Junior NTR : సాయి ధరమ్ తేజ్ కోసం తరలి వస్తున్న జూనియర్ ఎన్టీఆర్.. ఇద్దరి మధ్య అంత ఫ్రెండ్ షిప్ ఉందా?

Authored By Breaking News 2 | The Telugu News | Published on: December 2, 2022, 10:30 am

Junior NTR : సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ తెలుసు కదా. ఆ మధ్య యాక్సిడెంట్ అవడంతో చాలా నెలల పాటు బెడ్ కే పరిమితం అయిపోయాడు. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ కోలుకున్నాడు. ఆయన కోలుకున్నాక కార్తీక్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాకు ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. అది సాయి ధరమ్ తేజ్ కు 15వ సినిమా. ఆ సినిమా టైటిల్ టీజర్ ను త్వరలో రిలీజ్ చేయనున్నారు. సాయి ధరమ్ తేజ్ హీరోగా వస్తున్న 15 వ సినిమా అది.

అయితే ఆ సినిమా టైటిల్ టీజర్ ను జూనియర్ ఎన్టీఆర్ రిలీజ్ చేయనున్నాడట. నిజానికి సాయి ధరమ్ తేజ్, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరూ ఫ్రెండ్స్. రామ్ చరణ్ కూడా వీళ్లకు బెస్ట్ ఫ్రెండ్. ఈ ముగ్గురు కలిసి అప్పుడప్పుడు కలుస్తుంటారు. సరదాగా ఔటింగ్ కు వెళ్తుంటారు. అయితే.. సాయి ధరమ్ తేజ్ తో జూనియర్ ఎన్టీఆర్ కు మంచి స్నేహం ఉండటం వల్లనే సాయి సినిమా టైటిల్ టీజర్ ను విడుదల చేసేందుకు ఒప్పుకున్నట్టు తెలుస్తోంది.

junior ntr to release sai dharam tej new movie teaser

junior ntr to release sai dharam tej new movie teaser

Junior NTR : సాయితో ఉన్న స్నేహం వల్లనే జూనియర్ ఎన్టీఆర్ వస్తున్నాడా?

అయితే.. సాయి ధరమ్ తేజ్ తన యాక్సిడెంట్ తర్వాత చాలా రోజులకు కోలుకొని సినిమా తీస్తుండటంతో ఎన్టీఆర్ ఆ సినిమా టీజర్ ను విడుదల చేస్తున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో ఒక సినిమాను ప్రమోట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అలాగే.. ఆ సినిమాకు బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కాంతారా ఫేమ్ అజనీష్ మ్యూజిక్ డైరెక్టర్. సంయుక్త మీనన్ హీరోయిన్.

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp