Home » Entertainment » Jr Ntr Cheated By His Friend
Entertainment

JR NTR : ఎన్టీఆర్‌ని సొంత ఫ్రెండే మోసం చేశాడా.. అత‌ను ఎవ‌రో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

Authored By
Sam C
The Telugu News | Published on: October 15, 2022, 9:30 pm
Advertisement

JR NTR : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం టాలీవుడ్ టాప్ హీరోల‌లో ఒక‌రు. ఆయ‌న సినిమాలు ఏ రేంజ్ విజ‌యం సాధిస్తాయో మ‌నంద‌రికి తెలుసు. ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈ స్థాయికి వ‌చ్చిన ఎన్టీఆర్ ఫ్రెండ్షిప్ కి చాలా వాల్యూ ఇస్తాడు. స్నేహానికి ప్రాణం ఇచ్చే ఎన్టీఆర్‌కి ఒక వ్యక్తి దారుణంగా మోసం చేశాడ‌ట‌. అత‌ను సినిమా ఇండస్ట్రీకి చెందిన వాడే. సింహాద్రి హిట్ తరవాత ఒక్కసారిగా తారక్ రేంజ్ మారిపోవ‌డంతో అంచ‌నాలు భారీగా పెరిగాయి. అప్పుడు ఆ హీరో తన అవసరాల కోసం ఎన్టీఆర్ పేరు చెప్పుకొని కొందరి దగ్గర డబ్బులు తీసుకున్నాడట.

Advertisement

ఈ విష‌యాన్ని ఎన్టీఆర్‌కి కూడా చెప్ప‌లేద‌ట‌. ఆంధ్రావాలా, సాంబ , నా అల్లుడు.. వరుసగా మూడు డిజాస్టర్లు పడేసరికి ఎన్టీఆర్ కెరియర్ గ్రాఫ్ కొంచెం డౌన్ అయింది. ఆ టైంలోనే ఒక్కసారిగా ఆ ఫ్రెండ్ కి అప్పులు ఇచ్చిన జనాలు మొత్తం ఎన్టీఆర్ పై పడ్డారు. మీ మీద న‌మ్మ‌కంతో ఫ్రెండ్‌కి డ‌బ్బులు ఇచ్చాం, ఇప్పుడు మీ మార్కెట్ పడిపోయింది.. మాకు నమ్మకం లేదు. మా డబ్బులు మాకు ఇవ్వు” అంటూ పీకల మీద కూర్చున్నారట . ఈ క్రమంలోనే ఎన్టీఆర్ తను దాచుకున్న డబ్బులను మొత్తం ఇచ్చేసాడట .

JR NTR cheated by his friend

Advertisement

JR NTR : పాపం మోస‌పోయాడా..

ఈ క్రమంలోనే అతడు వచ్చి ఎన్టీఆర్ కు సారీ చెప్పినా ఎన్టీఆర్ క్షమించలేదట. ఇప్పటికి ఎన్టీఆర్ ఆయన ను దూరం పెట్టే ఉన్నాడట. న‌మ్మించి మోసం చేసిన వ్యక్తిని ఎన్టీఆర్ అస్స‌లు ద‌గ్గ‌ర‌కు తీయ‌డం లేదట‌. ఇక చివ‌రిగా ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో ప‌ల‌క‌రించారు. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ కొర‌టాల శివ‌తో సినిమా చేస్తుండ‌గా, ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఆచార్య ఎఫెక్ట్ ఏమాత్రం పడకుండా ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారట కొరటాల. అందుకోసమే ఎక్కువ టైం తీసుకుంటున్నారట. అయితే ఇక ఈ సినిమాను కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించనున్నారు.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి