NagaBabu : మెగా ఫ్యామిలీ వేడుకలకి సంబంధించిన వార్త ఏదైన బయటకు వచ్చిందంటే అది కొద్ది క్షణాలలో వైరల్ అవుతుంది. ఆ మధ్య నిహారిక పెళ్లి వేడుక చాలా రోజులు వార్తలలో నిలిచింది. ఇక ఇప్పుడు వరుణ్ తేజ్ పెళ్లికి సంబంధించి అనేక వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. నిహారిక మ్యారేజ్ తర్వాత నాగబాబు తన తనయుడు వరుణ్ తేజ్ పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యాడు. ఈ క్రమంలో పెళ్లి కూతురును వెతికే పనిలో పడ్డాడు. మరోవైపు నాగబాబు తెలుగు బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన రాజమౌళి, ప్రభాస్ ‘ఛత్రపతి’ హిందీ రీమేక్‌లో విలన్‌గా యాక్ట్ చేయడానికి ఓకే చెప్పినట్టు సమాచారం.
ఈ సినిమాను బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా హిందీలో వివి వినాయక్ ఈ సినిమాతో దర్శకుడిగా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు.తాజాగా నాగబాబు ఆయన ఫ్యాన్స్‌తో చిట్‌చాట్ నిర్వహించగా ఓ నెటిజన్ వరుణ్‌తేజ్ పెళ్లెప్పుడు? సార్ అని అడిగాడు. ఇప్పటికే ఎన్నోసార్లు ఈ ప్రశ్న వింటూ ఉన్న నాగబాబు ఈ క్వశ్చన్‌కు వరుణ్ తేజే ఆన్సరిస్తాడని బదులిచ్చాడు. ఇక గతంలోనూ వరుణ్ తేజ్ మ్యారేజ్ ఎప్పుడు చేస్తారు అని ఓ నెటిజన్ ప్రశ్నించగా మంచి సంబంధాలు ఉంటే చూడమని అన్నాడు నాగబాబు. మరోసారి వరుణ్ ప్రేమ వివాహం చేసుకున్నా తనకెలాంటి అభ్యంతరం లేదని చెప్పేశాడు. ఇదిలా ఉంటే వరుణ్ ఓ హీరోయిన్‌ను పెళ్లాడబోతుందంటూ పుకార్లు వినిపించగా అవి ఊహాగానాలుగానే మిగిలిపోయాయి.
ఆ మధ్య ఓ నెటిజన్.. వరుణ్ తేజ్‌కు హీరోయిన్ సాయి పల్లవితో మ్యారేజ్ చేస్తే బాగుంటుందని సూచించాడు. నెటిజన్ అలా చెప్పడంతో నాగబాబు నిర్ఘాంత పోయాడు. ఏం చేయాలో తెలియని నాగబాబు… జాతి రత్నాలు సినిమాలో బ్రహ్మానందం జడ్జి స్థానంలో కూర్చున్న ఫోటోను ఎమోజీగా పెట్టారు. మీకు మీరే తీర్పు చెప్పుకోండి నేను జడ్జి ప్లేస్ నుంచి వెళ్లిపోతానంటూ ఎక్స్‌ప్రెషన్ వచ్చే ఫోటో పెట్టాడు. మొత్తంగా నాగబాబు.. వరుణ్ తేజ్‌కు త్వరలోనే పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యాడు. ఇక వరుణ్ తేజ్ విషయానికొస్తే.. ఈ ఇయర్ ‘గని’ మూవీతో పాటు ‘ఎఫ్ 3’ మూవీలతో పలకరించనున్నాడు. ఈ రెండు సినిమాలపై భారీ అంచనాలు పెట్టుకున్నాడు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.