Junior NTR : “నన్ను క్షమించు” ఆ హీరోయిన్ కి ఫోన్ చేసి బాధ పడిన తారక్ .. అసలేమైంది ? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Junior NTR : “నన్ను క్షమించు” ఆ హీరోయిన్ కి ఫోన్ చేసి బాధ పడిన తారక్ .. అసలేమైంది ?

Junior NTR : యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు కేవలం తెలుగు సినిమా ఇండస్ట్రీకే పరిమితం కాదు. ఆయన ఇప్పుడు గ్లోబల్ స్టార్. అంచెలంచెలుగా ఎదిగారు. ఇప్పుడు అంతర్జాతీయ నటుడిగా ఎదిగారు. నందమూరి వంశం పేరు చెప్పుకొని ఇండస్ట్రీకి వచ్చినా ఆ పేరుతో ఎక్కువ కాలం సినిమాలు తీయలేదు. తన సొంత కష్టాన్ని నమ్ముకున్నారు. తన టాలెంట్ తో ఇండస్ట్రీలో ఇప్పుడు టాప్ హీరోగా వెలుగొందుతున్నారు. హాలీవుడ్ డైరెక్టర్లు కూడా ఇప్పుడు ఎన్టీఆర్ తో సినిమా […]

 Authored By kranthi | The Telugu News | Updated on :28 April 2023,6:00 pm

Junior NTR : యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు కేవలం తెలుగు సినిమా ఇండస్ట్రీకే పరిమితం కాదు. ఆయన ఇప్పుడు గ్లోబల్ స్టార్. అంచెలంచెలుగా ఎదిగారు. ఇప్పుడు అంతర్జాతీయ నటుడిగా ఎదిగారు. నందమూరి వంశం పేరు చెప్పుకొని ఇండస్ట్రీకి వచ్చినా ఆ పేరుతో ఎక్కువ కాలం సినిమాలు తీయలేదు. తన సొంత కష్టాన్ని నమ్ముకున్నారు. తన టాలెంట్ తో ఇండస్ట్రీలో ఇప్పుడు టాప్ హీరోగా వెలుగొందుతున్నారు. హాలీవుడ్ డైరెక్టర్లు కూడా ఇప్పుడు ఎన్టీఆర్ తో సినిమా తీయడానికి ఉత్సుకత చూపిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో తారక్ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.

junior ntr called to that heroine and said sorry

junior ntr called to that heroine and said sorry

ఓ హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ గన్ కూడా జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా తీయాలని ఉందని తన మనసులో మాటను చెప్పారు. దీంతో జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రతి విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎన్టీఆర్ బయటికి చాలా ఆవేశపరుడిలా కనిపిస్తారు కానీ.. ఆయన చాలా సున్నితమైన మనసు కలవారు అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ఆయన గురించి ఓ విషయాన్ని వైరల్ చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన యమదొంగ సినిమాకి సంబంధించి ఓ విషయం వైరల్ అవుతోంది.

Junior NTR big mistake on that movie

Junior NTR big mistake on that movie

Junior NTR :ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన యమదొంగ

ఈ సినిమాలో హీరోయిన్లుగా ప్రియమణి, మమతామోహన్ దాస్ నటించారు. ఒలమ్మి తిక్కరేగిందా అనే పాట ఎంత ఫేమస్సో తెలుసు కదా. ఈ సినిమాలో ఆ పాట ఫేమస్ అవడమే కాదు.. అప్పట్లో మారుమోగిపోయింది. అది సీనియర్ ఎన్టీఆర్ పాట. దాన్ని రీమిక్స్ చేశారు. ఆ పాటలో మమతా మోహన్ దాస్ బ్యాక్ ను కొట్టాలి. ఆ సినిమాలో భాగంగా ఎన్టీఆర్ ఆమె బ్యాక్ ను వాయించాలి. డైరెక్టర్ చెప్పడం వల్ల కాదనలేక అలా చేశాడట తారక్ కానీ.. పాట పూర్తయ్యాక మమతకు ఫోన్ చేసి మరీ.. అలా చేసినందుకు సారీ చెప్పాడట. అంత పెద్ద హీరో.. దానికి సారీ చెప్పడం చూసి మమతా మోహన్ దాస్ కూడా ఫిదా అయిపోయిందట.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది