JR NTR Evaru Meelo Koteeswarudu Promo
JR NTR : యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు బుల్లితెర కొత్తేమీ కాదు. బిగ్ బాస్ షో మొదటి సీజన్‌తో అందరినీ ఓ ఆట ఆడుకున్నాడు. అయితే బిగ్ బాస్ మొదటి సీజన్ గ్రాండ్‌గా సక్సెస్ అయింది. కానీ ఎన్టీఆర్ మాత్రం హోస్ట్‌గా తప్పుకున్నాడు. అప్పటి నుంచి నాని, నాగార్జునలతో బిగ్ బాస్ షోను ముందుకు నడుపుతున్నారు. అలా బుల్లితెరకు ఎన్టీఆర్ దూరమయ్యాడు. అయితే మళ్లీ ఇన్నాళ్లకు బుల్లితెరపై ఎన్టీఆర్ కనిపించబోతోన్నాడు.
ఎవరు మీలో కోటీశ్వరుడు అనే షోను హోస్ట్ చేయబోతోన్నాడు. ఇది వరకు ఈ షోను నాగార్జున, చిరంజీవిలు నడిపించారు. నాగార్జున సక్సెస్ ఫుల్‌గా కార్యక్రమాన్ని నడిపించాడు. కానీ చిరంజీవి మాత్రం కాస్త తడబడ్డాడు. చిరు హోస్ట్ చేసిన రెండో సీజన్ ఈ షోను స్టార్ మా మొత్తానికే ఎత్తేసింది.అయితే ఇప్పుడు మళ్లీ ఈ షో రాబోతోంది. కానీ అది స్టార్ మాలో కాదు. జెమినీ టీవీలో ఈ షో పెద్ద ఎత్తున రాబోతోంది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.
JR NTR Evaru Meelo Koteeswarudu Promo
ఆట నాది కోటి మీది.. కల మీద కథ మీది అంటూ త్రివిక్రమ్ రాసిన పంచ్ డైలాగ్స్, స్క్రిప్ట్‌తో అదిరిపోయే ప్రోమోను తీసుకొచ్చారు. ఇందులో ఎన్టీఆర్ లుక్, ఆ ప్రోమో అన్నింట్లోనూ త్రివిక్రమ్ హ్యాండ్ ఉంది. మొత్తానికి ఈ షోను పెద్ద ఎత్తున ప్లాన్ చేసేశారు. ఇక బుల్లితెరపై మళ్లీ ఎన్టీఆర్ తన సత్తాను చాటేందుకు రెడీ అవుతున్నాడు. త్వరలోనే ఈ షో బుల్లితెరపైకి రాబోతోంది. ఈ మేరకు మీడియాతో ఎన్టీఆర్ ఇంటరాక్ట్ అయ్యాడు.
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…
Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు…
This website uses cookies.