
JR NTR fan suicide attempt
JR NTR : ప్రస్తుతం అంతటా ఆర్ఆర్ఆర్ చర్చ నడుస్తుంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. మరో మూడ్రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.. ఆర్ఆర్ఆర్ చిత్రం విడుదల నేపథ్యంలో థియేటర్ల వద్ద జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ అభిమానుల సందడి కనిపిస్తోంది. థియేటర్ల ముందు భారీ ఎత్తున పోస్టర్లు ఏర్పాట్లు చేసే పనుల్లో అభిమానులంతా బిజీ బిజీగా ఉన్నారు.థియేటర్ల ముందు భారీ ఎత్తున పోస్టర్లు ఏర్పాట్లు చేసే పనుల్లో తారక్, చరణ్ అభిమానులంతా బిజీ బిజీగా ఉన్నారు. అయితే అక్కడక్కడా చిన్న చిన్న వివాదాలు చోటు చేసుకుంటున్నాయి.
కోదాడలోని శ్రీనివాస థియేటర్ ఎదుట ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల వివాదం ఓ యువకుడి ఆత్మహత్యాయత్నానికి దారితీసింది.. థియేటర్ ఎదుట ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే సందర్భంలో ఎన్టీఆర్ అభిమానుల మధ్య ఘర్షణ నెలకొంది. తమ ఫ్లెక్సీ ముందు కనిపించాలంటూ అభిమానులు గొడవకు దిగారు. ఈ క్రమంలో పట్టణానికి చెందిన ఎన్టీఆర్ అభిమాని మైకు సైదులు రోడ్డుపై బైఠాయించి ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. సహచర అభిమానులు అతడి ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. స్థానికుల సమాచారంతో పోలీసులు థియేటర్ వద్దకు చేరుకొని ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఘర్షణకి దిగిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
JR NTR fan suicide attempt
ఇదిలా ఉంటే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కారు అద్దాలకు ఉన్న బ్లాక్ ఫిలింను జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు తొలగించారు. హైదరాబాద్‌లో బ్లాక్ ఫిలింతో ప్రయాణిస్తున్న వాహనాలపై ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆదివారం జూబ్లీహిల్స్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ముత్తు ఆధర్వంలో జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వద్ద నిర్వహించిన తనిఖీల్లో పలు వాహనాలను గుర్తించి నలుపు తెరలు ఉన్నవాటిని తొలగించారు. ఇందులో భాగంగా. జూనియర్ ఎన్టీఆర్ వాహనాన్ని తనిఖీ చేసి అనంతరం అద్దాలకు ఉన్న బ్లాక్ ఫిలింను తొలగించారు. తనిఖీలు జరుగుతున్న సమయంలో కారులో డ్రైవర్‌తోపాటు.. ఎన్టీఆర్ తనయుడు.. మరో వ్యక్తి కూడా ఉన్నట్లు సమాచరం.
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
This website uses cookies.