Junior NTR pan India movies
Jr NTR : యంగ్ టైగర్ ఎన్టీఆర్ రెమ్యూనరేషన్ ప్రస్తుతం రూ. 100 కోట్ల కు కాస్త అటు ఇటు గా ఉంటుంది అనడంలో సందేహం లేదు. టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వం లో రూపొంది గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ సినిమా తో ఏకంగా పాన్ వరల్డ్ స్టార్ గా ఎన్టీఆర్ నిలిచాడు. ఏకంగా ఆస్కార్ అవార్డుని సైతం సొంతం చేసుకుంటాడు అన్నట్లుగా అంతర్జాతీయ మీడియా సంస్థల్లో ఎన్టీఆర్ గురించి కథనాలు వచ్చాయి. కొమరం భీమ్ పాత్ర కోసం ఎన్టీఆర్ పడ్డ కష్టం అద్భుతమైనది అనడంలో సందేహం లేదు. అలాంటి ఎన్టీఆర్ కి రాబోయే రోజుల్లో
Jr NTR remuneration for his firs film and first crore
ఒక్కొక్క సినిమాకు ఏకంగా రూ. 100 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ దక్కే అవకాశాలు ఉన్నాయి .ఇలాంటి ఎన్టీఆర్ ఒకప్పుడు కోటి రూపాయల లోపు రెమ్యూనరేషన్ తీసుకున్నాడు. హీరోగా నిన్ను చూడాలని సినిమాతో ఎన్టీఆర్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. అంతకు ముందు రెండు మూడు సినిమాల్లో నటించినా కూడా ఆ రెమ్యూనరేషన్ విషయం పక్కన పెడితే నిన్ను చూడాలని సినిమాకు చాలా తక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్నాడు. వేల రూపాయలు ఆ సినిమా రెమ్యూనరేషన్ ఉండి ఉంటుంది అనేది టాక్. మొదటి సారి స్టూడెంట్ నెంబర్ 1 సినిమా కు లక్షల్లో ఎన్టీఆర్ రెమ్యూనరేషన్ తీసుకున్నాడు. ఇక సుబ్బు, ఆది సినిమాలకు కూడా ఎన్టీఆర్ రెమ్యూనరేషన్ చాలా తక్కువే.
Jr NTR remuneration for his firs film and first crore
ఆది సినిమా భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఎన్టీఆర్ స్టార్డం అమాంతం పెరిగింది. ఆ తర్వాత నటించిన అల్లరి రాముడు, నాగ సినిమాలకు కోటికి పైగా మొదటి సారి ఎన్టీఆర్ రెమ్యూనరేషన్ తీసుకున్నాడు. ఎప్పుడైతే సింహాద్రి సినిమా సూపర్ హిట్ అయ్యిందో.. ఇండస్ట్రీ హిట్ గా నిలిచిందో అప్పటి నుండి టాలీవుడ్ స్టార్ హీరోలకు సరసన నిలిచేలా రెమ్యూనరేషన్ విషయంలో టాప్ ఫైవ్ గా ఉంటూ వస్తున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోల అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోగా కూడా ఎన్టీఆర్ పేరు దక్కించుకున్నాడు అంటూ ఆయన అభిమానులు మాట్లాడుకుంటున్నారు.
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్టెల్లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
This website uses cookies.