Home » Entertainment » Jr Ntr Fire On Alia Bhatt
Entertainment

Jr NTR : జూనియర్ ఎన్టీఆర్ మైకుని కాలితో త‌న్నిన అలియా భ‌ట్.. అంత పొగ‌రా ?

Authored By
Sam C
The Telugu News | Published on: March 21, 2022, 5:30 pm
Advertisement

Jr NTR : ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్‌, అలియా భ‌ట్, అజ‌య్ దేవ‌గ‌ణ్‌, శ్రియ ప్రధాన పాత్ర‌ల‌లో రాజ‌మౌళి తెర‌కెక్కించిన చిత్రం ఆర్ఆర్ఆర్. భారీ బ‌డ్జెట్‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందిన ఈ సినిమా మార్చి 25న విడుద‌ల కానుండ‌గా, ప్ర‌స్తుతం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. తెలుగు, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, త‌మిళ భాష‌ల్లో ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ ఎత్తున సినిమా విడుద‌ల‌కు స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. ఇటు మెగా ఫ్యాన్స్‌, అటు నందమూరి ఫ్యాన్స్ సినిమా రిలీజ్ కోసం ఎంతో ఎగ్జ‌యిట్‌మెంట్‌తో ఎదురు చూస్తున్నారు. ఇండియాలో ప్ర‌ధాన న‌గరాల్లో ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ ప్ర‌మోష‌న్స్‌ను చేస్తూ వ‌స్తుంది.

Advertisement

ఆదివారం రోజు ఢిల్లీలో ఈవెంట్ జ‌ర‌గగా, టీమ్‌తో బాలీవుడ్ మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ష‌నిస్ట్ ఆమిర్ ఖాన్ జాయిన్ అయ్యారు. ఆమిర్ ఖాన్ ముఖ్య అతిథిగా పాల్గొని సంద‌డి చేయ‌డంతో ప్రోగ్రామ్ మ‌రింత ఎన‌ర్జిటిక్‌గా మారింది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే.. ఈ ఢిల్లీ ప్రెస్ మీట్‌లో ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ క‌లిసి ఆమిర్ ఖాన్‌కు నాటు నాటు డాన్స్ స్టెప్పును నేర్పించారు. ఆయ‌న కూడా నేర్చుకుని ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌, ఆలియాల‌తో క‌లిసి ఆయ‌న నాటు నాటు స్టెప్పు వేయ‌డం అంద‌రినీ ఆక‌ర్షిస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది.అయితే నాటు నాటు సాంగ్‌కి స్టెప్స్ వేసే ముందు ఎన్టీఆర్ త‌న చేతిలోని మైక్‌ని కింద పెట్ట‌గా, దానిని త‌న కాలుతో త‌న్నింది అలియా భ‌ట్.

Jr NTR fire on alia bhatt

Advertisement

Jr NTR : అలియాపై ఎటాక్..

ఈ సంఘ‌ట‌న ప్ర‌తి ఒక్క‌రికి షాకింగ్‌గా మారింది. మ‌రీ ఇంత పొగ‌రా అంటూ విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో టాలీవుడ్‌కి చెందిన ఇద్ద‌రు అగ్ర క‌థానాయ‌కులు అది కూడా మెగా, నంద‌మూరి క‌థానాయ‌కులు కావ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఇందులో ఎన్టీఆర్ గోండు వీరుడు కొమురం భీమ్‌గా.. మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజుగా రామ్‌చ‌ర‌ణ్ న‌టించారు. ఇంకా అజ‌య్ దేవ‌గ‌ణ్‌, ఆలియా భ‌ట్‌, స‌ముద్ర ఖ‌ని, శ్రియా శ‌ర‌న్‌, ఒలివియా మోరిస్‌, రే స్టీవెన్ స‌న్‌, అలిసన్ డూడి త‌దిత‌రులు న‌టించారు. చ‌రిత్రలో క‌లుసుకోని ఇద్ద‌రుయోధులు క‌లుసుకుని బ్రిటీష్ వారిపై తిర‌గ‌బ‌డితే ఎలా ఉంటుంద‌నే ఫిక్ష‌న‌ల్ పాయింట్‌తో ఈ సినిమాను తెర‌కెక్కించారు జక్క‌న్న‌.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి