Jr Ntr : భార్య ముందే ఆ హీరోయిన్‌తో ఎన్టీఆర్ రొమాన్స్.. ఆ తర్వాత ఏం జరిగింది అంటే..!
Jr Ntr : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్‌గా ఓ వెలుగు వెలుగుతున్నాడు.ఆర్ఆర్ఆర్‌తో మంచి క్రేజ్ అందిపుచ్చుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు దేవర అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ మూవీతో పాటుగా హృతిక్ రోషన్‌తో కలిసి వార్ 2 అనే మూవీ చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తైన తర్వాత ప్రశాంత్ నీల్తో సినిమాను ప్లాన్ చేశాడు తారక్. ఆతరువాత కూడా రెండుమూడు కథలు అలా హోల్డ్ లో పెట్టాడని తెలుస్తోంది. ఇప్పుడు దేవర సినిమా పెద్ద హిట్ అయితే ఇక ఎన్టీఆర్ రేంజ్ మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తుంది.
Jr Ntr మరీ ఇంత డేరా..
అయితే ఎన్టీఆర్ తాజా చిత్రం దేవర ఇప్పుడు థాయిలాండ్‌లో షూటింగ్ జరుపుకుంటుంది. ఇటీవల తన సతీమణిని తీసుకొని అక్కడికి వెళ్లారు. అక్కడ సినిమా షూటింగ్‌లో ఎన్టీఆర్ పాల్గొంటుండగా, జాన్వి తో రొమాన్స్ చేసే సాంగ్ లో కొన్ని షాట్స్ లో లక్ష్మీ ప్రణతి అక్కడ ఉండబోతుందట. ఇది నిజంగా ఎన్టీఆర్ కు పరిక్షా సమయమే అనుకోవాలి. భార్య ముందు హీరోయిన్ తో రొమాన్స్ చేయడం అంటే.. ఏ హీరోకి అయితన అది ఇబ్బందికర పరిస్థితే అవుతుంది మరి. ఇక ఈ విషయంలో ఫ్యాన్స్ నుంచి రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి.నువ్వు నిజంగా టైగర్ అన్నా.. భార్య ముందే ఇంత ధైర్యంగా నీ చేయగలుగుతన్నావు.. నీ టాలెంట్ కు.. వృత్తికినువ్వు ఇస్తున్న రెస్పెక్ట్ కు నువ్వు నిజంగా గ్రేట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.
ఇక ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి ప్రముఖ బిజినెస్ అయినటువంటి నార్నే శ్రీనివాస్ కుమార్తె. పెళ్లికాకముందు ప్రముఖ నటుడు బాలకృష్ణ కుమార్తె బ్రాహ్మిని పెళ్లి వేడుకలలో సందడి చేసింది. అందరు హీరోల భార్యల మాదిరిగా సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్‌గా ఉండదలు లక్ష్మీ ప్రణతి. తన ఇద్దరు పిల్లల పెంపకం చూసుకుంటూ కాలం గడుపుతుంది. లక్ష్మీ ప్రణతి పాతకాలం నాటి పిక్స్ మాత్రమే సోషల్ మీడియాలో సందడి చేస్తుంటాయి.