JR NTR : ఆట నాది కోటి మీది.. అదరగొట్టేసిన ఎన్టీఆర్! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

JR NTR : ఆట నాది కోటి మీది.. అదరగొట్టేసిన ఎన్టీఆర్!

 Authored By bkalyan | The Telugu News | Updated on :13 March 2021,1:15 pm

JR NTR : యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు బుల్లితెర కొత్తేమీ కాదు. బిగ్ బాస్ షో మొదటి సీజన్‌తో అందరినీ ఓ ఆట ఆడుకున్నాడు. అయితే బిగ్ బాస్ మొదటి సీజన్ గ్రాండ్‌గా సక్సెస్ అయింది. కానీ ఎన్టీఆర్ మాత్రం హోస్ట్‌గా తప్పుకున్నాడు. అప్పటి నుంచి నాని, నాగార్జునలతో బిగ్ బాస్ షోను ముందుకు నడుపుతున్నారు. అలా బుల్లితెరకు ఎన్టీఆర్ దూరమయ్యాడు. అయితే మళ్లీ ఇన్నాళ్లకు బుల్లితెరపై ఎన్టీఆర్ కనిపించబోతోన్నాడు.

ఎవరు మీలో కోటీశ్వరుడు అనే షోను హోస్ట్ చేయబోతోన్నాడు. ఇది వరకు ఈ షోను నాగార్జున, చిరంజీవిలు నడిపించారు. నాగార్జున సక్సెస్ ఫుల్‌గా కార్యక్రమాన్ని నడిపించాడు. కానీ చిరంజీవి మాత్రం కాస్త తడబడ్డాడు. చిరు హోస్ట్ చేసిన రెండో సీజన్ ఈ షోను స్టార్ మా మొత్తానికే ఎత్తేసింది.అయితే ఇప్పుడు మళ్లీ ఈ షో రాబోతోంది. కానీ అది స్టార్ మాలో కాదు. జెమినీ టీవీలో ఈ షో పెద్ద ఎత్తున రాబోతోంది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.

JR NTR Evaru Meelo Koteeswarudu Promo

JR NTR Evaru Meelo Koteeswarudu Promo

JR NTR : ఆట నాది కోటి మీది.. అదరగొట్టేసిన ఎన్టీఆర్!

ఆట నాది కోటి మీది.. కల మీద కథ మీది అంటూ త్రివిక్రమ్ రాసిన పంచ్ డైలాగ్స్, స్క్రిప్ట్‌తో అదిరిపోయే ప్రోమోను తీసుకొచ్చారు. ఇందులో ఎన్టీఆర్ లుక్, ఆ ప్రోమో అన్నింట్లోనూ త్రివిక్రమ్ హ్యాండ్ ఉంది. మొత్తానికి ఈ షోను పెద్ద ఎత్తున ప్లాన్ చేసేశారు. ఇక బుల్లితెరపై మళ్లీ ఎన్టీఆర్ తన సత్తాను చాటేందుకు రెడీ అవుతున్నాడు. త్వరలోనే ఈ షో బుల్లితెరపైకి రాబోతోంది. ఈ మేరకు మీడియాతో ఎన్టీఆర్ ఇంటరాక్ట్ అయ్యాడు.

YouTube video

Advertisement
WhatsApp Group Join Now

bkalyan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది