Jr Ntr : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎలాంటి వివాదాల జోలికి వెళ్లకుండా తన పని తాను చేసుకుంటూ వెళతాడు. ఆయనని ఎవరు ఎన్ని రకాలుగా విమర్శలు చేసిన వాటిపై ఎన్టీఆర్ పెద్దగా స్పందించరు. అయితే తాజాగా ఎన్టీఆర్ గురించి ఓ స్టార్ రైటర్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. కోన వెంకట్ తన రైటింగ్స్ తో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో భాగం అయ్యారు. ఈక్రమంలోనే ఎన్టీఆర్ సినిమాలకు వర్క్ చేశారు. వారి కాంబినేషన్‌లో వచ్చిన సాంబ, అదుర్స్, బాద్‌షా, జై లవకుశ సినిమాలు రాగా, అందులో అదుర్స్ బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలుస్తే.. బాద్‌షా, జై లవకుశ జస్ట్ హిట్స్‌గా, సాంబ యావరేజ్ గా నిలిచింది. అదుర్స్ సినిమా ఓ క్లాసిక్‍గా నిలిచిపోయింది.
2010లో వచ్చిన అదుర్స్ చిత్రానికి వీవీ వినాయక్ దర్శకత్వం వహించారు. అదుర్స్ సినిమాలో ఎన్టీఆర్ డ్యుయల్ రోల్ చేయగా, ఓ పాత్రలో ‘చారి’ గా కనిపించి సందడి చేశారు. చారి క్యారెక్టర్ ఐకానిక్‍గా నిలిచిపోయింది. ఆ పాత్రలో ఆయన పండించిన కామెడీ, మేనరిజమ్స్ ఎవ్వరు అంత ఈజీగా మరచిపోతారు. బ్నహ్మానందంతో గురువు గారు గురువు గారు అంటూ ఎన్టీఆర్ పండించిన కామెడీ ప్రధాన హైలైట్‌గా నిలిచింది. అయితే ఈ సినిమాకి సీక్వెల్ వస్తే బాగుంటుంది అని అభిమానులు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నారు. అయితే దీని గురించి తాజాగా కోన వెంకట్‌కి ప్రశ్న ఎదురైంది. అంజలి ప్రధాన పాత్ర పోషించిన హారర్ కామెడీ మూవీ ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ సినిమా ట్రైలర్ లాంచ్ లో మీడియా వారు అదుర్స్ 2 గురించి అడిగారు.
దానికి కోన వెంకట్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. అదుర్స్ 2 చేయాలని తాను గట్టిగా నిర్ణయించుకున్నానని ,ఈ చిత్రానికి ఎన్టీఆర్‌ను ఒప్పించేందుకు అవసరమైతే ఆయన ఇంటికి ముందు నిరాహార దీక్ష చేస్తానని అని చెప్పడం విశేషం. “అదుర్స్ 2 చేయాలని నేను పక్కాగా డిసైడ్ అయ్యాను. అవసరమైతే ఎన్టీఆర్ ఇంటి ముందు టెంట్ వేసి.. పిలక పెట్టుకొని నేను నిరాహార దీక్ష చేసైనా సరే.. అతడితో అదుర్స్ 2 చేయిస్తా అంటూ కోన వెంకట్ చెప్పడంతో అదుర్స్ 2 సెట్స్ పైకి వెళ్లడం ఖాయం అని ఫ్యాన్స్ భావిస్తున్నారు.అదుర్స్ చిత్రంలో చారి పాత్రను ఎన్టీఆర్ తప్ప దేశంలో మరెవరూ చేయలేరని కోన వెంకట్ అన్నారు
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.