Jr NTR : త‌న మొబైల్‌లో ఎప్పుడు ప్లే అయ్యే పాట ఏంటో చెప్పిన ఆశ్చ‌ర్య‌ప‌రిచిన జూనియర్ ఎన్టీఆర్

Authored By Sam C | The Telugu News | Published on: March 25, 2022, 1:30 pm

Jr NTR : యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా ప్ర‌మోష‌న్స్‌తో చాలా బిజీగా ఉన్నారు. వివిధ ప్రాంతాల‌కు త‌న టీంతో వెళుతున్న ఎన్టీఆర్ అక్క‌డి భాష‌లో మాట్లాడి సినిమాపై ఆస‌క్తిని పెంచుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ తన మాటలతో ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా రాజమౌళి కి సంబంధించిన అనేక రకాల విషయాలను కూడా ఇంటర్వ్యూలో సరదాగా షేర్ చేసుకుంటున్నారు. ఇక రామ్ చరణ్ తో ఉన్న అనుబంధం గురించి కూడా తారక్ చాలా విషయాలు చెబుతున్నడు. ఒక విధంగా మెగా అభిమానులతో పాటు అన్ని వర్గాల అభిమానులకు జూనియర్ ఎన్టీఆర్ చాలా బాగా దగ్గరవుతున్నాడు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనకు ఇష్టమైన పాట ఏది అని యాంకర్ ప్రశ్నించగా.. ‘కేరాఫ్‌ కంచరపాలెం’ చిత్రంలోని ఆశ పాశం.. పాట’ అని చెప్పారు. ఫోన్‌లో ఈ పాట ఎక్కువగా ప్లే చేస్తూ ఉంటానని అన్నారు తారక్. అంతే కాదు ఆ పాట పాడి వినిపించాడు తారక్. ఎన్టీఆర్ తన సినిమాలోని పాట పాడటంతో ‘కేరాఫ్‌ కంచరపాలెం’ దర్శకుడు వెంకటేష్ మహ సంతోషం వ్యక్తం చేశారు. ‘మీ ఫోన్‌ ప్లేలిస్ట్‌లో ఆశ పాశం.. సాంగ్‌ ఉండటం సంతోషంగా ఉంది. ధన్యవాదాలు తారక్‌ గారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో భారీ విజయాన్ని అందుకోవాలి’ అంటూ ట్వీట్‌ చేశాడు వెంకటేష్. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Jr NTR likes the small movie song

Jr NTR likes the small movie song

Jr NTR : ఆ పాట‌పై మ‌క్కువ ఎక్కువ‌..

దేశవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి రెడీ అయ్యింది ఆర్ఆర్ఆర్ . రేపు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దాదాపు మూడేళ్ళ పాటు ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎదురుచూశారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న సినిమా కావడంతో ఇద్దరు హీరోల ఫ్యాన్స్ తెగ సందడి చేస్తున్నారు. ఇక పాన్ ఇండియా మూవీ కావడంతో జక్కన కూడా ప్రమోషన్స్ విషయంలో ఏమాత్రం తగ్గకుండా దేశం మొత్తం చుట్టేస్తున్నాడు. వీలైనన్ని ఇంటర్వ్యూలతో హంగామా చేస్తున్నారు చిత్రయూనిట్. ఎన్టీఆర్ కొమురం భీమ్ గా రామ్ చరణ్ అల్లూరిసీతారామరాజుగా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ భామ అలియా భట్ సీత పాత్రలో కనిపించనుంది.

Sam C

No bio available for this author.

  1. "Grand Electronics Sale : టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.20 వేలపైగా భారీ డిస్కౌంట్లు..!"

  2. "Ysrcp Plan : పోరులో వైసీపీ అసలైన బలం అదేనా? గ్రౌండ్ లెవెల్ కేడర్‌పై జగన్ భారీ నమ్మకం..!"

  3. "Messi vs Ronaldo : మెస్సీయా.. రొనాల్డోనా? ఫుట్‌బాల్ ఆల్‌టైమ్ ‘గోట్’ ఎవరో తేల్చేసిన ఆ లెక్కలు..!"

  4. "Jailer 2 : తలైవా రజినీకాంత్.. ‘జైలర్ 2’ ప్రమోషన్లతో బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపనున్నారా..?"

  5. "Ys Jagan : స్థానిక ఎన్నికల్లో గెలుపే టార్గెట్.. అభ్యర్థుల ఎంపికపై రీజనల్ ఇన్‌ఛార్జ్‌లతో వైఎస్ జగన్ మైండ్ గేమ్!"

  6. "Pawan kalyan : అరెస్ట్‌పై పవన్ కల్యాణ్ కామెంట్స్.. తమ్ముళ్ల ఆగ్రహంతో కూటమిలో సరికొత్త దుమారం?"

  7. "Nandamuri Tejaswini : మేయర్ రేసులో నందమూరి బాలకృష్ణ కుమార్తె? తెరపైకి తేజస్విని పేరుతో పొలిటికల్ హీట్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp