Jr NTR vs Chiranjeevi : జూనియర్ ఎన్టీఆర్ వర్సెస్ చిరంజీవి.. టాలీవుడ్ మొత్తం షేక్.. రికార్డులు బ్రేక్
Jr NTR vs Chiranjeevi: జూనియర్ ఎన్టీఆర్, మెగాస్టార్ చిరంజీవి మధ్య ఇప్పుడేం టాలీవుడ్ ను షేక్ చేసే న్యూస్ ఉంది అని అనుకుంటున్నారా? ఇది ఇప్పటిది కాదు.. ఇంద్ర సినిమా రిలీజ్ సమయంలో జరిగిన రచ్చ గురించే ఇప్పుడు మనం మాట్లాడుకునేది. మీకు గుర్తుందా.. 2002 సంవత్సరంలో జులైలో ఒక వారం వ్యవధిలో రిలీజ్ అయిన రెండు సినిమాలు ఎంత సంచలనం సృష్టించాయో. ఎంత హడావుడి చేశాయో.ఆ రెండు సినిమాలు ఎవరివో కాదు. మెగాస్టార్ చిరంజీవి సినిమా ఇంద్ర, మరోటి.. జూనియర్ ఎన్టీఆర్ మూవీ అల్లరి రాముడు.
జులై 18న అల్లరి రాముడు సినిమా రిలీజ్ కాగా.. సరిగ్గా వారం తర్వాత జులై 24న ఇంద్ర సినిమా రిలీజ్ అయింది.ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. రెండు సినిమాలకు డైరెక్టర్ ఒక్కరే. ఆయనే బీ గోపాల్. అప్పట్లో వరుస ప్లాఫ్ లతో సతమతమవుతున్నారు మెగాస్టార్. మృగరాజు, మంజునాథ, డాడీ సినిమాలు ఫ్లాప్ అవడంతో తన తదుపరి సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసేది కావాలని ఇంద్ర సినిమా చేస్తున్నారు.అదే సమయంలో ఆది సినిమా హిట్ జోరు మీద ఉన్నాడు జూనియర్ ఎన్టీఆర్.

junior ntr vs megastar chiranjeevi fight in tollywood in indra time
Jr NTR vs Chiranjeevi vs Chiranjeevi : రెండు సినిమాలకు ఒకరే డైరెక్టర్
ఆది సినిమా తర్వాత సినిమా అల్లరి రాముడు కావడంతో ఆ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. దీంతో అల్లరి రాముడు సినిమాకు భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇంద్ర సినిమాకు కూడా బాగా హైప్ వచ్చింది.అలాగే.. మెగాస్టార్, నందమూరి అభిమానుల మధ్య జోరుగా చర్చలు కూడా సాగాయి. మా హీరో సినిమా హిట్టు.. అంటే మా హీరో సినిమా హిట్టు అంటూ పందేలు కూడా కాసుకున్నారు. అయితే.. చిరంజీవి సినిమా ఇంద్ర సూపర్ డూపర్ హిట్ అయింది.
ఇండస్ట్రీ రికార్డులనే బ్రేక్ చేసింది.కానీ.. అల్లరి రాముడు మాత్రం అనుకున్నంతగా హిట్ కాలేదు. ఆ సినిమా అంచనాలు తప్పాయి. కాకపోతే.. ఆ సినిమాకు లాభాలు బాగానే వచ్చాయి కానీ.. సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు. అలా.. అప్పట్లో చిరంజీవి వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్ అన్నట్టుగా టాలీవుడ్ మొత్తం షేక్ అయింది.