Mahabharata : మహాభారతంపై క్రేజీ అప్‌డేట్.. రాజమౌళి ప్రాజెక్ట్‌లో ఆ ముగ్గురు హీరోలు..!
ప్రధానాంశాలు:
Mahabharata : మహాభారతంపై క్రేజీ అప్‌డేట్.. రాజమౌళి ప్రాజెక్ట్‌లో ఆ ముగ్గురు హీరోలు..!
Mahabharata : తెలుగు సినిమా స్థాయిని Jr NTR, Ram Charan Nani పెంచిన రాజమౌళి ss rajamouli ఎప్పుడు మహాభారతం చిత్రం చేస్తాడా అని ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఆయన హైదరాబాద్‌లో నిర్వహించిన ‘హిట్-3’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన రాజమౌళి.. తన మహాభారతం ప్రాజెక్టుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Mahabharata : మహాభారతంపై క్రేజీ అప్‌డేట్.. రాజమౌళి ప్రాజెక్ట్‌లో ఆ ముగ్గురు హీరోలు..!
Mahabharata క్రేజీ అప్‌డేట్..
యాంకర్ సుమ, మహాభారతంలో నానికి ఛాన్స్ ఉందా అని ప్రశ్నించగా, రాజమౌళి స్పందిస్తూ “నానికి మంచి క్యారెక్టర్ ఉంది. మహాభారతంలో నాని తప్పకుండా ఉంటాడు” అని తెలిపారు.
ఈ క్రేజీ విషయం బయటకురావడంతో నాని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాజమౌళి బిగ్గెస్ట్ ప్రాజెక్టులో మా హీరో కూడా భాగం కావడమనేది ఖతర్నాక్ విషయమంటూ నాని ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు.
మరోవైపు రామ్ చరణ్, ఎన్టీఆర్ కూడా మహాభారతం సినిమాలో కీలక పాత్రలు పోషించనున్నారని తెలుస్తుంది. ఆరు సంవత్సరాల పాటు నాలుగు భాగాలుగా ఈ ప్రాజెక్ట్ రూపొందించాలని జక్కన్న భావిస్తున్నాడట. మరి ఈ చిత్రం ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుంది అనేది మాత్రం ఇప్పుడు చెప్పలేం.