
Production company Yuvasudha trolls them in the case of NTR30
Jr NTR : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫ్యాన్స్ మితిమీరిన అభిమానం ఒక్కోసారి స్టార్స్ హీరోలకు తలనొప్పిగా మారుతుంటుంది. ముఖ్యంగా పలువురు స్టార్ హీరోల ఫ్యాన్స్ మధ్య జరిగే గొడవలు చాలా సార్లు ఆ హీరోలు ఇబ్బంది పెట్టాయి. వీటితో పాటు ఆడియో రిలీజ్ ఫంక్షన్లలతో పాటు ఇతర సినిమా ప్రమోషన్ ఇవెంట్లలో తమ అభిమాన హీరోని చూసి .. అభిమానులు చేసే అల్లరి అంత ఇంతా ఉండదు. అయితే అది మితి మీరితేనే అసలు సమస్య. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఇదే సమస్య ఎదురైంది. అయితే అది ముంబై లో. రాష్ట్రం కానీ రాష్ట్రంలో ఫాన్స్ తనను ఇరిటేట్ చేసిన తీరుకు తారక్ వారిపై ఫైర్ అయ్యారు.ఇప్పుడు ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.
రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ కి దగ్గర పడటంతో.. చిత్ర బృందం ప్రమోషన్స్ లో వేగం పెంచింది. ఇందులో భాగంగా ముంబై లోని ఓ ఆడిటోరియంలో పరిమిత సంఖ్యలోని అభిమానుల సమక్షంలో ప్రోగ్రాం నిర్వహించింది. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ముఖ్య అతిథిగా హాజరైన ఈ వేడుకకు.. ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్, అటు రామ్ చరణ్ ఫ్యాన్స్ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక నుంచి బస్సులో ముంబైకి వెళ్లి అక్కడి ఫంక్షన్ లో రచ్చ రచ్చ చేశారు.కొందరయితే బారికేడ్లను దాటి లోపలికి రావడానికి ప్రయత్నించారు.ఫాన్స్ తీరుతో విసిగిపోయిన ఎన్టీఆర్ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని వారిస్తూనే..
Jr NTR fires on his audience on pre release evnt of rrr in mumbai
దయచేసి వెనక్కి వెళ్లాలని వారిని అభ్యర్థించారు. ఇదేం పద్ధతిగా లేదంటూ.. అందరూ కిందకు దిగుతారా లేదా? కిందకు దిగండి.. రాష్ట్రం కానీ రాష్ట్రం వచ్చాం. అందరూ మన గురించి మంచిగా మాట్లాడుకోవాలి. అందరూ పద్ధతిగా కిందకు దిగండి అని రిక్వెస్ట్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.డివివి దానయ్య ఈ పాన్ ఇండియా చిత్రంపై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. కొమురం భీమ్‌గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటించిన ఈ సినిమాలో అజయ్ దేవగణ్, ఆలియా భట్, శ్రియా శరన్, సముద్రఖని తదితరులు నటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 7 న ఈ సినిమా రిలీజ్ కానుంది.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.