Venu Swamy : పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ పార్టీకి గట్టి షాప్ తగిలింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ కూతురు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిన్న అరెస్టు అయ్యారు. లిక్కర్ స్కామ్ కేసులో నిన్న హైదరాబాద్ లోని కల్వకుంట్ల కవిత ఇంట్లో సోదాలు నిర్వహించిన ఈడి అధికారులు సోదాల అనంతరం ఆమెను అరెస్ట్ చేస్తున్నట్లుగా నోటీసులు జారీ చేశారు. అదేవిధంగా కవితకు సంబంధించిన ఫోన్లను కూడా ఈడి అధికారులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇక కవిత అరెస్టుపై బీఆర్ఎస్ వర్గాలు మండిపడుతున్నాయి. కోర్టులో కేసు నడుస్తుండగా సడన్ గా సోదాలు నిర్వహించడం ఏంటి అంటూ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే విషయం తెలుసుకున్న కార్యకర్తలు సైతం కవిత ఇంటి వద్దకు చేరి ధర్నాలు చేశారు. అదే విధంగా కవిత ఇంటికి చేరుకున్న కేటీఆర్ హరీష్ రావు ఈడి అధికారులతో వాగ్వాదానికి కూడా దిగారు. వారెంట్ లేకుండా కవితను ఎలా అరెస్ట్ చేస్తారంటూ కేటీఆర్ ఈడి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అనంతరం భారీ బందోబస్తు మధ్య కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు అరెస్టు చేసి ఢిల్లీకి తరలించడం జరిగింది. ఇది ఇలా ఉండగా ఎమ్మెల్సీ కలవకుంట్ల కవిత అరెస్టు అవుతుందని ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గతంలో చెప్పిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే వేణు స్వామి సినీ సెలబ్రిటీల గురించి రాజకీయ నాయకులు గురించి పలు సందర్భాలలో పలు రకాల వ్యాఖ్యలు చేస్తూ వస్తుంటారు. చాలా సందర్భాలలో వేణు స్వామి చెప్పిన వ్యాఖ్యలు కూడా నిజమయ్యాయి. తాజాగా మూడు నెలల క్రితం ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన వేణు స్వామి…ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కల్వకుంట్ల కవిత జాతకంలో కచ్చితంగా జైలుకు వెళ్లే యోగం ఉందని తెలియజేశారు.
లిక్కర్ స్కామ్ లో జైలుకు వెళుతుందా లేదా మరో కేసులో జైలుకు వెళ్తుందా అనేది తాను చెప్పలేను కానీ కల్వకుంట్ల కవిత అయితే కచ్చితంగా జైలుకు వెళ్లడం ఖాయమని వేణు స్వామి తేల్చి చెప్పారు. అయితే గతంలో ఆ ఇంటర్వ్యూలో వేణు స్వామి చెప్పిన విధంగానే కల్వకుంట్ల కవిత ఇప్పుడు లిక్కర్ స్కామ్ కేసు లో అరెస్టు అయ్యారు. దీంతో ఆనాడు వేణు స్వామి కవిత గురించి చెప్పిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక వేణు స్వామి చెప్పే జాతకాలు కచ్చితంగా నిజమవుతాయని పలువురు అభిప్రాయ వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కల్వకుంట్ల కవిత అరెస్టుపై బీఆర్ఎస్ పార్టీ ఎలా ముందుకు వెళుతుందనేది తీవ్ర ఆసక్తికరంగా మారింది.
Success Story : ఇటీవలి కాలంలో ప్రతి ఒక్కరు కాస్త సృజనాత్మకతతో ఆలోచిస్తున్నారు. నాలుగు రూపాయలు సంపాదించాలనే ఆలోచన ప్రతి…
China Discovers : హునాన్ ప్రావిన్స్‌లో చైనా భారీ బంగారు నిల్వలను కనుగొంది. ఈ నిల్వల యొక్క అంచనా విలువ…
TTD : టీటీడీలో ఉద్యోగాల కోసం కొంత మంది కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తూ ఉంటారు. అయితే…
Elon Musk : టెస్లా అధినేత, బిలియనీర్ ఎలాన్ మస్క్ భారతదేశం ఓట్ల-లెక్కింపు ప్రక్రియ యొక్క సామర్థ్యాన్ని ప్రశంసించారు. ఆదివారం…
Prashanth Varma : అ! సినిమాతో డైరెక్టర్ గా కెరీర్ మొదలు పెట్టిన ప్రశాంత్ వర్మ ఒక్కో సినిమాకు తన…
Heels Cracked : చలికాలం వచ్చిందంటే చాలు చర్మ సమస్యలు అనేవి వెంటాడుతాయి. అలాగే చర్మం పగిలిపోవడం మరియు పొడిబారడం,చర్మం నిర్జీవంగా…
Hero Splendor Plus : హీరో స్ప్లెండర్ ప్లస్ బైక్ సొంతం చేసుకోవాలనే వారికి షో రూం హర కంటే…
Acidity : ప్రస్తుత కాలంలో చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ఎక్కువ సంఖ్యలో ప్రజలు కడుపుకు సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.…
This website uses cookies.