JR Ntr entry to Bollywood
JR Ntr : ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారిన జూనియర్ ఎన్టీఆర్ వరుసగా పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ‘ దేవర ‘ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ బాలీవుడ్లోకి అడుగుపెట్టనున్నారు. బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ తో ఎన్టీఆర్ కలిసి ‘ వార్ 2 ‘ లోనటించనున్నారు. ఈ మల్టీ స్టారర్ సినిమాను యష్ రాజ్ ఫిలింస్ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ తో నిర్మిస్తోంది. వైఆర్ ఎఫ్ స్పై యూనివర్స్ నుంచి వస్తున్న సినిమా ఇది. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్ తో అభిమానుల్లో ఆత్రుత పెరిగింది. యంగ్ టైగర్ బాలీవుడ్ డెబ్యూ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
హృతిక్ , తారక్ కాంబినేషన్ లో సినిమా అనేది ఊహకు కూడా రాలేదు. ప్రేక్షకాభిమానులకు ఇది ఊహించని సర్ప్రైజ్. ఈ సినిమాని అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే హృతిక్ రోషన్ తారక్ కోసం యుద్ధభూమిలో ఎదురుచూస్తున్నట్లు రివిల్ చేశారు. ఓవైపు వైఆర్ఎఫ్ భారీ సినిమాలను ఖాన్ హీరోలతో నిర్మిస్తూనే ఈ కాంబినేషన్ తెరపైకి తెచ్చింది. ఇప్పటివరకు వైఆర్ఎఫ్ స్పేవర్స్ లో సల్మాన్ ఖాన్, షారుఖాన్, హృతిక్ రోషన్, టైగర్ ష్రఫ్ సహా కొందరు బాలీవుడ్ స్టార్స్ మాత్రమే ఉన్నారు. ఇప్పుడు యంగ్ టైగర్ కూడా చేరుతున్నారు.
JR Ntr entry to Bollywood
ఈ సినిమా కోసం తారక్ భారీగానే పారితోషకం తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. అయితే ఇక్కడ వైఆర్ఎఫ్ గేమ్ ప్లాన్ కూడా బయటకు వచ్చింది. ఈ సినిమాని హిందీతో పాటు పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతుంది. తెలుగులో ఈ సినిమా హిట్ అయితే భారీగా వసూళ్లు వస్తాయి. దీని ద్వారా వైఆర్ఎఫ్ టాలీవుడ్ లో అధికారికంగా లాంచ్ అయినట్లు అవుతుంది. ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ ను సంపాదించుకోవాలని వైఆర్ఎఫ్ తారక్ ని ఓ పావులా వినియోగించుకుంటుందని తెరపైకి వస్తుంది. ఇంతకాలం సైలెంట్ గా ఉన్న ఈ సంస్థ ఇప్పుడు తెలుగు హీరోని తెరపైకి తెచ్చిందంటే గేమ్ ప్లాన్ అర్థం కాలేదా అంటూ గుసగుసలు వస్తున్నాయి.
Biryani |బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులకి కన్నుల పండుగే. కానీ, తాజాగా హైదరాబాద్ ముషీరాబాద్లో ఓ రెస్టారెంట్లో చోటుచేసుకున్న…
Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ…
UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్…
Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…
Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…
Cholesterol | శరీరంలో LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయులు పెరగడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన…
I Phone 17 | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ తన లేటెస్ట్ ఐఫోన్ మోడల్ ఐఫోన్ 17ను తాజాగా…
Dizziness causes symptoms | చాలా మందికి ఆకస్మాత్తుగా తలతిరిగిన అనుభవం వస్తుంది. లేచి నిలబడినప్పుడు, నడుస్తున్నప్పుడు లేదా తల తిప్పిన…
This website uses cookies.