Home » Entertainment » Junior Ntr Answer To Lakshmi Pranathi
Entertainment

Junior NTR : పెళ్లి చూపుల్లో జూనియర్ ఎన్టీఆర్ ని ప్రణతి ఏమని అడిగిందో తెలుసా.. దెబ్బకి ఎన్టీఆర్ కి మైండ్ బ్లాక్ – చిన్నపిల్లకి ఇది ఎలా తెలుసు అనుకున్నాడు !

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: January 19, 2023, 12:59 pm
Advertisement

Junior NTR : టాలీవుడ్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఎటువంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నందమూరి తారక రామారావు మనవడిగా ఇండస్ట్రీ లో అడుగు పెట్టిన ఎన్టీఆర్ తన టాలెంట్ తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఎన్టీఆర్ సినిమాల పరంగానే కాదు వ్యక్తిగతంగా కూడా మంచి మార్కులు వేయించుకున్నాడు. ఇక ఆయన ఇమేజ్ ని ఏమాత్రం తగ్గనీయకుండా భర్త అడుగుజాడల్లోని నడుస్తుంది ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి. కొందరు స్టార్ హీరోల భార్యలు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫోటోషూట్లతో అభిమానులను అలరిస్తుంటారు. లక్ష్మీ ప్రణతి మాత్రం తన భర్త పిల్లలతో సంతోషంగా లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది.

Advertisement

లక్ష్మీ ప్రణతి బయట ఎక్కువగా కనిపించరు. ఎప్పుడైనా తమ ఫ్యామిలీ ఫంక్షన్స్ లోనే కనిపిస్తారు. అయితే సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఎన్టీఆర్ మాత్రం పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే వీళ్లిద్దరి పెళ్లిచూపులు చాలా ట్రెడిషనల్ గా జరిగాయి. అయితే ఈ పెళ్లి చూపుల్లో లక్ష్మీ ప్రణతి ఎన్టీఆర్ని ఓ ప్రశ్న అడిగిందట. లక్ష్మీ ప్రణతి ఎన్టీఆర్ తో మాట్లాడుతూ మీకు మీ అమ్మగారు అంటే చాలా ఇష్టం కదా పెళ్లి అయ్యాక నన్ను ఎక్కువగా ఇష్టపడతారా మీ అమ్మగారిని ఎక్కువగా ఇష్టపడతారా అని ఎన్టీఆర్ ని అడిగారట.

Junior NTR answer to Lakshmi pranathi

Advertisement

అప్పటివరకు సైలెంట్ గా ఉన్న ఎన్టీఆర్ ఆమె ఆ ప్రశ్న అడగడంతో ఒక్కసారిగా షాక్ అయిపోయాడు. నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం. మా అమ్మలాగే నిన్ను చూసుకుంటా నీలో మా అమ్మని చూసుకుంటా అని బదులిచ్చాడంట. దీంతో లక్ష్మీ ప్రణతి చిరునవ్వు నవ్వుతూ ఎన్టీఆర్ అంటే నాకు ఇష్టమే అని పెద్దల ముందు చెప్పిందట. ఏదేమైనా టాలీవుడ్ లో ఈ జంటకు మంచి గుర్తింపు ఉంది. ఇక సినిమాల పరంగా ఎన్టీఆర్ కొరటాల శివతో ఓ సినిమాలో నటించబోతున్నాడు. ఈ సినిమా స్క్రిప్ట్ ఇంకా పూర్తి కాకపోవడంతో ఫిబ్రవరి నెలలో సెట్స్ మీదకు వెళ్లనుందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి