. దీంతో ఈ నోటు ఎవరికోసం అంటూ నేటి జనులు ప్రశ్నిస్తున్నారు.దీంతో ప్రస్తుతం జొన్నల గడ్డ చైతన్య షేర్ చేసిన నోటు ప్రస్తుతం సోషల్ మీడియా వైరల్ గా మారింది.
Pawan Kalyan : బెంగళూరు నగరం అంటేనే ఐటీ హబ్తో పాటు అంతులేని ట్రాఫిక్ జామ్లకు కేరాఫ్ అడ్రస్గా మారిపోయింది.…
Nara Lokesh : మంత్రి నారా లోకేష్ ఏపీ రాజకీయాల్లో సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నారు. సాధారణంగా ఏ రాజకీయ…
Eating : ఆరోగ్యకరమైన జీవనశైలిలో మనం తీసుకునే ఆహారం ఎంత ముఖ్యమో, దానిని తీసుకునే పద్ధతి కూడా అంతే ముఖ్యం.…
Udyogini Scheme : మహిళా సాధికారతను ప్రోత్సహించే దిశగా కర్ణాటక ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ఉద్యోగిని పథకం 2026' అందరిలో సంతోషాన్ని…
NIT Warangal Recruitment 2026 : వరంగల్లోని ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) 2026 సంవత్సరానికి గాను…
దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరల పెరుగుదల సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. గత కొద్ది రోజులుగా స్థిరంగా పెరుగుతూ వస్తున్న…
Mutton : సంక్రాంతి పండుగ వేళ తెలుగువారి ఇళ్లలో పిండివంటలతో పాటు మాంసాహార వంటకాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.…
Male Infertility : నేటి ఆధునిక కాలంలో స్త్రీ, పురుష భేదం లేకుండా మద్యం సేవించడం ఒక అలవాటుగా మారిపోయింది,…
This website uses cookies.