Jr Ntr Trivikram : ఎన్టీఆర్.. త్రివిక్ర‌మ్ కార్తికేయుడి క‌థ ఇదేనా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Jr Ntr Trivikram : ఎన్టీఆర్.. త్రివిక్ర‌మ్ కార్తికేయుడి క‌థ ఇదేనా..?

 Authored By ramu | The Telugu News | Updated on :14 June 2025,4:00 pm

ప్రధానాంశాలు:

  •  Jr Ntr Trivikram : ఎన్టీఆర్.. త్రివిక్ర‌మ్ కార్తికేయుడి క‌థ ఇదేనా..?

Jr Ntr Trivikram : అల్లు అర్జున్‌తో త్రివిక్రమ్‌ చేయాల్సిన సోషియో, మైథలాజికల్‌ మూవీ ఇప్పుడు ఎన్టీఆర్‌ను వరించిందని సమాచారం. అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ సినిమా చేస్తుండటంతో ఇక సుదీర్ఘ నిరీక్షణ ఇష్టం లేక త్రివిక్రమ్‌..ఎన్టీఆర్‌ వైపు మళ్లారని ఇన్‌సైడ్‌ టాక్‌.అయితే ఈ లేటెస్ట్‌ డెవలప్‌మెంట్‌తో ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ ఖుషీగా ఉన్నారు. ఎందుకంటే గతంలో త్రివిక్రమ్‌-ఎన్టీఆర్‌ కాంబోలో ‘అరవిందసమేత వీరరాఘవ’ వంటి బ్లాక్‌బస్టర్‌ వచ్చింది…

Jr Ntr Trivikram ఎన్టీఆర్ త్రివిక్ర‌మ్ కార్తికేయుడి క‌థ ఇదేనా

Jr Ntr Trivikram : ఎన్టీఆర్.. త్రివిక్ర‌మ్ కార్తికేయుడి క‌థ ఇదేనా..?

Jr Ntr Trivikram : క్రేజీ స్టోరీతో..

మ‌రోసారి వారిద్దరి కాంబినేషన్‌ రిపీట్‌ కాబోతుండటం, అందునా పౌరాణికాలకు పర్‌ఫెక్ట్‌ ఛాయిస్‌ ఎన్టీఆర్‌ అనే పేరు ఉండటంతో ఆయన అభిమానులు హ్యాపీగా ఉన్నారు.ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడకపోయినా.. నిర్మాత సూర్యదేవర నాగవంశీ తన ఎక్స్‌ (ట్విట్టర్‌)లో పెట్టిన పోస్ట్‌లు ఈ వార్తను ధృవీకరించేలా ఉన్నాయి. ‘నేను అభిమానించే అన్న.. అత్యంత ఇష్టమైన దేవుడి పాత్రలో..’ ‘గాడ్‌ ఆఫ్‌ వార్‌ ఈజ్‌ కమింగ్‌’ అంటూ నాగవంశీ పోస్ట్‌లు పెట్టారు. వీటితో పాటు కార్తికేయుడి తాలూకు సంస్కృత శ్లోకాలను రాసుకొచ్చారు.

ఎన్టీఆర్‌ను ఉద్దేశించే ‘ఫేవరేట్‌ అన్న..’ అని ఆయన పోస్ట్‌ చేశారని టాక్‌. ఇక ఈ సినిమా కథ గురించి గతంలోనే వార్తలొచ్చాయి. హిందూ ధర్మంలో యుద్ధం, విజయానికి ప్రతీకలా భావించే శివుడి తనయుడు కార్తికేయుడి కథ ఇదని సమాచారం. పురాణాలకు, నేటి సాంఘిక అంశాలకు ముడిపెట్టి దర్శకుడు త్రివిక్రమ్‌ అద్భుతమైన స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారంటున్నారు. శివ పురాణం, స్కంధ పురాణం ఆధారంగా క‌థ రూపొందించి ఉంటారేమో అంటున్నారు. కార్తికేయుని జనానికి కారణం తారకాసురుడు.పూర్వకాలంలో తారకాసురుడు అనే రాక్షసుడు కఠినమైన తపస్సు చేసి బ్రహ్మదేవుని నుండి ఒక వరం పొందుతాడు. తారకాసురుడు అమరత్వాన్ని కోరగా, బ్రహ్మ నిరాకరిస్తాడు.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది