JR NTR : ఆస్కార్ అవార్డుకు అలానే వెళ్తా .. ఎవరు ఏం చేసుకుంటారో చేసుకోండి .. ఎన్టీఆర్ సంచలన వ్యాఖ్యలు ..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

JR NTR : ఆస్కార్ అవార్డుకు అలానే వెళ్తా .. ఎవరు ఏం చేసుకుంటారో చేసుకోండి .. ఎన్టీఆర్ సంచలన వ్యాఖ్యలు ..!!

JR NTR : దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించిన ‘ ఆర్ఆర్ఆర్ ‘ సినిమా ప్రపంచస్థాయిలో మంచి గుర్తింపు పొందింది. అంతేకాకుండా ఆస్కార్ అవార్డ్స్ కి నామినేట్ అయ్యింది. ఇక ఆస్కార్ అవార్డ్స్ లిస్టును ఈరోజు ప్రకటించనున్నారు. తెలుగు అభిమానులు, కోట్లాదిమంది భారతీయులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. ఇక ఆస్కార్ అవార్డ్స్ ప్రకటించడానికి కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది. దీంతో టాలీవుడ్ తో పాటు పలువురు స్టార్ ప్రముఖులు కూడా ఆస్కార్ అవార్డు కోసం […]

 Authored By prabhas | The Telugu News | Updated on :12 March 2023,10:20 am

JR NTR : దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించిన ‘ ఆర్ఆర్ఆర్ ‘ సినిమా ప్రపంచస్థాయిలో మంచి గుర్తింపు పొందింది. అంతేకాకుండా ఆస్కార్ అవార్డ్స్ కి నామినేట్ అయ్యింది. ఇక ఆస్కార్ అవార్డ్స్ లిస్టును ఈరోజు ప్రకటించనున్నారు. తెలుగు అభిమానులు, కోట్లాదిమంది భారతీయులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. ఇక ఆస్కార్ అవార్డ్స్ ప్రకటించడానికి కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది. దీంతో టాలీవుడ్ తో పాటు పలువురు స్టార్ ప్రముఖులు కూడా ఆస్కార్ అవార్డు కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోని ఆర్ఆర్ఆర్ టీం మరింత స్థాయిలో ప్రమోషన్స్ నిర్వహిస్తుంది.

JR NTR comments about RRR movie for Oscar

JR NTR comments about RRR movie for Oscar

ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా టీం మొత్తం అమెరికాలో హల్చల్ చేస్తుంది. ఇక ఇటీవల అమెరికా చేరుకున్న ఎన్టీఆర్ తాజాగా ఈటీ అనే హాలీవుడ్ టాక్ షో తో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ మాట్లాడిన మాటలు జనాలను బాగా ఆకర్షిస్తున్నాయి. ఎన్టీఆర్ మాట్లాడుతూ ఫస్ట్ టైం ఇంతటి ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డ్స్ లో పాల్గొంటున్నాను, ఫస్ట్ టైం రెడ్ కార్పెట్ పైన నడవబోతున్నాను, ఆ విషయం తలుచుకుంటుంటే గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. చాలా హ్యాపీగా ఉంది.

JR NTR comments about RRR movie for Oscar

JR NTR comments about RRR movie for Oscar

ప్రపంచమంతా ఎంతో ఆశగా ఈగరుగా వెయిట్ చేస్తున్న ఆస్కార్ అవార్డు వేడుకలో ఇండియన్స్ గా మేము రెడ్ కార్పెట్ పై నడవబోతున్నామని, భారతీయ చిత్ర పరిశ్రమ నుండి నటుడిగా నేను నడవబోతున్నాను అంటూ చెప్పుకొచ్చారు. భారతీయుడుగా నడిచి నా దేశం పట్ల నాకున్న గౌరవాన్ని తెలియజేస్తానని అంటూ ఎన్టీఆర్ చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యారు. ఈ క్రమంలోనే దేశభక్తిని చాటుతూ ఆయన చేసిన మాటలు జనాలకు విపరీతంగా నచ్చేసాయి. దీంతో అభిమానులు ఆయన మాటలను ట్రెండ్ చేస్తున్నారు. అలాగే ఆర్ఆర్ఆర్ సినిమా తప్పకుండా ఆస్కార్ అవార్డును గెలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది