Chiranjeevi : నాగబాబు చేసిన చెత్త పని.. కోపంతో పిచ్చి కొట్టుడు కొట్టిన చిరంజీవి
Chiranjeevi : టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ఆ ఫ్యామిలీ పెద్దగా వివాదాలలోకి వెళ్లదు. ముఖ్యంగా చిరంజీవిని ఆదర్శంగా తీసుకొని ఆ ఫ్యామిలీ హీరోలు అందరు ఆయన అడుగుజాడలలో నడుస్తున్నారు.అయితే మెగా బ్రదర్స్ అయిన చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ ఎంత అన్యోన్యంగా ఉంటారనేది మనం చూస్తూనే ఉన్నాం. ఈ ముగ్గురి మధ్య ఎన్ని అభిప్రాయం బేధాలు ఉన్నప్పటికీ.. అన్నదమ్ముల అనుబంధం మాత్రం ఏనాడు చెక్కు చెదరలేదు. వారు ఎప్పుడు అలానే అంతత అన్యోన్యంగా ఉండాలని అభిమానులు కోరుకుంటూ ఉంటారు. వీరు గొడవపడిన సంఘటనలు కాని, కొట్టుకున్న సందర్భం కాని ఎప్పుడు జరగలేదు. అందుకు సంబంధించి ఎలాంటి వార్తలు కూడా బయటకి రాలేదు.
అయితే ఇప్పుడు నెట్టింట ఓ వార్త బాగా వైరల్ అవుతుంది. చిరంజీవికి ఒకసారి నాగబాబు పై బాగా కోపం వచ్చి గట్టిగా కొట్టేశారట. ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవే తెలియజేయడంతో ఇప్పుడు ఈ వార్త వైరల్‌గా మారింది. చిరంజీవి సినిమాల్లోకి రాకముందు, ఇంటర్ చదువుతున్న సమయంలో నాగబాబు ఆరో, ఏడో తరగతి చదువుతున్నారట. ఆ సమయంలో ఇంటిలోని చిన్న చిన్న పనులు అన్ని చిరునే చేస్తూ వచ్చేవారట. అయితే ఒకరోజు ఒకే సమయంలో రెండు పనులు ఆయనే చేయాల్సి వచ్చిందట. జు లాండ్రి నుంచి బట్టలు తీసుకురావడంతో పాటు నేను అదే సమయంలో మరో చోటుకు పనిమీద వెళ్లాల్సి వచ్చిందట. అప్పుడు నాగబాబుకి లాండ్రి నుంచి బట్టలు తీసుకురమ్మని చెప్పారట చిరంజీవి. అయితే తాను పని చూసుకొని ఇంటికి వచ్చాక నాగబాబుని లాండ్రీ నుంచి బట్టలు తీసుకొచ్చవా అని అడిగాను. అప్పుడు తాను తీసుకురాలేదు అని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు.
ఎందుకు తేలేదు అని కాస్త గట్టిగా అడిగిసరికీ నిద్ర పోతున్నా అని పెడసరిగా చెప్పాడు. దీంతో నాకు విపరీతమైన కోపం వచ్చి చావ చితక బాదేశాను అని చిరంజీవి అన్నారు. అయితే అది చూసి నాపై మరింత కోపం తెచ్చుకున్న మా అమ్మ చిన్నోడిని కొడతావా అంటూ నన్ను బాగా తిట్టేసింది . ఆ రోజు ఈవెనింగ్ నాన్న రావడంతో ఏడూస్తూ మొత్తం విషయాన్ని చెప్పేశాను. అపుడు నాగబాబుకు క్లాస్ తీసుకున్నాడు. అపుడు కానీ నా కోపం చల్లారలేదు అంటూ ఆ నాటి ఆసక్తికర సంగతులు చెప్పుకొచ్చాడు చిరంజీవి.
Sugar Patients : మధుమేహం వ్యాధి దీర్ఘకాలిక వ్యాధి. అదే ఒకసారి వచ్చినట్లయితే జీవితాంతం వరకు ఉంటుంది. జీవితాంతం చాలా…
Business : ప్రస్తుత కాలంలో బిజినెస్ అనేది బెస్ట్ ఆప్షన్ గా చాలామంది భావిస్తున్నారు. చేతిలో కొంత డబ్బు ఉంటె…
Beetroot Leaves : ఆకు కూరలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ ఆకు కూరల్లో కొవ్వు తక్కువగా ఉంటుంది. ప్రోటీన్లు,విటమిన్లు,…
Vijayasai Reddy : వైసీపీలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే పార్టీకి, రాజకీయాలకు గుడ్‌బై చెబుతూ రాజీనామా చేసిన…
Black Coffee : ప్రతి ఒక్కరికి ఉదయాన్నే ఒక కప్పు కాఫీ తాగందే ఆ రోజు గడవదు. కాఫీ లో…
Shani Vakri 2025 : శాస్త్రం ప్రకారం నవగ్రహాలలో శని దేవుడుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. శని దేవుడు కర్మ…
Thammudu Movie Review : తెలుగులో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత…
Dil Raju : ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించన తమ్ముడు జూలై 4న విడుదల కానుంది. ఈ మూవీ…
This website uses cookies.