JR NTR : దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించిన ‘ ఆర్ఆర్ఆర్ ‘ సినిమా ప్రపంచస్థాయిలో మంచి గుర్తింపు పొందింది. అంతేకాకుండా ఆస్కార్ అవార్డ్స్ కి నామినేట్ అయ్యింది. ఇక ఆస్కార్ అవార్డ్స్ లిస్టును ఈరోజు ప్రకటించనున్నారు. తెలుగు అభిమానులు, కోట్లాదిమంది భారతీయులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. ఇక ఆస్కార్ అవార్డ్స్ ప్రకటించడానికి కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది. దీంతో టాలీవుడ్ తో పాటు పలువురు స్టార్ ప్రముఖులు కూడా ఆస్కార్ అవార్డు కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోని ఆర్ఆర్ఆర్ టీం మరింత స్థాయిలో ప్రమోషన్స్ నిర్వహిస్తుంది.
ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా టీం మొత్తం అమెరికాలో హల్చల్ చేస్తుంది. ఇక ఇటీవల అమెరికా చేరుకున్న ఎన్టీఆర్ తాజాగా ఈటీ అనే హాలీవుడ్ టాక్ షో తో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ మాట్లాడిన మాటలు జనాలను బాగా ఆకర్షిస్తున్నాయి. ఎన్టీఆర్ మాట్లాడుతూ ఫస్ట్ టైం ఇంతటి ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డ్స్ లో పాల్గొంటున్నాను, ఫస్ట్ టైం రెడ్ కార్పెట్ పైన నడవబోతున్నాను, ఆ విషయం తలుచుకుంటుంటే గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. చాలా హ్యాపీగా ఉంది.
ప్రపంచమంతా ఎంతో ఆశగా ఈగరుగా వెయిట్ చేస్తున్న ఆస్కార్ అవార్డు వేడుకలో ఇండియన్స్ గా మేము రెడ్ కార్పెట్ పై నడవబోతున్నామని, భారతీయ చిత్ర పరిశ్రమ నుండి నటుడిగా నేను నడవబోతున్నాను అంటూ చెప్పుకొచ్చారు. భారతీయుడుగా నడిచి నా దేశం పట్ల నాకున్న గౌరవాన్ని తెలియజేస్తానని అంటూ ఎన్టీఆర్ చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యారు. ఈ క్రమంలోనే దేశభక్తిని చాటుతూ ఆయన చేసిన మాటలు జనాలకు విపరీతంగా నచ్చేసాయి. దీంతో అభిమానులు ఆయన మాటలను ట్రెండ్ చేస్తున్నారు. అలాగే ఆర్ఆర్ఆర్ సినిమా తప్పకుండా ఆస్కార్ అవార్డును గెలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.