Jr NTR : తెలుగు సినీ ఇండస్ట్రీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కోట్లాది మందికి అభిమాన నటడు. ఈ పేరుకు టాలీవుడ్ లో ఉన్న క్రేజే వేరు. డాన్స్ లతో డైలాగులతో.. అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేయడంలో ఈ జూనియర్ నందమూరి తారక రామరావు దిట్ట. ఎప్పటికప్పుడు పాత్రల్లో వైవిద్యం చూపిస్తూ… టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానం సంపాందించుకున్నాడు. ప్రస్తుతం తారక్ రాజమాళి దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ ఆర్ ఆర్ ఆర్ మూవీ ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు. రిలీజ్ కు సిద్ధంగా ఉన్న ఈ సినిమాలో రామ్ చరణ్ మరోక హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా వచ్చే జనవరి 7న రిలీజ్ కానుంది.
ఎన్టీఆర్ ఇది వరకే రాజమౌళితో చేసిన 2 సినిమాలు… స్టూడెంట్ నెం 1, యమదొంగ బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. యమ దొంగ సినిమాలో మానవుడి పాత్రలో, మరోవైపు జూనియర్ యముడి పాత్రలో తారక్ నటన అద్భుతమనే చెప్పాలి.సాధరణంగా ఏ సినిమాలోనైనా ఓ హీరో ఒకరు లేదా ఇద్దరు హీరోయిన్లతో నటించడం చూస్తూ ఉంటాం. మహా అంటే అతి కొద్ది సినిమాల్లో ఓ ముగ్గురు హీరోయిన్లు.. అంతే. కానీ యమదొంగ సినిమాలో మాత్రం తారక్… ఏకంగా 6 మంది హీరోయిన్లతో కలిసి స్టెప్పులేశాడు. సినిమాలో మెయిన్ హీరోయిన్లుగా ప్రియమణి, మమతా మొహన్ దాస్ అయినా..ఈ సినిమాలో మరో 2 స్పెషల్ సాంగ్స్ లో తారక్ నలుగురు హీరోయిన్లతో ఆడిపాడారు.
యమదొంగ సినిమాలో భూలోకంలో ఉన్నప్పుడు.. రంభతో నాచొరే నాచొరే అంటూ ఢిఫరెంట్ గా డ్యాన్స్ చేసిన తారక్.. ఇక యమలోకానికి చేరుకున్నాక… రంభ, ఊర్వశి, మేనకలుగా నటించిన వేద, నవనీత్ కౌర్, ప్రీతీ జింగానీలతో అద్దిరిపోయే స్టెప్పులేసి అభిమానులతో వారెవ్వా అనిపించారు. సినిమా మొత్తం సైలెంట్ గా ఉండే హీరోయిన్ ప్రియమణితో కూడా రబ్బరు గాజులు అంటూ తారక్ చెలరెగిపోయి డ్యాన్స్ వేయించారు. ఇక మమత మొహన్ దాస్ తో ఓ వైపు కామెడీ పండిస్తూనే… ఓలమ్మీ తిక్కరేగిందా అంటూ మాస్ స్టెప్పులతో దుమ్ము దులిపేశాడు. అప్పట్లో బాక్స్ ఆఫిస్ ను షేక్ చేసిన ఈ చిత్రాన్ని ఇప్పటికి టీవీలకు అతుక్కుపోయి చూసేవాళ్లు ఎంతో మంది ఉన్నారు.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.