Jr NTR : సంచలనం సృష్టిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ సింహాద్రి సినిమా స్పెషల్ షో లు..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Jr NTR : సంచలనం సృష్టిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ సింహాద్రి సినిమా స్పెషల్ షో లు..!!

Jr NTR : ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోల పాత సినిమాలు రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. పోకిరి సినిమాతో మొదలైన ఈ ట్రెండ్ జల్సా, ఖుషి, చెన్నకేశవరెడ్డి, ఆరెంజ్, దేశముదురు లాంటి సినిమాలతో మరో లెవల్ కు చేరింది. ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ పాత సినిమాను విడుదల చేసేందుకు అభిమానులు భారీగా సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ ఆంధ్రావాలా సినిమా రీ రిలీజ్ అయింది కాని దీనికి సరైన ప్లానింగ్, ప్రమోషన్స్ లేక […]

 Authored By prabhas | The Telugu News | Updated on :25 April 2023,12:00 pm

Jr NTR : ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోల పాత సినిమాలు రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. పోకిరి సినిమాతో మొదలైన ఈ ట్రెండ్ జల్సా, ఖుషి, చెన్నకేశవరెడ్డి, ఆరెంజ్, దేశముదురు లాంటి సినిమాలతో మరో లెవల్ కు చేరింది. ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ పాత సినిమాను విడుదల చేసేందుకు అభిమానులు భారీగా సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ ఆంధ్రావాలా సినిమా రీ రిలీజ్ అయింది కాని దీనికి సరైన ప్లానింగ్, ప్రమోషన్స్ లేక అట్టర్ ప్లాఫ్ గా నిలిచింది. దీంతో ఎన్టీఆర్ అభిమానులు ఈసారి గట్టి ప్లాన్ తో సింహాద్రి సినిమాను విడుదల చేస్తున్నారు.

Junior NTR Simhadri Movie Special Shows

Junior NTR Simhadri Movie Special Shows

జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ సినిమా సింహాద్రిని తారక్ బర్త్ డే సందర్భంగా రీ రిలీజ్ చేయనున్నారు. సింహాద్రి సినిమాను కేవలం రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా వరల్డ్ వైడ్ గా తెలుగు వాళ్ళు ఉన్న చాలాచోట్ల భారీగా షోలు ప్లాన్ చేస్తున్నారు. ఆస్ట్రేలియాలో అయితే సింహాద్రి సినిమా హావా మామూలుగా లేదు. విడుదలకు నెల రోజుల ముందే అక్కడ బుకింగ్స్ మొదలుపెట్టగా, అప్పుడే ప్రీ సేల్స్ ద్వారా 4 వేల డాలర్ల దాకా వసూళ్లు నమోదు అయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

Sai Pallavi Dominating in Junior NTR

Sai Pallavi Dominating in Junior NTR

ప్రపంచంలోనే అతిపెద్ద ఐమాక్స్ స్క్రీన్ లలో సింహాద్రి సినిమా విడుదల కానుంది. మే 20 మేల్ బోర్న్ లోని భారీ ఐమాక్స్ థియేటర్లో ఈ సినిమాకి టాలీ మూవీస్ సంస్థ స్పెషల్ షో ప్లాన్ చేసింది. అంత పెద్ద స్క్రీన్ 20 ఏళ్ల కిందటి సినిమాకు కేటాయించడం విశేషం. ఆస్ట్రేలియాలోనే కాకుండా యూఎస్, కెనడా, ఇంగ్లాండ్ తదితర దేశాల్లో సింహాద్రి స్పెషల్ షోలు భారీగానే పడనున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాలలో కూడా ఈ సినిమా రిలీస్ ప్లాన్ గట్టిగానే ఉంది. ఏది ఏమైనా తారక్ బర్త్ డే రోజు హంగామా మామూలుగా ఉండదు అనిపిస్తుంది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది