Jr Ntr : అఖండ మూవీపై ఎన్టీఆర్ కామెంట్స్.. ‘రీ సౌండ్ దద్దరిల్లింది’.. కంగ్రాట్స్ బాల బాబాయ్!

Authored By mallesh | The Telugu News | Published on: December 3, 2021, 1:40 pm

Jr Ntr : నందమూరి నటసింహం బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన ‘అఖండ’ మూవీ మాస్ ఆడియెన్స్‌‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. డిసెంబర్ -2న విడుదలైన ఈ సినిమాకు విశేషమైన స్పందన వస్తోంది. బాలయ్య బాబు మరోసారి తన నట విశ్వరూపం చూపించారని ఫ్యాన్స్ రచ్చ మాములుగా లేదు.. థియేటర్స్ వద్ద ఎక్కడ చూసినా ‘జై బాలయ్య జైజై బాలయ్య’ అనే నినాదాలు మిన్నంటుతున్నాయి. అనకున్నట్టు గానే బోయపాటి, బాలయ్య కాంబినేషన్ మరోసారి సక్సెస్ అవ్వగా హ్యాట్రిక్ విజయం దక్కినందుకు ఇద్దరూ ఫుల్ ఖుషీగా ఉన్నారట..

నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ’ మూవీలో డ్యూయల్ రోల్ చేసి మరోసారి అభిమానులకు ఫుల్ కిక్కు ఇచ్చారు. కరోనా తర్వాత విడుదలైన పెద్ద హీరో సినిమా కావడంతో ఈ సినిమాపై ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. వాటిని దర్శకుడు బోయపాటి శ్రీను నిలబెట్టారని తెలుస్తోంది. థియేటర్స్ వద్ద ఫ్యాన్స్ సందడి, సినిమా నడుస్తున్నటైంలో అభిమానుల విజిల్స్, గోల, అరుపులు వింటే మరో బ్లాక్ బ్లాస్టర్ పడిందని బాలయ్య బాబు ఫ్యాన్స్ ఫుల్లు ఖుషీలో ఉన్నారు. సోషల్ మీడియా మొత్తం అఖండ ఫీవర్‌తో ఊగిపోతోంది.

Jr ntr About on Balakrishna akhanda movie

Jr ntr About on Balakrishna akhanda movie

Jr Ntr : కంగ్రాట్స్.. బాల బాబాయ్..

ఈ సినిమాను వీక్షించిన స్టార్స్ సూపర్ స్టార్ మహేష్ బాబు, రామ్ పోతినేని ‘అఖండ’ విజయంపై ప్రశంసలు కురిపించారు. మూవీ యూనిట్‌కు అభినందనలు తెలిపారు. తాజాగా అఖండ మూవీ చూసిన ఎన్టీఆర్ తనదైన శైలిలో స్పందించారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన యంగ్ టైగర్ ‘అఖండ’ సినిమాను ఇప్పుడే వీక్షించాను. ‘రీ సౌండింగ్ సక్సెస్’ అందుకున్న బాల బాబాయ్‌కు, మూవీ యూనిట్ మొత్తానికి అభినందనలు అంటూ ట్వీట్ చేశారు. అభిమానులు ఏంజాయ్ చేసేందుకు అవసరమైన స్టఫ్ ఈ మూవీలో ఉందని కామెంట్ చేశారు. ఇక అభిమానులు మాత్రం ఎన్టీఆర్ ట్వీట్ పై స్పందిస్తూ జై బాలయ్య, జై ఎన్టీఆర్ అంటూ సంబురాలు చేసుకుంటున్నారు.

mallesh

No bio available for this author.

  1. "Grand Electronics Sale : టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.20 వేలపైగా భారీ డిస్కౌంట్లు..!"

  2. "Ysrcp Plan : పోరులో వైసీపీ అసలైన బలం అదేనా? గ్రౌండ్ లెవెల్ కేడర్‌పై జగన్ భారీ నమ్మకం..!"

  3. "Messi vs Ronaldo : మెస్సీయా.. రొనాల్డోనా? ఫుట్‌బాల్ ఆల్‌టైమ్ ‘గోట్’ ఎవరో తేల్చేసిన ఆ లెక్కలు..!"

  4. "Jailer 2 : తలైవా రజినీకాంత్.. ‘జైలర్ 2’ ప్రమోషన్లతో బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపనున్నారా..?"

  5. "Ys Jagan : స్థానిక ఎన్నికల్లో గెలుపే టార్గెట్.. అభ్యర్థుల ఎంపికపై రీజనల్ ఇన్‌ఛార్జ్‌లతో వైఎస్ జగన్ మైండ్ గేమ్!"

  6. "Pawan kalyan : అరెస్ట్‌పై పవన్ కల్యాణ్ కామెంట్స్.. తమ్ముళ్ల ఆగ్రహంతో కూటమిలో సరికొత్త దుమారం?"

  7. "Nandamuri Tejaswini : మేయర్ రేసులో నందమూరి బాలకృష్ణ కుమార్తె? తెరపైకి తేజస్విని పేరుతో పొలిటికల్ హీట్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp