Janhvi Kapoor : అందాల ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ ఇన్నాళ్లు బాలీవుడ్‌లో సందడి చేసి ఇప్పుడు తెలుగులో అలరించేందుకు రెడీ అయింది. దేవర సినిమాతో తెలుగు తెరకు డెబ్యూ ఇవ్వగా ఇప్పుడు రామ్ చరణ్ 16వ సినిమాలోను కథానాయికగా ఎంపికైంది. రంగస్థలం లాగా రస్టిక్ నేచర్ తో ఆ చిత్రానికి పది రెట్లు గ్రాండ్ గా అబ్బురపరిచే సన్నివేశాలతో మూవీని బుచ్చిబాబు తెరకెక్కించబోతున్నాడు. తాజాగా జరిగిన పూజా కార్యక్రమం కోసం జాన్వీ కపూర్ చీరకట్టులో వచ్చింది. తండ్రి బోనీ కపూర్‌తో కలిసి ఈ అమ్మడు ఇక్కడికి రావడం ప్రత్యేకత సంతరించుకుంది.ఈవెంట్‌లో జాన్వీ కపూర్ మాట్లాడిన మాటలు కూడా వైరల్ అయ్యాయి. తనకి ఈ సినిమా స్టోరీ మంచి విజయాన్ని అందిస్తుందని తాను భావిస్తున్నట్టు పేర్కొంది.
జాన్వీ ఇండస్ట్రీకి వచ్చి ఐదేళ్లు దాటింది కాని ఒక్క హిట్ పడలేదు. కేవలం తన అందచందాలతో మాత్రమే అలా బండిని నడిపిస్తుంది. అయితే ఇప్పుడు తెలుగులోకి అడుగుపెట్టిన ఈ భామ దేవర, ఆర్సీ 16 చిత్రాలు చేస్తుండగా, ఈ మూవీతో జాన్వీ క్రేజ్ అమాంతం పెరగడం ఖాయం అని అంటున్నారు. ఆర్ఆర్ఆర్ హీరోలు ఇద్దరు జాన్వీ కపూర్ ఇమేజ్‌ని అమాంతం పెంచే బాధ్యతని తీసుకున్నట్టు తెలుస్తుంది. జాన్వీ కపూర్.. శ్రీదేవి వారసురాలు కావడంతో హీరోలే కాదు దర్శక నిర్మాతలు కూడా ప్రత్యేక శ్రద్శ చూపుతున్నారు. కొన్నాళ్లుగా జాన్వీని టాలీవుడ్ కి తేవాలనే ప్రయత్నాలు జరుగుతున్నా చివరికి అది దేవర మూవీతో సాధ్యం అయింది.
అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్- శ్రీదేవిలది హిట్ పెయిర్ కాగా, వారు చాలా సినిమాలలో నటించి మెప్పించారు. ఇప్పుడు ఆ లెజెండరీ నటుల వారసులు జూనియర్ ఎన్టీఆర్-జాన్వీ కలిసి దేవర చిత్రం చేస్తుండగా, ఈ సినమాతో వారిద్దరు దుమ్ము రేపడం ఖాయం అంటున్నారు. ఇక శ్రీదేవి-చిరంజీవి కాంబో కూడా ఇండస్ట్రీలో ఎవర్‌గ్రీన్ కాంబో. వీరిద్దరి కాంబోలో వచ్చిన జగదేకవీరుడు అతిలోకసుందరి ఇప్పటికీ ప్రేక్షకులని అలరిస్తూనే ఉంది. ఇప్పుడు వారి వారసులైన రామ్ చరణ్ – శ్రీదేవి ఆర్సీ 16 మూవీ చేస్తుండగా, ఈ సినిమాతో వీరిద్దరు కూడా హిట్ పెయిర్ అనిపించుకుంటారని చెబుతున్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ మూవీలలో ఒక సినిమా అయిన మంచి హిట్ అయితే జాన్వీకి తిరుగు ఉండదు. లేకుంటే సౌత్ లో జాన్వీకి డోర్లు మూసుకుపోతాయి.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.