JR NTR : పెట్రోల్ పోసుకొని ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసుకోబోయిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

JR NTR : పెట్రోల్ పోసుకొని ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసుకోబోయిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్

JR NTR : ప్ర‌స్తుతం అంత‌టా ఆర్ఆర్ఆర్ చ‌ర్చ న‌డుస్తుంది. రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ కాంబినేష‌న్‌లో రాజ‌మౌళి తెర‌కెక్కించిన ఈ సినిమాపై అంచ‌నాలు భారీగా ఉన్నాయి. మరో మూడ్రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.. ఆర్ఆర్ఆర్ చిత్రం విడుదల నేపథ్యంలో థియేటర్ల వద్ద జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ అభిమానుల సందడి కనిపిస్తోంది. థియేటర్ల ముందు భారీ ఎత్తున పోస్టర్లు ఏర్పాట్లు చేసే పనుల్లో అభిమానులంతా బిజీ బిజీగా ఉన్నారు.థియేటర్ల ముందు భారీ ఎత్తున […]

 Authored By sandeep | The Telugu News | Updated on :22 March 2022,3:30 pm

JR NTR : ప్ర‌స్తుతం అంత‌టా ఆర్ఆర్ఆర్ చ‌ర్చ న‌డుస్తుంది. రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ కాంబినేష‌న్‌లో రాజ‌మౌళి తెర‌కెక్కించిన ఈ సినిమాపై అంచ‌నాలు భారీగా ఉన్నాయి. మరో మూడ్రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.. ఆర్ఆర్ఆర్ చిత్రం విడుదల నేపథ్యంలో థియేటర్ల వద్ద జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ అభిమానుల సందడి కనిపిస్తోంది. థియేటర్ల ముందు భారీ ఎత్తున పోస్టర్లు ఏర్పాట్లు చేసే పనుల్లో అభిమానులంతా బిజీ బిజీగా ఉన్నారు.థియేటర్ల ముందు భారీ ఎత్తున పోస్టర్లు ఏర్పాట్లు చేసే పనుల్లో తారక్, చరణ్ అభిమానులంతా బిజీ బిజీగా ఉన్నారు. అయితే అక్కడక్కడా చిన్న చిన్న వివాదాలు చోటు చేసుకుంటున్నాయి.

కోదాడలోని శ్రీనివాస థియేటర్‌ ఎదుట ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల వివాదం ఓ యువకుడి ఆత్మహత్యాయత్నానికి దారితీసింది.. థియేటర్‌ ఎదుట ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే సందర్భంలో ఎన్టీఆర్‌ అభిమానుల మధ్య ఘర్షణ నెలకొంది. తమ ఫ్లెక్సీ ముందు కనిపించాలంటూ అభిమానులు గొడవకు దిగారు. ఈ క్రమంలో పట్టణానికి చెందిన ఎన్టీఆర్‌ అభిమాని మైకు సైదులు రోడ్డుపై బైఠాయించి ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. స‌హచర అభిమానులు అతడి ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. స్థానికుల సమాచారంతో పోలీసులు థియేటర్‌ వద్దకు చేరుకొని ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఘ‌ర్ష‌ణ‌కి దిగిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

JR NTR fan suicide attempt

JR NTR fan suicide attempt

JR NTR : అభిమాని ఆత్మహ‌త్య..

ఇదిలా ఉంటే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కారు అద్దాలకు ఉన్న బ్లాక్ ఫిలింను జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు తొలగించారు. హైదరాబాద్‏లో బ్లాక్ ఫిలింతో ప్రయాణిస్తున్న వాహనాలపై ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆదివారం జూబ్లీహిల్స్ ట్రాఫిక్ ఇన్‏స్పెక్టర్ ముత్తు ఆధర్వంలో జూబ్లీహిల్స్ చెక్‏పోస్ట్ వద్ద నిర్వహించిన తనిఖీల్లో పలు వాహనాలను గుర్తించి నలుపు తెరలు ఉన్నవాటిని తొలగించారు. ఇందులో భాగంగా. జూనియర్ ఎన్టీఆర్ వాహనాన్ని తనిఖీ చేసి అనంతరం అద్దాలకు ఉన్న బ్లాక్ ఫిలింను తొలగించారు. తనిఖీలు జరుగుతున్న సమయంలో కారులో డ్రైవర్‏తోపాటు.. ఎన్టీఆర్ తనయుడు.. మరో వ్యక్తి కూడా ఉన్నట్లు సమాచరం.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది