JR NTR : ఎగ్జామ్ పేప‌ర్‌లో జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్ర‌శ్న ప్ర‌త్య‌క్షం.. అంతా షాక్

Authored By Sam C | The Telugu News | Published on: May 11, 2022, 7:30 pm

JR NTR  : మార్చి 25న విడుద‌లై బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పెద్ద విజ‌యం సాధించిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. భారీ బడ్జెట్‌తో వచ్చిన ఈ సినిమాను దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. డీవీవీ దానయ్య నిర్మించారు. ఎమ్ఎమ్ కీరవాణి ఈ సినిమాకు సంగీతాన్ని అందించిన ఈ మూవీలో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా చేశారు. 1920 దశకం నాటి కథతో వచ్చిన ఈ సినిమాలో చరణ్.. అల్లూరిగా, తారక్.. కొమరం భీంగా నటించారు. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందిన ఆర్ఆర్ఆర్ మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 451 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 453 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 47 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 608.17 కోట్లు వసూలు చేసింది. ఫలితంగా ఇప్పటికే రూ. 155.17 కోట్ల లాభాలను కూడా సొంతం చేసుకుని హవాను చూపించింది. ఆర్ఆర్ఆర్ చిత్రం విడుద‌లై చాలా రోజులు అవుతున్నా కూడా సినిమా హ‌వా కొన‌సాగుతూనే ఉంది. తారక్ ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమురం భీం పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.

JR ntr question appears in exam paper

JR ntr question appears in exam paper

JR NTR : ఎన్టీఆరా, మ‌జాకానా..!

అతడి నటనకు యావత్ ప్రేక్షకులు సెల్యూట్ కొట్టారు.కొమురం భీముడో పాటలో తారక్ ఎక్స్‌ప్రెషన్స్‌కు జనం ఫిదా అయ్యారు. ఇప్పుడు తారక్ చేసిన ఈ పర్ఫార్మెన్స్ అతడిని ఓ ఎగ్జామ్‌లోని క్వశ్చన్ పేపర్ ఎక్కేలా చేసింది. తెలంగాణ ఇంటర్ పరీక్షల్లో ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్‌లో ఓ ప్రశ్న అడిగారు. ‘ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమురం భీం పాత్రలో నటించిన ఎన్టీఆర్‌తో మీరు ఓ రిపోర్టర్‌గా ఇంటర్వ్యూ చేసి, ఆయన్ను ప్రశ్నలు అడిగి.. సమాధానాలు తెలుపుతూ ఓ వ్యాసం రాయాలి’ అంటూ ఓ ప్రశ్న కనిపించింది. దీంతో ఈ క్వశ్చన్ పేపర్‌ను తారక్ అభిమానులు నెట్టింట వైరల్ చేస్తున్నారు. తార‌క్ అంటే మాములు విష‌య‌మా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Sam C

No bio available for this author.

  1. "Grand Electronics Sale : టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.20 వేలపైగా భారీ డిస్కౌంట్లు..!"

  2. "Ysrcp Plan : పోరులో వైసీపీ అసలైన బలం అదేనా? గ్రౌండ్ లెవెల్ కేడర్‌పై జగన్ భారీ నమ్మకం..!"

  3. "Messi vs Ronaldo : మెస్సీయా.. రొనాల్డోనా? ఫుట్‌బాల్ ఆల్‌టైమ్ ‘గోట్’ ఎవరో తేల్చేసిన ఆ లెక్కలు..!"

  4. "Jailer 2 : తలైవా రజినీకాంత్.. ‘జైలర్ 2’ ప్రమోషన్లతో బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపనున్నారా..?"

  5. "Ys Jagan : స్థానిక ఎన్నికల్లో గెలుపే టార్గెట్.. అభ్యర్థుల ఎంపికపై రీజనల్ ఇన్‌ఛార్జ్‌లతో వైఎస్ జగన్ మైండ్ గేమ్!"

  6. "Pawan kalyan : అరెస్ట్‌పై పవన్ కల్యాణ్ కామెంట్స్.. తమ్ముళ్ల ఆగ్రహంతో కూటమిలో సరికొత్త దుమారం?"

  7. "Nandamuri Tejaswini : మేయర్ రేసులో నందమూరి బాలకృష్ణ కుమార్తె? తెరపైకి తేజస్విని పేరుతో పొలిటికల్ హీట్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp